యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UOH) : నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్,అసోసియేట్ ప్రొఫెసర్,అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.అర్హత గల మరియు ఆశక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులను చేసుకోవలెను
ముఖ్యమైన తేదీలు :
- ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ – 06 -ఫిబ్రవరి – 2026
- ఆన్ లైన్ దరఖాస్తు ముగింపు తేదీ – 06 -మార్చి – 2026
- హార్డ్ కాపీ పంపడానికి చివరి తేదీ –06 – మార్చి –2026
పోస్ట్ పేరు మరియు ఖాళీలు :
- ప్రొఫెసర్
- అసోసియేట్ ప్రొఫెసర్
- అసిస్టెంట్ ప్రొఫెసర్
మొత్తం ఖాళీల సంఖ్య – 40
అర్హతలు :
ప్రొఫెసర్ (PROFESSOR) :
- అభ్యర్థి పోస్టుకు సంబంధించిన విభాగంలో పీహెచ్.డి (PH.D) డిగ్రీ లో అర్హత కలిగి ఉండవలెను
- కళాశాలలో లేదా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్,అసోసియేట్ ప్రొఫెసర్,అసిస్టెంట్ ప్రొఫెసర్ గ 10 సంవత్సరాలు బోధనా అనుభవం ఉండాలి
- జాతీయ స్థాయి సంస్థల్లో సమానమైన స్థాయిలో పరిశోధనలకు సంబంధించిన అనుభవం కలిగి ఉండవలెను
- అభ్యర్థి పరిశ్రమల నుండి వచ్చిన వారు అయినట్లయితే సంబంధిత విభాగంలో అధిక సేవలను అందించి ఉండవలెను
- UCG నియమాల అపెండిక్స్ –II,టేబుల్ – 2 ప్రకారం మొత్తం మార్కులు 120 ఉండాలి
అసోసియేట్ ప్రొఫెసర్ (ASSOCIATE PROFESSOR) :
- అభ్యర్థి పోస్టుకు సంబంధిత విభాగంలో పీహెచ్.డి (PH.D) డిగ్రీ తో పాటు మంచి అకాడమిక్ రికార్డ్ ను కలిగి ఉండవలెను
- మాస్టర్ డిగ్రీలో కనీసం 55% మార్కులను కలిగి ఉండాలి
- యూనివర్సిటీ,లేదా గుర్తింపు పొందిన పరిశోధన సంస్థలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కు సమానమైన పరిశోధనలో కనీసం 8 సంవత్సరాలు పరిశోధన లేదా భోదన అనుభవం కలిగి ఉండాలి
- UGC గుర్తించిన జర్నల్స్ లో
- UGC నిబంధనల 2018 ( Appendix – II, Table -2 ) ప్రకారం మొత్తం పరిశోధన మార్కులు 75 ఉండాలి
అసిస్టెంట్ ప్రాసెసర్ ( ASSISTANT PROFESSOR ) :
- భారత దేశంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మాస్టర్ డిగ్రీ లో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి.
- గ్రేడింగ్ విధానం ఉన్నట్లయితే దానికి సమానమైన గ్రేడ్ ఉండాలి లేదా గుర్తింపు పొందిన విదేశీ యూనివర్సిటీ నుండి సస్సమానమైన డిగ్రీ అర్హతను కలిగి ఉండాలి
- UCG నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) లేదా UGC నిర్వహించే ఇతర పరీక్ష (SLET,SET) లో అర్హతను కలిగి ఉండవలెను
- యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నిబంధనలు 2009 మరియు 2016 ప్రకారం పీహెచ్.డి,డిగ్రీ పొందిన వారు అయినట్లైతే అటువంటి అభ్యతడులకు NET,SLET,SET నుండి మినహాయింపు ఉంటుంది
కంప్యూటర్ మరియు ఇన్ఫర్మేషన్ సైన్సెస్ ( COMPUTER AND INFORMATION SCIENCES ) :
ప్రొఫెసర్ :
- కంప్యూటర్ సైన్స్,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధిత విభాగాలలో పిహెచ్.డి డిగ్రీలో అర్హతను కలిగి ఉండాలి
- సంబంధిత విభాగంలో మాస్టర్ లేదా బ్యాచిలర్ లెవెల్ లో ఫస్ట్ క్లాస్ లేదా దానికి సమానమైన అర్హతను కలిగి ఉండాలి
- టీచింగ్,రీసెర్చ్,ఇండస్ట్రీ రంగాలలో కనీసం 10 సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలి.అసోసియేట్ ప్రొఫెసర్స్ సమానమైన స్థాయిలో కనీసం 3 సంవత్సరాలు పని చేసి ఉండాలి
ఇంజనీరింగ్ సైన్స్ మరియు టెక్నాలజీ ( ENGINEERING SCIENCES AND TECHNOLOGY ) :
అసోసియేట్ ప్రొఫెసర్స్ :
- మెటలర్జీ లేదా మెటీరియల్స్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా సిరామిక్ ఇంజనీరింగ్ లేదా మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ లేదా సంబంధిత విభాగాలలో B.E,B.Tech మరియు M.E, M.Tech డిగ్రీ లో అర్హతను కలిగి ఉండవలెను
- అభ్యర్థి ఈ డిగ్రీ లలో ఏదైనా ఒక దానిలో ఫస్ట్ క్లాస్ లేదా దానికి సస్సమానమైన అర్హతను కలిగి ఉండాలి
- UGC,CARE,SCI,AICTE ఆమోదించిన జర్నల్స్ లో కనీసం 6 సంవత్సరాలు రీసెర్చ్ పబ్లికేషన్స్ ఉండాలి
- టీచింగ్రీసెర్చ్,పరిశ్రమ రంగాలలో కనీసం 8 సంవత్సరాలు అనుభవం ఉండాలి.
డ్రామా డిసిప్లిన్ ( థియేటర్ ఆర్ట్స్ ) DRAMA DISCIPLINE ( THEATRE ARTS ) :
అసోసియేట్ ప్రొఫెసర్ :
- అభ్యర్థి సంబంధిత రంగంలో ప్రశంసనీయమైన వృత్తి నైపుణ్యం కలిగిన సాంప్రదాయ కళాకారుడిగా లేదా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ గ గుర్తింపు పొంది ఉండాలి.మరియు మాస్టర్ డిగ్రీ ని కలిగి ఉండాలి
- స్టేజ్,రేడియో,టెలివిజన్ రంగాలలో గుర్తింపు పొందిన కళాకారుడిగా గుర్తింపు ఉండాలి
- కనీసం 8 సంవత్సరాలు ప్రదర్శన అనుభవం కలిగి ఉండాలి
- ప్రసిద్ధి పొందిన సంస్థలు నిర్వహించేటటువంటి కార్యక్రమాలు,సెమినార్లు మరియు కాన్ఫిరెస్సులకు వెళ్లి ఉండాలి
- సంబంధిత సమాచారాన్ని సొంత ఆలోచనతో స్పష్టంగా వివరించే నైపుణ్యాన్ని కలిగి ఉండాలి.అలాగే ఉదాహారణలతో కూడిన టీచింగ్ చేయటానికి తగ్గ పరిజ్ఞానం కలిగి ఉండాలి
డాన్స్ (పెరఫామింగ్ ఆర్ట్స్ ) DANCE ( PERFORMING ARTS ) :
అసోసియేట్ ప్రొఫెసర్ :
- సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీని కలిగి అద్భుతమైన వృత్తి నైపుణ్యం కలిగిన సాంప్రదాయ కళాకారుడిగా లేదా ప్రొఫెషనల్ ఆర్టిస్టుగా గుర్తింపు ఉండాలి
- ఆకాశవాణి,దూరదర్శన్ “A “ గ్రేడ్ కళాకారుడిగా గుర్తింపు కలిగి ఉండవలెను
- 8 సంవత్సరాలు ప్రదర్శన అనుభవం కలిగి ఉండాలి
- గుర్తింపు పొందిన సంస్థలు నిర్వహించే నేషనల్ స్థాయి కార్యక్రమాలలో,సెమినార్లో పాల్గొని ఉండాలి
సంగీతం ( MUSIC )
అసోసియేట్ ప్రొఫెసర్ :
- సంగీత విభాగంలో మాస్టర్ డిగ్రీ లో అర్హతను కలిగి ఉండలి
- ప్రశంసనీయమైన వృత్తి నైపుణ్యం గల ప్రొఫెషనల్ కళాకారుడిగా లేదా సంప్రదాయమైన సంగీత కళాకారుడిగా గుర్తింపు ఉండాలి
- కనీసం 8 సంవత్సరాలు అద్భుతమైన సంగీత ప్రదర్శన అనుభవం కలిగి ఉండాలి
- ప్రసిద్ధి గాంచిన సంస్థలు చేపట్టే నేషనల్ స్థాయి సంగీత కార్యక్రమాలలో పాల్గొని ఉండాలి
మేనేజ్మెంట్ స్టడీస్ ( MANAGEMENT STUDIES ) :
ప్రొఫెసర్ :
- పీహెచ్.డి డిగ్రీని లో అర్హతను కలిగి ఉండాలి.బ్యాచిలర్ లేదా మాస్టర్ స్థాయిలో ఫస్ట్ క్లాస్ లేదా సస్సమానమైన అర్హతను కలిగి ఉండాలి
- టీచింగ్,రీసెర్చ్,పరిశ్రమ రంగాలలో 10 సంవత్సరాలు అనుభవం ఉండాలి. కనీసం 3 సంవత్సరాలు అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయిలో పనిచేసి ఉండాలి
- అర్హత తేదీ నాటికీ కనీసం ఇద్దరు పీహెచ్.డి విద్యార్థులను సూపర్వైజర్ మరియు కో -సూపెర్వైజర్ గ సమర్ధవంతముగా మార్గ నిర్దేశం చేసి ఉండాలి
వేతనం (SALARY ) :
- ప్రొఫెసర్ కు నెలకు రూ.1,44,200 నుండి రూ.2,18,200/-
- అసోసియేట్ ప్రొఫెసర్ కు నెలకు రూ.1,31,400 నుండి రూ.2,17,100/-
- అసిస్టెంట్ ప్రొఫెసర్ కు నెలకు రూ.57,700 నుండి రూ.1,82,400/-
వయస్సు (AGE ) :
- గరిష్టంగా 65 సంవత్సరాలు
దరఖాస్తు ఫీజు (APPLICATION FEE ) :
- ఓబీసీ అభ్యర్థులకు ఫీజు రూ.1000/-
- SC /ST /PWBD అభ్యర్థులకు ఫీజు లేదు
- ట్రాన్స్ జెండర్ (TG ) కు రూ.1000/-
సాధారణ సూచనలు ( GENERAL INSTRUCTIONS) :
- అభ్యర్థులు దరఖాస్తులను ఆఖరి తేదీ కంటే ముందుగానే పంపవలెను
- అభ్యర్థికి కనీస అర్హతలు,అనుభవం ఉండటం వల్ల ఇంటర్వ్యూ కాల్ వస్తుందనే నియమం ఏమి లేదు
- అవసరం ఐతే యూనివర్సిటీ అర్హతలు మరియు అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూ కి పిలిచే అభ్యర్థుల సంఖ్యను తగ్గించవచ్చును
- షార్ట్ లిస్ట్ ఐన అభ్యర్థులకు మాత్రమే ఈమెయిల్ ద్వారా ఇంటర్వ్యూ కి పిలుస్తారు
- షార్ట్ లిస్ట్ అయిన వారి మరియు కానివారి జాబితాను వెబ్సైటులో పొందుపరుస్తారు.కానీ షార్ట్ లిస్ట్ కానివారి వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వరు
- అభ్యర్థులుకు అర్హత పత్రములు లేదా విద్య అర్హత పత్రములు లేకపోయినా వారి దరఖాస్తును తిరస్కరణ చేయబడతాది
ఎంపిక విధానము (SELECTION PROCESS ) :
- ఇంటర్వ్యూ ప్రదర్శన ఆధారముగా
- ఎడ్యుకేషన్లో వచ్చిన రికార్డ్స్ ఆధారముగా ఉంటుంది
దరఖాస్తు విధానము (APPLICATION PROCESSOR ) :
- దరఖాస్తును ఆన్ లైన్ లో మాత్రమే అప్లై చేయవలెను
- అప్లై చేయడానికి యూనివర్సిటీ మెయిన్ వెబ్ సైట్ నుండి మాత్రమే చేయాలి లింక్ కింద ఇవ్వబడినది
- అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదివిన తరవాత పోర్టల్లో వివరాలను నమోదు
- రిజిస్ట్రేషన్ కోసం వర్కింగ్ లో మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఉండాలి
- రిజిస్ట్రేషన్ చేసిన ఈమెయిల్ కు వచ్చే లింక్ పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ ను కన్ఫామ్ చేసుకోవాలి
- తరవాత అభ్యర్థి తన లాగిన్ వివరాలతో అప్లికేషన్ పోర్టల్ లో లాగిన్ అయ్యి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అనుభవం,రీసెర్చ్,మరియు అకాడమిక్ మొదలైన అన్ని వివరాలతో ఆన్ లైన్ అప్లికేషన్ ఫామ్ ను పూర్తి చేయవలెను
- ఎడ్యుకేషన్ సర్టిఫికెట్,కాస్ట్ ధృవ పత్రం,పని అనుభవ కాపీ అవసరం ఉన్నయడల అప్లోడ్ చేయవలచి ఉంటాది
- అభ్యర్థి ఆన్ లైన్ అప్లికేషన్ ని ప్రింట్ తీసి ఆ కాపీ ని పోస్ట్ లో యూనివర్సిటీ చిరునామాకు పంపాలి
- అప్లికేషన్ ఫై అభ్యర్థి సంతకం తప్పనిసరిగా ఉండవలెను