తెలంగాణ హై కోర్ట్ నోటిఫికేషన్ 2026 : ( TGHC) నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 859 పోస్టులను భర్తీ చేయనుంది.అర్హత మరియు ఆశక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులను చేసుకోవలెను.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ – 24 – జనవరి – 2026
- దరఖాస్తు ముగింపు తేదీ – 13 – ఫిబ్రవరి – 2026
పోస్టుల పేర్లు మరియు ఖాళీలు :
- కాపీయిస్ట్ – 63
- ఎగ్జామినర్ – 49
- ఫీల్డ్ అసిస్టెంట్ – 61
- జూనియర్ అసిస్టెంట్ – 159
- ఆఫీస్ సబార్డినేట్ – 319
- ప్రాసెస్ సర్వర్ – 95
- రికార్డ్ అసిస్టెంట్ – 36
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III – 35
- టైపిస్ట్ – 42
మొత్తం ఖాళీల సంఖ్య – 859
విద్యా అర్హతలు :
1. కాపీయిస్ట్ (COPYIST) :
- అభ్యర్థి రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్య మండలి నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. లేదా దానికి సస్సమానమైన అర్హతను కలిగి ఉండవలెను
- తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించే టెక్నీకల్ ఎగ్జాములో హయ్యర్ గ్రేడ్ (నిమిషానికి 45 వర్డ్స్ టైప్ చేయగలిగే) సర్టిఫికెట్టును కలిగి ఉండాలి
- హయ్యర్ గ్రేడ్ లో (HIGHER GRADE) అర్హతను సాధించిన అభ్యర్థులు అందుబాటులో లేనప్పుడు లోయర్ గ్రేడ్ (LOWER GRADE) లో అర్హతను సాధించిన అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటారు
- అభ్యర్థి నోటిఫికేషన్లో చెప్పిన అర్హతల కంటే ఎక్కువ విద్యను చదివిన లేదా టెక్నీకల్ అర్హతలు ఉన్న అభ్యర్థులు వాటికి సంభందించిన డాక్యుమెంట్ లను సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ సమయంలో ఇవ్వవలెను
2. ఎగ్జామినర్ (EXAMINER) :
- అభ్యర్థి ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి లేదా దానికి సస్సమానమైన పరీక్షలో అర్హతను కలిగి ఉండవలెను
- అభ్యర్థి నోటిఫికేషన్ లో ఇచ్చిన అర్హతల కంటే ఎక్కువ అర్హతలను కలిగి ఉన్నట్లైతే వాటిని సంబంధించిన సర్టిఫికెట్లను డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ సమయంలో ఇవ్వవలెను
- ఈ ప్రకటన విడుదలైన తేదీకి ముందే పైన చెప్పిన విద్యార్హతలు అభ్యరి కలిగి ఉండవలెను ( నోటిఫికేషన్ విడుదలైన తరువాత పాస్ ఐతే పరిగణలోకి తీసుకోరు)
3. ఫీల్డ్ అసిస్టెంట్ (FIELD ASSISTANT) :
- అభ్యర్థి గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణతను కలిగిఉండవలెను.
- లేదా దానికి సస్సమానమైన పరీక్షలో అర్హతను కలిగి ఉండవలెను
- అభ్యర్థి నోటిఫికేషన్ ఇచ్చిన అర్హతల కంటే ఎక్కువ విద్యా అర్హతలు కలిగి ఉన్నట్లైతే వాటికి సంబంధించిన ఒరిజనల్ సర్టిఫికెట్స్ ను డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ సమయంలో చూపించవలెను
- అభ్యర్థి నోటిఫికేషన్ విడుదలకు ముందే డిగ్రీ పూర్తిచేసి ఉండవలెను. నోటిఫికేషన్ తరువాత డిగ్రీ పూర్తి చేస్తే పరిగణలోకి తీసుకోరు
4. జూనియర్ అసిస్టెంట్ (JUNIOUR ASSISTANT) :
- అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. లేదా దానికి సమానమైన అర్హతను కలిగి ఉండాలి
- అభ్యర్థికి కంప్యూటర్ ఆపరేషన్ లో అర్హతను లేదా అనుభవం కలిగి ఉండాలి
- ఇచ్చిన అర్హతల కంటే అభ్యర్థికి ఎక్కువ విద్యార్హతలు లేదా టెక్నీకల్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే వాటికి సంబంధించిన సర్టిఫికెట్లును డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ సమయంలో ఇవ్వవలెను
5. ఆఫీస్ సబార్డినేట్ (OFFICE SUBORDINATE) :
- అభ్యర్థి 7 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ఏ క్లాస్ లో ఐన ఉత్తీర్ణతను కలిగి ఉండవలెను లేదా దానికి సమానమైన అర్హతను కలిగి ఉండాలి
- 10 వ తరగతి కంటే ఎక్కువ విద్యా అర్హత కలిగిన అభ్యర్థులను పరిగణలోకి తీసుకొనబడరు
- ఆన్ లైన్ అప్లికేషన్ లో అభ్యర్థి తనుకు ఉన్న పని అనుభవం (ఉదా హరణకు : కుకింగ్,పంబ్లింగ్,ఎలక్ట్రికల్,పెయింటింగ్ ) వంటి వాటిని తెలియజేయాలి
6. ప్రాసెస్ సర్వర్ (PROCESS SERVER) :
- అభ్యర్థి 10 వ తరగతిలో అర్హతను కలిగి ఉండాలి లేదా సస్సమానమైన అర్హతను కలిగి ఉండవలెను
- అభ్యర్థి తనుకు ఉన్న పని అనుభవం (ఉదా : కుకింగ్,కార్పెంటరీ,ఎలక్ట్రికల్,పెయింటింగ్ మొదలగు) వివరాలను ఆన్ లైన్ అప్లికేషన్ లో తెలియజేయవలెను
- నోటిఫికేషన్ విడుదలకు ముందే 10 వ తరగతి పాస్ అయ్యి ఉండవలెను.
7. రికార్డ్ అసిస్టెంట్ (RECORD ASSISTANT) :
- అభ్యర్థి ఇంటర్మీడియెట్ లో ఉత్తీర్ణతను పొంది ఉండవలెను. లేదా సస్సమానమైన అర్హతను కలిగి ఉండాలి
- నోటిఫికేషన్ లో ఇచ్చిన అర్హతల కంటే ఎక్కువ విద్యా అర్హతలు అభ్యర్థి కలిగి ఉంటే వాటికి సంబంధించిన ఒరిజనల్ సర్టిఫికెట్స్ ను డ్యాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం లో ఇవ్వవలెను
- నోటిఫికేషన్ విడుదలయ్యే తేదీ నాటికి అభ్యర్థి ఫై అర్హతలను కలిగి ఉండవలెను
8. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – III (STENOGRAPHER GRADE – III) :
- అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీలో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి.లేదా సస్సమానమైన అర్హతను కలిగి ఉండాలి
- తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే హయ్యర్ గ్రేడ్ (నిమిషానికి 45 వర్డ్స్ ) ఇంగ్లీష్ టైపు రైటింగ్ లో అర్హతను కలిగి ఉండాలి
- అభ్యర్థి తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ (నిమిషానికి 120 పదాలు) లో అర్హతను పొంది ఉండాలి
- ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ పొందిన అభ్యర్థులు సమయానికి అందుబాటులో లేనప్పుడు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ లోయర్ గ్రేడ్ అభ్యర్థులను పరిగణలోనికి తీసుకుంటారు
- కంప్యూటర్ ఆపరేటింగ్ లో అనుభవం లేదా అర్హతను కలిగి ఉండాలి
- ప్రకటనలో ఇచ్చిన విద్యా అర్హతల కంటే ఎక్కువ విద్యా లేదా టెక్నీకల్ అర్హతలను కలిగి ఉంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ టైమ్ లో అందజేయవలెను
9. టైపిస్ట్ (TYPIST) :
- అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణతను కలిగి ఉండవలెను. లేదా సస్సమానమైన అర్హతను పొంది ఉండాలి
- కంప్యూటర్ ఆపరేషన్ కి సంబంధించిన వాటిలో అర్హతను కలిగి ఉండాలి
- తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించే టెక్నీకల్ ఎగ్జామినేషన్ హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్ టైపు రైటింగ్ లో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి
- నోటిఫికేషన్ లో తెలియజేసిన అర్హతల కంటే అభ్యర్థి ఎక్కువ విద్య అర్హతలు కలిగి ఉంటే వాటికి సంబంధించిన డ్యాకుమెంట్స్ ను సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ సమయంలో ఇవ్వాలి
- పైన తెలిపిన విద్యా అర్హతలను అభ్యర్థి నోటిఫికేషన్ వెలువడే తేదీ నాటికి తప్పని సరిగా పొంది ఉండాలి
వయస్సు (AGE) :
- 01- 07 – 2026 నాటికీ అభ్యర్థికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి
- గరిష్టంగా అభ్యర్థికి 46 సంవత్సరాలు మించి ఉండకూడదు
- ఎస్సీ,ఎస్టీ,బీసీ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది
- దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది
వేతనం (SALARY) :
- కాపీయిస్ట్, ఎగ్జామినర్,ప్రాసెస్ సర్వర్ కు నెలకు రూ. 22,900 నుండి రూ.69,150/-
- ఫీల్డ్ అసిస్టెంట్,జూనియర్ అసిస్టెంట్,టైపిస్ట్ కి నెలకు రూ.24,280 నుండి రూ.72,850/-
- ఆఫీస్ సబార్డినేట్ కి నెలకు రూ.19,000 నుండి రూ.58,850/-
- రికార్డు అసిస్టెంట్ కి నెలకు రూ.22,240 నుండి రూ.67,300/-
- స్టెనోగ్రాఫర్ కి నెలకు రూ.32,810 నుండి రూ.96.890/-
అప్లికేషన్ ఫీజు (Application Fee) :
- జనరల్,బీసీ అభ్యర్థులకు రూ.600/-
- ఎస్సీ.ఎస్టీ,ఈడబ్ల్యూఎస్,ఎక్స్ – సర్వీస్ మెన్,పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.400/-
ఎంపిక విధానం ( Selection Process ) :
- కంప్యూటర్ ఆధారిత టెస్ట్ ,ఇంగ్లీష్ టైపు రైటింగ్ టెస్ట్ మరియు రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది
- నోటిఫికేషన్ విడుదలయ్యే తేదీ నాటికి 2 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసి ఉండాలి
- కంప్యూటర్ లేదా రాత ఆధారిత పరీక్షలలో కనీస అర్హత మార్కులను పొంది ఉండాలి
- తాత్కాలిక ఎంపిక జాబితా విడుదలైన తరువాత ఎంపికైన అభ్యర్థులు సెల్లెక్షన్ ప్రాసెస్ లో తమ ఒరిజనల్ డాక్యుమెంట్సను చూపించాలి
- అభ్యర్థి గెజిటెడ్ ఆఫీసర్ తో అట్టెస్ట్ చేసిన రెండు సెట్ల జెరాక్స్ కాపీలను ఇవ్వవలెను
- అభ్యర్థి ఉద్యోగంలో జాయిన్ కావటానికి తన సమ్మతిని రాత పూర్వకంగా ఇవ్వాలి
- అభ్యర్థి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకానికి అర్హతను పొందాలంటే ఆరోగ్యంగా మరియు మంచి అలవాట్లను కలిగి ఉండాలి.భారతీయ పౌరుడై ఉండాలి
దరఖాస్తు విధానము (Apply Process ) :
- దరఖాస్తును ఆన్ లైన్ లో మాత్రమే అప్లై చేయవలెను
- దరఖాస్తు అప్లై లింక్ దిగువన ఇవ్వబడినది చూడగలరు
- అప్లై చేయడానికి ముందు నోటిఫికేషన్ మరియు అప్లై చేయు విధానమును పూర్తిగా చదవండి
- అప్లై ని హై కోర్ట్ మెయిన్ వెబ్ సైట్ నుండి మాత్రమే చేయాలి,మరి ఈఇతర మార్గాలు ద్వారా అప్లైను ఆగీకరించారు
- వెబ్సైటు ఓపెన్ చేసాక న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళండి అక్కడ ఫారం ఓపెన్ అవుతాది,తరువాత పూర్తి వివరాలతో ఆన్లైన్ ఫారం నింపండి
- అవసరం ఉన్న విద్య అర్హత పత్రములు అప్లోడ్ చేయండి
- పాస్ పోర్ట్ సైజు ఫోటో మరియు సంతకము కూడా స్కాన్ చేయండి మరియు ఫారంలో అప్లోడ్ చేయండి
- నింపిన వివరాలు మరొక సరి చెక్ చేయండి తరువాత ఫైనల్ సబ్మిట్ చేయండి,
- సబ్మిట్ చేయబడిన అప్లికేషను ప్రింట్ అవుట్ తీసుకోండి