సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( SECI )నోటిఫికేషన్ | మేనేజర్ ఖాళీలు -19

ఢిల్లీలోని సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( SECI ) నుండి నోటిఫికేషన్ వెలువడింది. రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవలెను 

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభ తేదీ – 23 – ఫిబ్రవరి – 2026
  • దరఖాస్తు ముగింపు తేదీ – 23 – మార్చి – 2026

పోస్టుల పేర్లు మరియు ఖాళీలు :

1.జనరల్ మేనేజర్ ( ప్రాజెక్ట్ ) – 01

2. మేనేజర్ ( ఫైనాన్స్ ) – 01

3. సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ – 03

4. జూనియర్ అకౌంటెంట్ – 02

5. సీనియర్ ఇంజనీర్ – 03

6. సీనియర్ కన్సల్టెంట్ – 09

మొత్తం ఖాళీలు – 19

అర్హతలు :

సెక్షన్ A – రెగ్యులర్ Positions 

1. జనరల్ మేనేజర్ ( ప్రాజెక్ట్ ) :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి B.E / B.Tech లో ఎలక్ట్రానిక్స్/ సివిల్ / మెకానికల్ / ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో 60% మార్కులను లేదా సస్సమానమైన అర్హతతో ఉత్తీర్ణతను సాధించి ఉండాలి 
  • అభ్యర్థి Qualification తరువాత power సెక్టార్ లో ఎగ్జిక్యూటివ్ స్థాయిలో కనీసం 22 సంవత్సరాల అనుభవం ఉండాలి 
  • ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్, ల్యాండ్ Acquisition, Liaisoning వంటి పనులలో అనుభవం ఉండాలి
  • థర్మల్ / హైడ్రో / విండ్ / సోలార్ / పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ లో కనీసం 5 సంవత్సరాలు అనుభవం ఉండాలి 

జీతం : నెలకు రూ.1,20,000 నుండి రూ.2,80,000

వయస్సు : 55 సంవత్సరాల లోపు ఉండాలి 

2. మేనేజర్ ( ఫైనాన్స్ ) :

  • గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ నుండి ఛార్టర్డ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ మరియు మానేజ్మెంట్ అకౌంటెంట్ లేదా ఫైనాన్స్ లో స్పెషలైజేషన్ తో MBA 2 సంవత్సరాలు ఫుల్ టైమ్ 60% మార్కులతో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి 
  • ఎగ్జిక్యూటివ్ స్థాయిలో కనీసం 7 సంవత్సరాలు అనుభవం ఉండాలి. ఇందులో 
  • ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్, రిస్క్ అనాలిసిస్, పవర్ ట్రేడింగ్, Balance Sheet Finalization మొదలగు విభాగాలలో కనీసం 5 సంవత్సరాలు అనుభవం ఉండాలి
  • ప్రభుత్వ రంగంలో అభ్యర్థులు SECI పే స్కేల్ రూ.60,000 – రూ.1,80,000 ( IDA ) లో 2 సంవత్సరాలు అనుభవం ఉండాలి 
  • ప్రైవేట్ రంగంలో అభ్యర్థులు కనీసం 2 సంవత్సరాలు Listed కంపెనీలో పనిచేసిన అనుభవం ఉండాలి 

జీతం : నెలకు రూ.70,000 నుండి రూ.2,00,000

వయస్సు : 40 సంవత్సరాల లోపు ఉండాలి

3. సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ :

  • ఛార్టర్డ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ మరియు మేనేజ్మెంట్ అకౌంటెంట్ లేదా ఫుల్ టైమ్ 2 సంవత్సరాలు MBA ఫైనాన్స్ లో Specialization తో గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ నుండి ఉత్తీర్ణతను కలిగి ఉండాలి 
  • పోస్ట్ క్వాలిఫికేషన్ తరువాత ఎగ్జిక్యూటివ్ స్థాయిలో కనీసం 1 సంవత్సరం పని చేసిన అనుభవం ఉండాలి
  • ప్రైవేట్ సెక్టార్ అభ్యర్థులు లిస్టెడ్ కంపెనీలో కనీసం 1 సంవత్సరం పనిచేసి ఉండాలి  

జీతం : నెలకు రూ.50,000 నుండి రూ.1,60,000

వయస్సు : 28 సంవత్సరాలు ఉండాలి 

4. జూనియర్ అకౌంటెంట్ :

  • ఛార్టర్డ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ మరియు మేనేజ్మెంట్ అకౌంటెంట్ లో ఇంటర్మీడియేట్ లో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. లేదా 
  • M.Com లేదా B.Com లో కనీసం 55% మార్కులతో అర్హతను సాధించి ఉండాలి 
  • 1 సంవత్సరం ఫైనాన్స్ మరియు అకౌంట్స్ లో (బుక్ కీపింగ్, డేటా బేస్ నిర్వహణ,బ్యాంక్ బాలన్స్ హ్యాండ్లింగ్, Taxation ) వంటి పనులలో అనుభవం ఉండాలి 

జీతం : నెలకు రూ.22,000 నుండి రూ.80,000

వయస్సు : గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలి 

Blue Star 1.5 Ton 3 Star, Smart Inverter Split AC (Copper, 5 in 1 Convertible Cooling, DigiQ Hepta Sensor, Blue Fins,Turbo Cool,Blue Fins (IA318ZXUS, White)

👉 Buy Now 

సెక్షన్ B – Fixed Term Executive Positions 

5. సీనియర్ ఇంజనీర్ :

  • B.Tech లేదా B.E ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో అర్హతను కలిగి ఉండాలి 
  • పోస్ట్ క్వాలిఫికేషన్ తరువాత పవర్ సెక్టార్ లో ఎగ్జిక్యూటివ్ లెవెల్ లో 1 సంవత్సరం పని చేసిన అనుభవం ఉండాలి 
  • మొదట 3 సంవత్సరాలు కాంట్రాక్టు ఉంటుంది. అభ్యర్థి పనితీరు మరియు ప్రాజెక్ట్ అభివృద్ధి ఆధారంగా మరో 2 సంవత్సరాలు కొనసాగించ వచ్చును 
  • పోస్టింగ్ భారతదేశంలో ఎక్కడైనా ఉండవచ్చును 

జీతం : నెలకు రూ.50,000 

వయస్సు : 28 సంవత్సరాలు మించరాదు 

 సెక్షన్ C – సీనియర్ కన్సల్టెంట్  positions :

  • B.E లేదా B.Tech డిగ్రీ లో ఎలక్ట్రికల్ / పవర్ ఇంజనీరింగ్ లేదా ఛార్టర్డ్ అకౌంటెంట్ లేదా MBA ఫైనాన్స్ లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అర్హతను కలిగి ఉండవలెను 
  • 20 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉండాలి. అందులో ఎలక్ట్రికల్ వర్క్స్ లేదా డిజైన్ ఇంజనీరింగ్ లో కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉండాలి 
  • పవర్ లేదా ఎనర్జీ సెక్టార్ లో పనిచేసిన అనుభవం ఉండాలి 

జీతం : నెలకు రూ.1,25,000

వయస్సు : 63 సంవత్సరాల లోపు ఉండాలి 

దరఖాస్తు ఫీజు :

  • రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.1000
  • ఫిక్సడ్ టెర్మ్ పోస్టులకు రూ.500
  • కన్సల్టెంట్ పోస్టులకు ఫీజు లేదు 
  • ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూబీడీ,ఎక్స సర్వీస్ మెన్లకు ఫీజులో మినహాయింపు ఉంది 

వేతనం ప్యాకేజి :

రెగ్యులర్ పోస్టులకు :

  • Basic Pay పాటుగా డియర్ నెస్ అలవెన్స్ ,నివాసం, మెడికల్ సదుపాయాలు, ప్రావిడెంట్ ఫండ్,నూతన ఫెంక్షన్ స్కీమ్, రిటైర్మెంట్ తరువాత మెడికల్ సదుపాయాలు,కాన్వయన్ అడ్వాన్స్, పిల్లల ఎడ్యుకేషన్ లోన్, ఇన్సూరెన్స్, మొబైల్ మరియు ల్యాబ్ టాప్, లీవ్స్, గ్రాట్యుటీ, మరియు ఇతర సదుపాయాలు కంపెనీ రూల్స్ ప్రకారం ఉంటాయి 

ఫిక్సడ్ టర్మ్ పోస్టులకు :

  • ఫిక్సడ్ వేతనంతో పాటుగా హౌస్ రెంట్ అలవెన్స్ లేదా నివాస భత్యం పోస్టింగ్ స్థలంపై ఆధారపడి ఉంటుంది, మెడికల్ సదుపాయాలు, కాన్వయన్స్ అడ్వాన్స్, మొబైల్ మరియు కాల్స్  ఖర్చులు, లీవ్స్, ఇతర సదుపాయాలు కంపెనీ రూల్స్ ప్రకారం ఉంటాయి

కన్సల్టెంట్ పోస్టుకి :

  • SECI లో ప్రొఫెషనల్ ఫీజు సీనియర్ కన్సల్టెంట్ కి నెలకు రూ.1,25,000/-

ఎంపిక విధానం:

  • అభ్యర్థులు ఎక్కువ మంది దరఖాస్తు చేసిన సమయంలో, SECI అవసరమైతే అభ్యర్థుల అర్హత ప్రమాణాలను పెంచే హక్కును కలిగి ఉంటుంది 
  • లేదా ఏదైనా పోస్టుకు పిలిచే అభ్యర్థుల సంఖ్యను తగ్గించవచ్చును 
  • అర్హత ప్రమాణాలను గ్రాడ్యుయేషన్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్ / డిప్లొమాలో సాధించిన మార్కులు, సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న సంవత్సరాలు ఆధారంగా నిర్ణఇంచబడుతుంది 
  • ఒక పోస్టుకు ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసినప్పుడు, స్క్రీనింగ్ టెస్ట్,రాత పరీక్ష,ట్రేడ్ టెస్ట్, స్కిల్ పరీక్షలను నిర్వహించవచ్చును 

దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు దరఖాస్తును ఆన్ లైన్ లో మాత్రమే అప్లై చేయవలెను. వేరే మార్గాల ద్వారా వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు  
  • అభ్యర్థి వాడుకలో ఉన్న ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ ను ఇవ్వవలెను.
  • అభ్యర్థి ఖచ్చితమైన సైజు లో ఫోటో మరియు సంతకంను అప్లోడ్ చేయవలెను 
  • అభ్యర్థులు సాధించిన అన్ని అర్హతలు గుర్తింపు పొందిన భారతీయ యూనివర్సిటీ నుండి పొందినవి అయ్యి ఉండాలి. 
  • Distance Learning ద్వారా ఉత్తీర్ణతను సాధించిన అభ్యర్థులు కూడా అర్హులుగా పరిగణించబడతారు
  • ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నట్లైతే ప్రతి పోస్టుకి వేరువేరుగా దరఖాస్తు చేసుకోవలెను 
  • కంపెనీ రూల్స్ ప్రకారం అన్ని నియామకాలు మెడికల్ ఫిట్నెస్ ఫై ఆధారపడి ఉంటాయి 
  • ప్రభుత్వ, పబ్లిక్ సంస్థల్లో పని చేస్తున్న అభ్యర్థులు ఇంటర్వ్యూ దశ వరకు అర్హతను సాధించినట్లైతే No Objection సర్టిఫికెట్ ను ఇవ్వవలసి ఉంటుంది 
  • ప్రైవేట్ సెక్టార్ లో అభ్యర్థులు ఆఖరి CTC / Pay Slip / Pay సర్టిఫికెట్ / Income Tax Returns ఇవ్వవలసి ఉంటుంది 
  • దరఖాస్తుల అర్హత ప్రమాణాలను పరిశీలించిన తరువాత అభ్యర్థులను రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ కి పిలుస్తారు
  • ఎంపికైన అభ్యర్థులు SECI నియంత్రణలో ఉన్న ఏదైనా యూనిట్ / ఏరియా / ప్రాజెక్ట్ లో నియమించబడతారు

 

 ఆన్లైన్ దరఖాస్తు లింక్   

XIAOMI 17 (12GB/512GB)  👉  Buy On Amazon  

100W HyperCharge HyperOS 3|3500nits Display| Ice Blue Edition.

XIAOMI 17 (12GB/512GB)|50MP Leica Triple Camera|Snapdragon 8 Elite Gen 5|6.3″ CrystalRes 1-120Hz AMOLED|6330mAh Battery|100W HyperCharge HyperOS 3|3500nits Display| Ice Blue Edition.

          👉 Buy Now ON Amazon