భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL నోటిఫికేషన్ 2026 | ఇంజనీర్ ఖాళీలు – 18

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ( BEL ) నుండి  నోటిఫికేషన్ విడుదల అయ్యింది. నెట్ వర్క్ మరియు సైబర్ సెక్యూరిటీ విభాగంలో ఖాళీగా ఉన్న ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ మరియు ప్రాజెక్ట్ ఇంజనీర్ – 1 పోస్టులను భర్తీ చేయటానికి తాత్కాలిక ప్రాతిపదికన అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవలెను. ఎంపికైన అభ్యర్థులు న్యూఢిల్లీ లో పని చేయవలసి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభ తేదీ – 10 – మార్చి – 2026
  • దరఖాస్తు ముగింపు తేదీ – 24 – మార్చి – 2026

పోస్టుల పేర్లు మరియు ఖాళీలు :

  • ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ ( FOE ) – 06 ( జనరల్ – 2, EWS – 1, ఓబీసీ – 2, ఎస్సీ – 1 ) 
  • ప్రాజెక్ట్ ఇంజనీర్ – I – 12 ( జనరల్ – 5, EWS – 1, ఓబీసీ – 3,ఎస్సీ – 2, ఎస్టీ – 1 )

మొత్తం ఖాళీల సంఖ్య – 18

అర్హతలు :

ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి BE లేదా B.Tech లో కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ లో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి 
  • Cisco / Fortient / Juniper / Extreme / Arista నెట్ వర్క్స్ నుండి OEM సర్టిఫికెట్ను బేసిక్ లేదా అడ్వాన్సుడ్ స్థాయిలో పొంది ఉండవలెను 
  • లేదా F5/Trellix / Opentext / Fire Eye నుండి బేసిక్ లేదా అడ్వాన్సడ్ OEM సర్టిఫికెట్ను కలిగి ఉండాలి 
  • లేదా OSCP / CEH / CCNA / CCNP / CISP వీటిలో ఏదోఒక సర్టిఫికెట్ను కలిగి ఉండాలి 
  • 01- 02 – 2026 నాటికి ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్లకు కనీసం 5 సంవత్సరాలు పారిశ్రామిక అనుభవం ఉండవలెను

జాబ్ వివరాలు :

  • SIEM టూల్స్ ద్వారా వచ్చే సెక్యూరిటీ అలర్ట్స్ ను మోనిటర్ చేసి Triage చేయడం, True / False పాజిటివ్ ను గుర్తించడం 
  • రూటర్స్,స్విచ్స్, firewalls వంటి నెట్ వర్క్ హార్డ్ వేర్ configure, ఇనిస్టాల్ మరియు మేనేజ్ చేయవలెను 
  • నెట్వర్క్ diagrams, configurations సంబందించిన డాక్యుమెంట్స్ ను update చేసి maintain చెయ్యాలి
  • LAN, WAN, VPN నెట్ వర్కులను అమలు చేసి నెట్ వర్క్ పెరఫామెన్స్ ను మోనిటర్ చేయాలి   
  • నెట్ వర్క్ సెక్యూరిటీ మెయింటైన్ చేయాలి. ఫైరివాల్స్ రూల్స్, ACLs, IPS ను మేనేజ్ చెయ్యాలి 

ప్రాజెక్ట్ ఇంజనీర్ – I :

  • BE / B.Tech లో కంప్యూటర్ సైన్స్ లేదా సైబర్ సెక్యూరిటీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ లో ఏదైనా ఒక దానిలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉత్తీర్ణతను కలిగి ఉండవలెను 
  • బేసిక్ లేదా అడ్వాన్సడు స్థాయిలో Cisco / Fortient / Juniper / Extreme / Arsta నెట్ వర్క్ నుండి OEM సర్టిఫికెట్ ను కలిగి ఉండవలెను 
  • లేదా HEP / Hitachi / Dell / నెట్ యాప్ నుండి బేసిక్ లేదా అడ్వాన్సడ్ స్థాయిలో OEM సర్టిఫికెట్ ను కలిగి ఉండవలెను 
  • లేదా Sentine One / Palo Alto /Crowd Strike నుండి బేసిక్ లేదా అడ్వాన్సడ్ లెవెల్ లో OEM సర్టిఫికెట్ను కలిగి ఉండవలెను 
  • లేదా Comp TIA సర్టిఫికెట్ను కలిగి ఉండవలెను
  • ప్రాజెక్ట్ ఇంజనీర్లకు 01 – 02 – 2026 నాటికి కనీసం 2 సంవత్సరాలు పారిశ్రామిక అనుభవం ఉండాలి 

జాబ్ వివరాలు :

  • సర్వర్స్ మరియు స్టోరేజ్ సిస్టమ్స్ ను ఇనిస్టాల్ చేసి మెయింటైన్ చెయ్యాలి 
  • రూటర్స్,స్విచ్స్,Firewalls వంటి నెట్ వర్క్ Devices ను configure చేసి మేనేజ్ మరియు ట్రబుల్ షూట్ చేయాలి 
  • నెట్ వర్క్ Problems మరియు speed ను monitor చేసి ఫిక్స్ చేయాలి 
  • సిస్టమ్ ను సెక్యూరిటీ టూల్స్ ను ఉపయోగించి ప్రొటెక్ట్ చేయవలెను 
  • సెక్యూరిటీ సమస్యలు వచ్చినప్పుడు వాటిని Analyse చేయాలి
  • అవసరమైతే forensic ఇన్వెస్టిగేషన్ లో పాల్గొన వలెను 

వయస్సు : 

  • ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్లకు 35 సంవత్సరాలు, ప్రాజెక్ట్ ఇంజినీర్లకు 32 సంవత్సరాలు మించి ఉండరాదు.ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు,ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు,పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది 

జీతము :

  • ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్లకు నెలకు రూ.60,000. ప్రాజెక్ట్ ఇంజినీర్లకు నెలకు రూ.40,000. ( ప్రతి సంవత్సరం కాంట్రాక్టు పొడిగిస్తే రూ.5,000 పెరుగుతుంది ) అదనంగా ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ ప్రీమియం,Attire అలవెన్సు,Stiching చార్జెస్,Foot Wear అలవెన్స్ వంటి వాటికి అదనంగా రూ.12,000 చెల్లిస్తారు 

 Best Deal Today :

👉 Buy On Amazon

కాంట్రాక్ట్ కాల వ్యవధి :

  • ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్లకు జాయిన్ అయిన తేదీ నుండి 4 సంవత్సరాలు ఉంటుంది 
  • ప్రాజెక్ట్ ఇంజినీర్లకు జాయిన్ ఐన తేదీ నుండి మొదటి 3 సంవత్సరాలు కాల పరిమితి ఉంటుంది
  • ప్రాజెక్ట్ అభివృద్ధి మరియు అభ్యర్థి పనితీరును బట్టి 1 సంవత్సరం కొనసాగించ వచ్చును 

దరఖాస్తు ఫీజు :

  • జనరల్,ఓబీసీ అభ్యర్థులకు రూ.400 + 18% GST ఫీజు చెల్లించవలెను. ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది.

ఎంపిక విధానం :

  • రాత పరీక్ష ( Written Test ) మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది 
  • షార్ట్ లిస్ట్ ఐన అభ్యర్థులకు మొదట రాత పరీక్ష ఉంటుంది 
  • రాత పరీక్ష లో అర్హతను సాధించిన అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూ కి పిలుస్తారు 
  • బెంగుళూర్ మరియు ఢిల్లీ లో Written Test ఉంటుంది. ఇంటర్వ్యూ బెంగుళూర్ లో ఉంటుంది
  • రాత పరీక్షలో 85%, ఇంటర్వ్యూ లో 15% గా మార్కుల విభజన ఉంటుంది 
  • Written టెస్ట్ లో పాస్ ఐన అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో ( అంటే ప్రతి ఒక్క ఖాళీకి 5 అభ్యర్థులు ) మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ కి పిలుస్తారు 
  • రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ రెండింటిలోనూ జనరల్, OBC,EWS అభ్యర్థులు 35%, SC,ST,PwBD అభ్యర్థులు 30% కనీస అర్హత మార్కులను విడివిడిగా సాధించవలెను

గమనిక :

  • కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కి ఎంపికైన అభ్యర్థుల పేర్లను తెలియజేస్తారు 
  • ఈమెయిల్ ద్వారా మాత్రమే ఇంటర్వ్యూ మరియు కాల్ లెటర్స్ వివరాలు తెలియజేయబడతాయి 

దరఖాస్తు విధానం :

  • దరఖాస్తులను ఆన్ లైన్ లో మాత్రమే అప్లై చేయవలెను
  • అభ్యర్థి అన్ని వివరాలను నింపిన తరువాత మాత్రమే దరఖాస్తును సబ్మిట్ చేయాలి మరియు సబ్మిట్ చేయబడిన అప్లికేషను ప్రింట్ అవుట్ కూడా తీసుకోవలెను 
  • అభ్యర్థి వాడుకలో ఉన్న ఈమెయిల్ ఐడీ మరియు మొబైల్ నెంబర్ ను ఇవ్వవలెను 
  • అప్లికేషన్ ఫామ్ ప్రింట్ కాపీ, 2 పాస్ పోర్ట్ సైజు ఫొటోస్, సంబంధిత సర్టిఫికెట్స్ ను ఎంపిక సమయంలో తప్పని సరిగా తీసుకుని వెళ్ళవలెను 
  • అప్లికేషన్ సబ్మిట్ చేసాక రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మెయిల్ ఐడి కి వస్తాయి అందుకని ఆక్టివ్ లో ఉన్న మెయిల్ ఐడి మాత్రామే ఇవ్వాలి
  • ఒక్క సరి సబ్మిట్ చేయబడిన అప్లికేషను మార్పులు చేర్పులు చేయడానికి ఆవకాశం లేదు కాబట్టి సబ్మిట్ కి ముందు పూర్తి గా అప్లికేషను చెక్ చేసుకున్నాక మాత్రమే ఫైనల్ సబ్మిట్ చేయండి 
  • దరఖాస్తు ఫీజును SBI కలెక్ట ద్వారా ఆన్ లైన్ మోడ్ లోనే చెల్లించాలి 
  • అభ్యర్థులు బ్యాంక్ లో ఫీజు చెల్లించిన తరువాత బ్యాంకు అధికారుల సీల్ మరియు సంతకం తీసుకోవలెను 
  • అప్లికేషన్ ఫీజు ను చెల్లించిన తరువాత వచ్చిన ఫీజు Receipt అప్లికేషన్ తో పాటు అప్లోడ్ చేయవలెను

 

ఆన్లైన్ దరఖాస్తు లింక్ 

 Best Deal Today 👇

Safari Omega Spacious/Large 5 Compartment Laptop Backpack With Raincover, College Bag, Travel Bag For Unisex, Navy Blue, 30 Litre

👉 Buy On Amazon