టాటా మెమోరియల్ సెంటర్ ( TMC ) నోటిఫికేషన్ 2026 | మెడికల్ ఆఫీసర్ ఖాళీలు

 టాటా మెమోరియల్ సెంటర్ ( TMC ) నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. విశాఖపట్నం లోని హోమీ బాబా కాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలెను ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభ తేదీ – 19 – ఫిబ్రవరి – 2026
  • దరఖాస్తు ముగింపు తేదీ – 20 – మార్చి – 2026

పోస్టుల పేర్లు మరియు ఖాళీలు :

  • కన్సల్టెంట్ ( డీ / ఈ / ఎఫ్ ) – 09
  • మెడికల్ ఫీజిసిస్ట్ – డీ – 01
  • సైంటిఫిక్ ఆఫీసర్ – సీ – 01
  • సైంటిఫిక్ అసిస్టెంట్ – ( బీ / సీ ) – 03

మొత్తం ఖాళీలు – 14

అర్హతలు :

కన్సల్టెంట్ ‘F’ ( రేడియో డయాగ్నోసిస్ ) :

  • రేడియాలజీ లేదా రేడియో – డయాగ్నోసిస్ లో M.D లేదా D.N.B డిగ్రీ పూర్తిచేసి ఉండాలి 
  • లేదా సమానమైన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. ఆ డిగ్రీ నేషనల్ మెడికల్ కమిషన్ గుర్తింపు కలిగి ఉండాలి  
  • రేడియో డయాగ్నోసిస్ కనీసం 8 సంవత్సరాలు అనుభవం ఉండాలి 

వయస్సు : 50 సంవత్సరాలు గరిష్టంగా ఉండాలి ( 20 – మార్చి – 2026 నాటికి )

జీతం : రూ.1,23,100 + అలవెన్సులు 

కన్సల్టెంట్ ‘E’ ( సర్జికల్ ఆంకాలజీ ) :

  • నేషనల్ మెడికల్ కమిషన్ గుర్తించిన సర్జికల్ ఆంకాలజీ లో M.Ch లేదా DNB డిగ్రీని కలిగి ఉండాలి. లేదా సమానమైన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తీ చేసి ఉండాలి 

వయస్సు : 45 సంవత్సరాలు మించి ఉండరాదు 

జీతం : రూ.78,800 + అలవెన్సులు 

కన్సల్టెంట్ ‘E’ ( Gynaec ఆంకాలజీ ) :

  • నేషనల్ మెడికల్ కమిషన్ గుర్తింపు పొందిన Gynaec ఆంకాలజీ లో M.Ch / DNB లో డిగ్రీ లేదా సమానమైన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి 
  • లేదా Obstetrics మరియు Gynaecology లో M.D / DNB లో డిగ్రీ లేదా సస్సమానమైన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో నేషనల్ మెడికల్ కమీషన్ గుర్తింపు ఉండాలి 
  • MCh / DNB   Gynace ఆంకాలజీ లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి 
  • M.D / DNB ఒబెస్ట్ట్రిక్స్ మరియు Gynaecology ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ తరువాత 3 సంవత్సరాలు Gynaec ఆంకాలజీ లో అనుభవం ఉండాలి 

వయస్సు : 45 సంవత్సరాలు లోపు ఉండాలి 

జీతం : సుమారు రూ.78,800 + అలవెన్సులు 

కన్సల్టెంట్ ‘E’ ( మెడికల్ Gastroenterology ) :

  • నేషనల్ మెడికల్ కమిషన్ గుర్తించిన మెడికల్ Gastroenterology లో M.D / DNB డిగ్రీ పూర్తిచేసి ఉండాలి 
  • మెడికల్ Gastroenterology లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి 

వయస్సు : 45 సంవత్సరాల లోపు ఉండాలి 

జీతం : సుమారు రూ.78,800 + అలవెన్సులు 

కన్సల్టెంట్ ‘E’ ( న్యూక్లియర్ మెడిసిన్ ) :

  • న్యూకియర్ మెడిసిన్ లో M.D / DNB డిగ్రీ లో నేషనల్ మెడికల్ కమిషన్ గుర్తింపు ఉండాలి 
  • న్యూకియర్ మెడిసన్ విభాగంలో కనీసం 3 సంవత్సరాలు అనుభవం ఉండాలి 

వయస్సు : 45 సంవత్సరాల లోపు ఉండాలి 

జీతం : రూ.78,800 + అలవెన్సులు 

కన్సల్టెంట్ ‘E’ ( మెడికల్ ఆంకాలజీ ) :

  • DM లేదా DNB డిగ్రీ మెడికల్ ఆంకాలజీ లో లేదా సమానమైన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.ఆ డిగ్రీ  నేషనల్ మెడికల్ కమిషన్ గుర్తింపు ఉండాలి 

వయస్సు : 45 సంవత్సరాలు మించి ఉండరాదు 

జీతం : రూ.78,800 + అలవెన్సులు 

కన్సల్టెంట్ ‘D’ ( Anesthesilogy ) :

  • Anesthesia లో MD లేదా DNB లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసి ఉండాలి అది నేషనల్ మెడికల్ కమిషన్ గుర్తింపు ఉండాలి 
  • MD / DNB తరువాత Anesthesia లో టీచింగ్ హాస్పిటల్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి 
  • క్రిటికల్ కేర్ మరియు పెయిన్ మానేజ్మెంట్ అనుభవం ఉండాలి 

వయస్సు : 40 సంవత్సరాల లోపు ఉండాలి 

జీతం : రూ.67,700 + అలవెన్సులు 

కన్సల్టెంట్ ‘D’ ( జనరల్ మెడిసన్ ) :

  • నేషనల్ మెడికల్ కమిషన్ గుర్తించిన MD / DNB లో ఇంటర్నల్ మేడిసన్ లేదా సమానమైన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి 
  • పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరువాత కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి 

వయస్సు : 40 సంవత్సరాల లోపు ఉండాలి 

జీతం : రూ.67,700 + అలవెన్సులు 

మెడికల్ ఫీజిసిస్ట్ ‘D’ :

  • M.Sc ఫిజిక్స్ లో డిగ్రీని కలిగి ఉండాలి మరియు రేడియోలాజికల్ ఫిజిక్స్ లో డిప్లొమా కలిగి ఉండాలి. ఆ Diploma అనేది BARC నిర్వహించిన లేదా AERB ఆమోదించిన సమానమైన అర్హతను కలిగి ఉండాలి 
  • అడ్వాన్సడ్ కంప్యూటర్ ట్రీట్మెంట్ ప్లానింగ్ సిస్టమ్ మరియు ఇతర ఆర్ట్ టెక్నాలజీ లో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి 

వయస్సు : 40 సంవత్సరాల లోపు ఉండాలి 

జీతం : రూ.67,700 + అలవెన్సులు 

సైంటిఫిక్ ఆఫీసర్ ‘C’ ( ఇనిస్టిట్యూషనల్ రివ్యూ బోర్డ్ ) :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ క్లినికల్ రీసెర్చ్ లో కనీసం 50% మార్కులతో అర్హతను కలిగి ఉండాలి 
  • లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లో లైఫ్ సైన్స్ / ఫార్మసీ లో 50% మార్కులను కలిగి ఉండాలి. మరియు క్లినికల్ రీసెర్చ్ లో పీజీ డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్స్ కలిగి ఉండాలి 
  • కనీసం 3 సంవత్సరాలు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి 
  • మెడికల్ రీసెర్చ్ లో డేటా మానేజ్మెంట్ లో అనుభవం ఉండాలి 

వయస్సు : 35 సంవత్సరాలు లోపు ఉండాలి 

జీతం : రూ.56,100 + అలవెన్సులు 

సైంటిఫిక్ అసిస్టెంట్ ‘C’ ( న్యూక్లియర్ మెడిసిన్ ) :

  • B.Sc లో ( ఫిజిక్స్ /కెమిస్ట్రీ /బయాలజీ /న్యూకియర్ మెడిసన్ ) పూర్తిచేసి ఉండాలి 
  • 1 సంవత్సరం అనుభవం ఉండాలి 
  • లేదా B.Sc లో న్యూకియర్ మెడిసన్ టెక్నాలజీ లో 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ పూర్తిచేసి ఉండాలి 
  • RSO లెవెల్ – II ( న్యూకియర్ మెడిసన్ ) సర్టిఫికెట్ కలిగి ఉండాలి 
  • 1 సంవత్సరం సంబంధిత ఫీల్డ్ లో అనుభవం ఉండాలి

వయస్సు : 35 సంవత్సరాల లోపు ఉండాలి 

జీతం : రూ.44,900 + అలవెన్సులు 

సైంటిఫిక్ అసిస్టెంట్ ‘B’ ( రేడియో ఆంకాలజీ ) :

  • B.Sc ఫిజిక్స్ లో 50% మార్కులను సాధించి ఉండాలి మరియు రేడియో థెరపీ టెక్నాలజీ లో పీజీ డిప్లొమాలో AERB గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉండాలి 
  • B.Sc రేడియోథెరపీ టెక్నాలజీ లో 3 లేదా 4 సంవత్సరాలు కోర్స్ లో AERB గుర్తింపు పొందిన యూనివర్సిటీ  నుండి ఉండాలి 
  • B.Sc రేడియోథెరపీ టెక్నాలజీ లో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి 

వయస్సు : 35 సంవత్సరాల లోపు ఉండాలి 

జీతం : రూ.35,400 + అలవెన్సులు 

సైంటిఫిక్ అసిస్టెంట్ ‘B’ ( మైక్రోబయాలజీ ) :

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ నుండి B.Sc మైక్రోబయాలజీ లేదా బయో టెక్నాలజీ లో కనీసం 50% మార్కులను కలిగి ఉండాలి మరియు మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ లో డిగ్రీ లేదా డిప్లొమా అర్హతను కలిగి ఉండాలి 
  • ఇనిస్టిట్యూషనల్ క్లినికల్ మైక్రో బయాలజీ డిపార్ట్మెంట్ 2 సంవత్సరాలు అనుభవం ఉండాలి 

వయస్సు : 30 సంవత్సరాల లోపు ఉండాలి 

జీతం : రూ.35,400 + అలవెన్సులు 

దరఖాస్తు ఫీజు :

  • రూ.300 ఎస్సీ,ఎస్టీ,మహిళలు,దివ్యాంగులు,ఎక్స్ – సర్వీస్ మెన్ ( మొదటి సారి సివిల్ పోస్టులకు అప్లై చేస్తున్న అభ్యర్థులకు ) ఫీజు మినహాయింపు ఉంది

ఎంపిక విధానం :

  • మొదటి 1 నుండి 10 పోస్టులకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది 
  • 11 నుండి 13 పోస్టుల వరకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది 
  • ఎంపిక విధానం అభ్యర్థుల సంఖ్య బట్టి సంబంధిత అధికారి నిర్ణయిస్తారు 

 దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు దరఖాస్తులను ఆన్ లైన్ లో మాత్రమే అప్లై చేయవలెను
  • అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫారం ని పూర్తిచేసేటప్పుడు అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది 
  • అభ్యర్థులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మొదట స్క్రీనింగ్ చేసి తరువాత ఇంటర్వ్యూ / రాత పరీక్ష/స్కిల్ టెస్ట్ కి పిలుస్తారు 
  • అభ్యర్థులు రాత పరీక్ష / ఇంటర్వ్యూ / స్కిల్ టెస్ట్ కి వెళ్లే టైమ్ లో ఒరిజనల్ సర్టిఫికెట్లు మరియు ఒక సెట్ ఫోటో కాపీలను తీసుకు వెళ్ళాలి. లేని యెడల పరీక్ష మరియు ఇంటర్వ్యూ కి అనుమతించబడరు 
  •  ప్రభుత్వ లేదా పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో పనిచేసేస్తున్న అభ్యర్థులు సంస్థ అధికారి నుండి పర్మిషన్ లేటర్ను తీసుకోవాలి. రాత పరీక్ష / ఇంటర్వ్యూ /స్కిల్ టెస్ట్ సమయంలో అనుమతి లెటర్ ను ఇవ్వవలెను లేని యెడల వారిని పరీక్ష లేదా ఇంటర్వ్యూ కి అనుమతించబడరు 
  • అసంపూర్ణ లేదా తప్పుగా ఉన్న దరఖాస్తులను పరిగణలోకి తీసుకోరు
  • అర్హత ప్రమాణాలను లేదా కట్ ఆఫ్ మార్కులను పరిస్థితులను బట్టి నిర్ణయించే హక్కును సంస్థకు ఉంటుంది  

 

ఆన్లైన్ దరఖాస్తు లింక్ 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Comment