UCIL APPRENTICES NOTIFICATION 2026: భారత ప్రభుత్వ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( UCIL ) నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.ఈ నోటిఫికేషన్ ద్వారా 364 పోస్టుల ఖాళీలను భర్తీ చేయనుంది. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్ ,డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటీస్,గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ముఖ్యంగా ITI అభ్యర్థులకు ఎక్కువ సంఖ్యలో పోస్టులను కేటాయించడం ఈ నోటిఫికేషన్ ప్రత్యేకత.గవర్నమెంట్ సంస్థలో పనిచేయాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం.ఇందులో అప్రెంటిస్ చేయడం వల్లనా పని అనుభవం సర్టిఫికేషన్ వస్తది మరియు ఫ్యూచర్ లో ఈ సర్టిఫికెట్ మరొక ఉద్యోగంలో చేరడానికి ఉపయోగ పడుతుంది.
UCIL అంటే :
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది భారత ప్రభుత్వానికి చెందిన ప్రముఖ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్.దేశంలో అణుశక్తి కార్యక్రమాలకు కావలసిన యురేనియం తవ్వకం మరియు శుద్ధి ,సరఫరా వంటి బాధ్యతలను ఈ సంస్థ చేపడుతుంది ఇందువల్లన దేశంలో ఈ సంస్థ చాలా అభివృద్ధి చెందినది.
UCIL అప్రెంటీస్ నోటిఫికేషన్ ముఖ్య వివరాలు :
- సంస్థ పేరు – యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.(UCIL )
- నోటిఫికేషన్ సంవత్సరం – 2026
- మొత్తం ఖాళీల సంఖ్య – 364
- ఉద్యోగ రకం – అప్రెంటీస్
- దరఖాస్తు విధానం – ఆన్ లైన్ ద్వారా
- శిక్షణ ప్రదేశం – జార్ఖండ్ లోని UCIL యూనిట్లు
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ – 01 – ఫిబ్రవరి – 2026.
- దరఖాస్తు ముగింపు తేదీ – 28 – ఫిబ్రవరి – 2026.
పోస్టులు పేర్లు మరియు ఖాళీలు :
ఈ నీటోఫికేషన్ ద్వారా వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న అప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఖాళీల విభజన :
- ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ – 269
- డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటీస్ – 60
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ – 35
మొత్తం ఖాళీలు – 364
విభాగాలు : ట్రేడ్స్ /బ్రాంచీస్ :
UCIL అప్రంటీస్ షిప్ 2026 నోటిఫికేషన్ లో కింది విభాగాలకు సంబంధించిన ఖాళీలు ఉన్నాయి.
- ఫిట్టర్ ( Fitter )
- ఎలెక్ట్రీషియన్ (Electrician )
- వెల్డర్ (గ్యాస్ మరియు ఎలక్ట్రిక్ )
- టర్నర్ ( Turner )
- కార్పెంటర్ (Carpenter )
- ప్లంబర్ (Plumber )
- మేట్ /మైనింగ్ ( Mate /Mining )
- సివిల్ (Civil )
- మెకానికల్ (Mechanical )
- ఎలక్ట్రికల్ (Electrical )
- అడ్మినిస్ట్రేషన్ (Administration )
- ఫైనాన్స్ (Finance )
అర్హతలు :( Education Qualification )
అభ్యర్థులు తాము అప్లై చేసే పోస్టులను బట్టి ఈ దిగువ అర్హతలను కలిగి ఉండాలి.
- ITI అప్రెంటీస్ : సంబంధిత ట్రేడ్ లో ITI పూర్తీ చేసి ఉండాలి.
- డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటీస్ : సంభిందిత బ్రాంచ్ లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ : బీఈ ,బీటెక్ ,డిగ్రీ,ఎంబీఏ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు పరిమితి (Age Limit ) :
- 18 నుండి 25 సంవత్సరాల వయస్సు ఉండాలి
- కట్ ఆఫ్ తేదీ 28 – ఫిబ్రవరి – 2029 నాటికి
వయస్సు సడలింపు :
- ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ,పీడబ్ల్యూబీడీ, ఇతరులకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ :(Selection Process ) :
- అభ్యర్థుల అర్హత మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు
- మెరిట్ లిస్ట్ లో ఎంపికైన వారికి డ్యాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు
- రాత పరీక్ష,ఇంటర్వ్యూ సాధారణంగా ఉండదు.
స్టైపెండ్ వివరాలు :
- UCIL అప్రెంటీస్ కి ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటీస్ Act ప్రకారం నెలవారి స్టైపెండ్ ఇవ్వబడుతుంది. స్టైపెండ్ మొత్తం పోస్ట్ మరియు అప్రెంటీస్ కేటగిరిపై ఆధారపడి ఉంటుంది.
UCIL అప్రెంటీస్ ఎందుకు ముఖ్యమైనది :
- కేంద్ర ప్రభుత్వ సంస్థలో శిక్షణ అవకాశం
- రియల్ టైమ్ ఇండస్ట్రియల్ అనుభవం
- టెక్నికల్ మరియు ప్రొఫెషనల్ స్కిల్స్ పెరుగుతాయి
- భవిష్యత్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు ఉపయోగపడే సర్టిఫికెట్
దరఖాస్తు విధానము :
- అభ్యర్థులు ఆన్ లైన్ లో మాత్రమే అప్లై చేయవలెను
- ఈ అప్రెంటిస్ కు అప్లై చేసుకోవటానికి సంస్థ యొక్క మెయిన్ వెబ్ సైట్ నుండి చేసుకోవచ్చును
- రిజిస్ట్రేషన్ పేజీ కి వెళ్ళి మెయిల్ మరియు మొబైల్ నెంబర్ ను వెరిఫికేషన్ చేసుకోవలెను
- తరువాత రిజిస్ట్రేషన్ పేజీలో అభ్యర్థి కంప్లీట్ డిటేల్స్ తో ఫామ్ నింపవలెను
- పూర్తి వివరాలను ఇచ్చిన తరువాత రిజిస్ట్రేషన్ ద్రువీకరించవలెను
అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ :
డాక్యుమెంట్ లను తప్పని సరిగా రిజిస్ట్రేషన్ సమయంలో స్కాన్ కాపీస్ ను యాడ్ చేయవలెను వాటి వివరాలు కింది విదంగా ఉన్నాయి
- 10 వ తరగతి సర్టిఫికెట్స్ మరియు మార్క్స్ మెమో (ఒరిజినల్ )
- ఐటిఐ సర్టిఫికెట్ (ఒరిజినల్ )
- బి.టెక్ సర్టిఫికెట్
- డిగ్రీ సర్టిఫికెట్
- కుల ధ్రువీకరణ పత్రం (ST /SC /OBC – NCL వారికి మాత్రమే )
- EWS సర్టిఫికెట్ (వర్తించే వారికి మాత్రమే )
- దివ్యాంగులకు మెడికల్ సర్టిఫికెట్
- ఫోటో మరియు సంతకం
- ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్
- బ్యాంక్ అకౌంటుకు లింక్ చేసిన ఆధార్
- భూ సేకరణ సర్టిఫికెట్ UCIL ఉద్యోగి ఐడీ (వర్తించే వారికి )
అప్రెంటిస్ అవకాశాలు :
- ఆన్ లైన్ లో నమోదు తర్వాత,అభ్యర్థి అప్రెంటిస్ షిప్ ఆపర్చునిటీస్ ట్యూబ్ పై క్లిక్ చేయవలెను.కావలసిన ట్రేడ్ ను ఎంపిక చేసుకోవలెను
- అప్రెంటిస్ శిక్షణ జరుగుతున్న యూనిట్ ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవలెను (యూరేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ -జాదుగూడా /నరవాపహర్ /తరమాడిహ్ )
- అభ్యర్థి శిక్షణ పొందుటకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ యూనిట్ లను ఎంచుకోవచ్చు శిక్షణ 28 – 02 – 2026 లోపు లేదా అంతకంటే ముందు ప్రారంభం కావచ్చును
- ప్రకటన తేదీ నుండి నిర్దిష్ట గడువు లోపు వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు
- ప్రకటనకు ముందుగా వచ్చిన అప్లికేషన్ లను కానీ గడువు పూర్తి అయిన తరువాత వచ్చిన అప్లికేషన్లు కానీ తిరస్కరించబడతాయి
- శిక్షణ పూర్తి అయిన తరువాత ఉద్యగం కల్పించాలి అనే నిభందన లేదు. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలి
గమనిక :
- అప్రెంటిస్ గా అర్హతలు ఉన్నాయి అనే కారణంతో ఎంపిక చేస్తారనే గ్యారెంటీ లేదు.యజమాన్యం కారణం చెప్పకుండా అప్లికేషన్స్ తిరస్కరించే హక్కును కలిగి ఉంటుంది.నియామకం రద్దు,సవరణ,ఆఫ్ చేయవచు. సంస్థ నిర్ణయం ఆఖరి నిర్ణయం అవుతుంది
- ఎటువంటి తప్పుడు సమాచారాన్ని ఇచ్చిన అభ్యర్థి శిక్షణలో ఏ దశలో ఐన తొలగించ వచ్చును
- ఏ యూనిట్లో నైనా శిక్షణకు అభ్యర్థిని నియమించవచ్చును
- UCIL యూనిట్లఉద్యోగుల పిల్లకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది
- జాయినింగ్ సమయంలో సంబంధిత సర్టిఫికెట్స్ పరిశీలించబడతాయి
- భూసేకరణ మరియు ఉద్యోగి యొక్క హార్డ్ కాపీలను ఇవ్వవలెను
ముఖ్యమైన నిబంధనలు :
- మార్క్స్ లిస్ట్ సర్టిఫికెట్స్ ఇంకా కాలేజీ నుండి రాని యెడల అటివంటి వారూ ఈ అప్రెంటిస్‌కు శిక్షణకు అర్హులు కారు
- అన్ని సర్టిఫికెట్స్ మరియు మర్క్స్ షీట్స్ తప్పని సరిగా అప్లోడ్ చేయాలి,ప్రొవిజిషనల్స్ షీట్స్ ఉన్న సరిపోదు ఒరిగినల్స్ ఉండాలి
- అసంపూర్తి లేదా తప్పుడు దరఖాస్తులను పరిగణలోకి తీసుకోరు నేరుగా తిరస్కరించబడతాయి
- ఆశక్తి ఉన్న అభ్యర్థులు తప్పని సరిగా naps పోర్టల్ / nats పోర్టల్ లో అప్లై చేయవలెను
- naps / nats పోర్టల్స్ నుండి కాకుండా ఇతర సైట్ నుండి వచ్చిన దరఖాస్తులను పరిగణించారు
- ప్రకటనలో ఏవైనా మార్పులు లేదా చేర్పులు చేయవలసిన వచ్చిన వాటిని యూరేనియం మెయిన్ వెబ్సైటు లో అప్డేట్ చేస్తారు అభ్యర్థులు అక్కడ మాత్రమే చెక్ చేసుకోవాలి
- ఫలితాలు అధికారిక వెబ్సైటు లో పొందుపరుస్తారు. ఫలితాల గురించి వ్యక్తిగతంగా సమాచారం ఇవ్వరు. సెలెక్ట్ ఐన వారికి ఇమెయిల్ ద్వారా సమాచారం ఇస్తారు
- అభ్యర్థి దరఖాస్తు ఫామ్ లో తప్పు లేదా తప్పుడు సమాచారం ఇచ్చిన యెడల అభ్యర్థిని అనర్హుడిగా తెలియచేస్తారు.వాటికి ucil బాధ్యత వహించదు
- పోర్టల్ లో అభ్యర్థి ఇచ్చిన సమాచారం /డిటేల్స్ ఆధారంగా తాత్కాలిక మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. తరవాత జాయిన్ టైమ్ లో అభ్యర్థి యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ మరియు మార్క్ లిస్ట్ తనిఖీ చేస్తారు. జాయినింగ్ టైములో ఓరిజినల్స్ అభ్యర్థుల దగ్గర తప్పనిసరిగా ఉండవలెను
- ఇప్పటికి అప్రెంటిస్ తీసుకున్నవారు లేదా శిక్షణ తీసుకొంటున్నవారు దరఖాస్తు చేయకూడదు
- సర్టిఫికేషన్ వెరిఫికేషన్ మరియు శిక్షణ కేంద్రానికి రావడానికి ta/ da లేదా వసతి గృహము ఎవ్వబడదు
- మరింత సమాచారం కొరకు కింది ఇమెయిల్ ఐడి ఇవ్వబడినది.
- ucil.apprenties@uraniumcrop.in