న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ సంస్థ ఐన ఇండియన్ రెనేవేబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ ( IREDAL ) నుండి నోటిఫికేషన్ వెలువడింది. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత మరియు ఆశక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవలెను.
ముఖ్యమైన తేదీలు :
- ధరఖాస్తు ప్రారంభ తేదీ – 14 – మార్చి – 2026
- దరఖాస్తు ముగింపు తేదీ – 03 – ఏప్రిల్ – 2026
పోస్టుల పేర్లు మరియు ఖాళీలు :
- జనరల్ మేనేజర్ – 10
- చీఫ్ మేనేజర్ – 05
- అడిషనల్ జనరల్ మేనేజర్ – 01
- డిప్యూటీ జనరల్ మేనేజర్ – 02
- ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ – 01
- మేనేజర్ – 02
- అసిస్టెంట్ మేనేజర్ – 03
- ఆఫీసర్ – 08
మొత్తం ఖాళీలు – 32
అర్హతలు :
జనరల్ మేనేజర్ ( ఫైనాన్స్ మరియు అకౌంట్ ) :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఛార్టర్డ్ అకౌంటెంట్ ( CA ) / కాస్ట్ మరియు మానేజ్మెంట్ అకౌంటెంట్ ( CMA ) / MBA లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లో మానేజ్మెంట్ ( ఫైనాన్స్ ) లో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి
- 20 సంవత్సరాలు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో పని అనుభవం ఉండాలి
- ఫైనాన్స్ మరియు అకౌంట్స్ విభాగంలో ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్ / NBFCs / పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్ / సెంట్రల్ గవర్నమెంట్ / రాష్ట్ర ప్రభుత్వం / ప్రైవేట్ సెక్టార్ లో అనుభవం ఉండాలి
- CTC సంవత్సరానికి ప్రైవేట్ సెక్టార్ అభ్యర్థులకు రూ.52.27 లక్షలు కంటే తక్కువగా ఉండరాదు
వయస్సు : 03 – ఏప్రిల్ – 2026 నాటికి 52 సంవత్సరాలు లోపు ఉండాలి
జీతం : నెలకు రూ.1,20,000 నుండి రూ.2,80,000 ఉంటుంది
జనరల్ మేనేజర్ ( ఫైనాన్స్ మరియు అకౌంట్స్ – ఇన్వెస్టర్ రిలేషన్స్ ) :
- చార్టర్డ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ లేదా MBA లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా మానేజ్మెంట్ ( ఫైనాన్స్ ) లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉత్తీర్ణతను కలిగి ఉండవలెను
- ఎగ్జిక్యూటివ్ స్థాయిలో 20 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి
- ఇన్వెస్టర్ రిలేషన్ లేదా Finance మరియు Accounts లో అనుభవం ఉండాలి
- ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్ లేదా NBFC / Publice సెక్టార్ / కేంద్ర ప్రభుత్వం / రాష్ట్ర ప్రభుత్వం / ప్రైవేట్ సెక్టార్ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉండాలి
- ప్రైవేట్ సెక్టార్ అభ్యర్థులకు CTC సంవత్సరానికి రూ.52.27 లక్షలు కంటే తక్కవగా ఉండరాదు
వయస్సు : 52 సంవత్సరాలు మించి ఉండరాదు
జీతం : నెలకు రూ.1,20,000 నుండి రూ.2,80,000 వరకు ఉంటుంది
చీఫ్ మేనేజర్ ( ఫైనాన్స్ మరియు అకౌంట్స్ ) :
- ఛార్టర్ట్ అకౌంటెంట్ లేదా కాస్ట్ మరియు మేనేజ్మెంట్ అకౌంటెంట్ లేదా MBA / పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా మేనేజ్మెంట్ లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అర్హతను కలిగి ఉండవలెను
- 11 సంవత్సరాలు ఎగ్జిక్యూటివ్ లెవెల్ లో అనుభవం ఉండాలి
- ఫైనాన్స్ మరియు అకౌంట్స్ విభాగంలో పని చేసిన అనుభవం ఉండాలి
- ప్రస్తుతం ప్రైవేట్ రంగంలో అభ్యర్థులకు CTC సంవత్సరానికి రూ.37.70 లక్షలు కంటే తక్కువగా ఉండరాదు
వయస్సు : 42 సంవత్సరాలు మించి ఉండరాదు
జీతం : నెలకు రూ.80,000 నుండి రూ.2,20,000 వరకు ఉంటుంది
జనరల్ మేనేజర్ ( ప్రాజెక్ట్ ) :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి B.E /B.Tech / B.Sc ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణతను కలిగి ఉండవలెను
- ఎగ్జిక్యూటివ్ లెవెల్ లో 20 సంవత్సరాలు అనుభవం ఉండాలి
- Energy రంగం / Renewable Energy రంగంలో పనిచేసిన అనుభవం ఉండాలి
- ప్రాజెక్ట్ Appraisal, ప్లానింగ్, Evaluation,Monitoring లో అనుభవం ఉండాలి
- ప్రస్తుతం ప్రైవేట్ రంగంలో పనిచేసే అభ్యర్థులకు CTC సంవత్సరానికి 52.27 లక్షలు కంటే తక్కువగా ఉండరాదు
వయస్సు : 52 సంవత్సరాలు మించి ఉండరాదు
జీతం : నెలకు రూ.1,20,000 నుండి రూ.2,80,000 వరకు ఉంటుంది
అడిషనల్ జనరల్ మేనేజర్ ( ప్రాజెక్ట్స్ ) :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి B.E / B.Tech / B.Sc ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణతను సాధించి ఉండాలి
- 17 సంవత్సరాలు ఎగ్జిక్యూటివ్ లెవెల్ లో అనుభవం ఉండాలి
- Appraisal, Planning,Evaluation,Monitoring లో అనుభవం ఉండాలి
- ఫైనాన్సియల్ Institution / NBFC / PSU / ప్రభుత్వ / ప్రైవేట్ రంగంలో పనిచేసిన అనుభవం ఉండాలి
- ప్రైవేట్ రంగంలో పనిచేసే అభ్యర్థులకు సంవత్సరానికి CTC రూ.46.40 లక్షలు కంటే తక్కువ కాకూడదు
వయస్సు : 48 సంవత్సరాల లోపు ఉండాలి
జీతం : నెలకు రూ.1,00,000 నుండి రూ.2,60,000 వరకు ఉంటుంది
డిప్యూటీ జనరల్ మేనేజర్ ( ప్రాజెక్ట్స్ ) :
- B.E / B.Tech / B.Sc ఇంజనీరింగ్ లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉత్తీర్ణతని కలిగి ఉండాలి
- ఎగ్జిక్యూటివ్ లెవెల్ లో 14 సంవత్సరాలు అనుభవం ఉండాలి
- కనీసం 1 సంవత్సరం ప్రస్తుత పేస్కేల్ లో పనిచేసిన అనుభవం ఉండాలి
- CTC సంవత్సరానికి ప్రైవేట్ సెక్టార్ లో పనిచేసే అభ్యర్థులకు రూ.41.56 లక్షలు కంటే తక్కువ కాకూడదు
వయస్సు : 45 సంవత్సరాలు లోపు ఉండాలి
జీతం : నెలకు రూ.90,000 నుంచి రూ.2,40,000 వరకు ఉంటుంది
చీఫ్ మేనేజర్ ( ప్రాజెక్ట్స్ ) :
- బీఈ,బీటెక్,బీఎస్సీ ఇంజనీరింగ్ లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉత్తీర్ణతను కలిగి ఉండాలి
- 11 సంవత్సరాలు ఎగ్జిక్యూటివ్ లెవెల్ లో అనుభవం ఉండాలి
- ప్రస్తుత పేస్కేల్ లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి
- సంవత్సరానికి CTC రూ.37.70 లక్షలు కంటే తక్కువగా ప్రైవేట్ రంగంలో పనిచేసే అభ్యర్థులకు ఉండరాదు
వయస్సు : 42 సంవత్సరాలు మించి ఉండరాదు
జీతం : నెలకు రూ.80,000 నుండి రూ.2,20,000 వరకు ఉంటుంది
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ( కంపెనీ సెక్రటరీ ) :
- ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా ( CISI ) లో అసోసియేట్ నెంబర్ అయి ఉండాలి
- Listed కంపెనీ లో కనీసం 15 సంవత్సరాల అనుభవం తప్పనిసరిగా ఉండాలి
- ఎగ్జిక్యూటివ్ లెవెల్ లో 23 సంవత్సరాల అనుభవం ఉండాలి
- ప్రైవేట్ రంగంలో పనిచేసే అభ్యర్థులకు సంవత్సరానికి CTC రూ.61.87 లక్షలు కంటే తక్కువ ఉండరాదు
వయస్సు : గరిష్టంగా 55 సంవత్సరాలు ఉండాలి
జీతం : నెలకు రూ.1,50,000 నుండి రూ.3,00,000 వరకు ఉంటుంది
మేనేజర్ ( LAW ) :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ మరియు LLB లో 3 సంవత్సరాలు లేదా ఇంటిగ్రేటెడ్ LAW కోర్స్ లో 5 సంవత్సరాలు పూర్తిచేసి ఉండాలి
- 4 సంవత్సరాలు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అనుభవం ఉండాలి
- పబ్లిక్ రంగం / ప్రభుత్వ / ప్రైవేట్ రంగంలో Legal సర్వీసెస్ లో పనిచేసిన అనుభవం ఉండాలి
- ప్రైవేట్ రంగం వారికి CTC సంవత్సరానికి రూ.29.18 లక్షలు కంటే తక్కువ కాకూడదు
వయస్సు : 35 సంవత్సరాల లోపు ఉండాలి
జీతం : నెలకు రూ.60,000 నుండి రూ.1,80,000 వరకు ఉంటుంది
అసిస్టెంట్ మేనేజర్ ( బిజినెస్ డెవలప్మెంట్ ) :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి MBA లేదా మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి
- ఎగ్జిక్యూటివ్ స్థాయిలో 2 సంవత్సరాలు అనుభవం ఉండాలి
- పబ్లిక్ / ప్రభుత్వ / ప్రైవేట్ రంగాలలో Business Development లో పనిచేసిన అనుభవం ఉండాలి
- ప్రైవేట్ రంగంలో అభ్యర్థులకు CTC సంవత్సరానికి 12 లక్షలు కంటే తక్కువ కాకూడదు
వయస్సు : 33 సంవత్సరాలు ఉండాలి
జీతం : నెలకు రూ.40,000 నుండి రూ.1,40,000 వరకు ఉంటుంది
ఆఫీసర్ – జనరల్ ( హ్యూమన్ రిసోర్స్ ) :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ , కనీసం 2 సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేట్ లో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి
- 10 సంవత్సరాల అనుభవం ఉండాలి
- హ్యూమన్ రిసోర్సెస్ / అడ్మినిస్ట్రేషన్ / ఫైనాన్స్ మరియు అకౌంట్స్ / ప్రాజెక్ట్స్ మొదలగు వాటిలో పబ్లిక్ లేదా ప్రభుత్వ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉండాలి
- ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే అభ్యర్థులకు CTC సంవత్సరానికి 8 లక్షలు కంటే తక్కువ కాకూడదు
వయస్సు : 50 సంవత్సరాలలోపు ఉండాలి
జీతం : నెలకు రూ.30,000 నుండి రూ.1,20,000 వరకు ఉంటుంది
దరఖాస్తు ఫీజు :
- ఫీజు రూ.1000/- ఎస్సీ ,ఎస్టీ,పీడబ్ల్యూబీడీ,ఎక్స్ – సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది
ఎంపిక విధానం :
- ఆన్ లైన్ ద్వారా వచ్చిన అప్లికేషన్స్ ను పరిశీలించి అర్హత కలిగిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు
- పోస్టుకు సంబంధించిన టెక్నీకల్ నాలెజ్ మరియు అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
- ఇంటర్వ్యూ కి అర్హత కలిగిన మరియు షార్ట్ లిస్ట్ ఐన అభ్యర్థులను మాత్రమే పిలుస్తారు
- ఈమెయిల్ ద్వారా మాత్రమే ఇంటర్వ్యూ Date,Place,Time వివరాలను తెలియజేస్తారు
- రాత పరీక్ష / ఇంటర్వ్యూ అవసరమైనప్పుడు నిర్వహించటానికి కంపెనీ తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది
- ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ ఎంపిక జరుగుతుంది. ఈమెయిల్ లేదా అడ్రస్ ద్వారా ఎంపికైనా అభ్యర్థులకు సమాచారం తెలియజేస్తారు
- ఇంటర్వ్యూ కి ముందు ఒరిజనల్ డాక్యుమెంట్సను వెరిఫికేషన్ చేస్తారు
దరఖాస్తు విధానం :
- దరఖాస్తును ఆన్ లైన్ లో మాత్రమే అప్లై చేయవలెను
- అప్లికేషన్ ను పూర్తిచేసే సమయంలో అభ్యర్థి ఇచ్చే వివరాలు సరైనవై ఉండాలి. లేని యెడల అప్లికేషన్ రద్దు అవుతుంది
- అభ్యర్థి యాక్టివ్ గ ఉన్న ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ ఇవ్వవలెను
- విద్యా అర్హతకు సంబంధించిన పాస్ సర్టిఫికెట్లును మరియు మార్క్స్ షీట్ లను, ఇతర క్వాలిఫికేషన్స్ సర్టిఫికెట్లు ఉంటే వాటిని అప్లోడ్ చెయ్యాలి
- ఒకటి కంటే ఎక్కువ సంస్థల్లో పనిచేసి ఉంటే ప్రతి సంస్థకి విడివిడిగా Experience డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయవలెను