భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ( NFC ) నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. హైదరాబాద్ లోని NFC తో పాటు రాజస్థాన్ లోని NFC కోట, తమిళనాడులోని జిర్కోనియం కాంప్లెక్స్ లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవలెను.
- దరఖాస్తు ప్రారంభ తేదీ – 21 – మార్చి – 2026
- దరఖాస్తు ముగింపు తేదీ – 18 – ఏప్రిల్ – 2026
- సైంటిఫిక్ ఆఫీసర్ (సీ) – (జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్) – 03
- నర్స్ (ఏ) – 11
- సైంటిఫిక్ అసిస్టెంట్ (బీ) – రేడియోగ్రాఫర్ – 01
- సైంటిఫిక్ అసిస్టెంట్ (బీ) – పాథాలజీ టెక్నీషియన్ – 01
- ఫార్మసిస్ట్ (బీ) – 01
- టెక్నీషియన్ (బీ) – ఎక్స్-రే టెక్నీషియన్ – 01
మొత్తం ఖాళీలు – 18
సైంటిఫిక్ ఆఫీసర్ ( సీ ) :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి M.B.B.S ఉత్తీర్ణతను కలిగి ఉండాలి
- మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లో రిజిస్ట్రేషన్ ఉండాలి
- M.B.B.S పూర్తి చేసిన తరువాత కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి
వయస్సు : 18 నుండి 35 సంవత్సరాలు ఉండాలి.
జీతం : నెలకు రూ.56,100 మరియు అలవెన్సులు + NPA
నర్స్ ( ఏ ) :
- ఇంటర్మీడియట్ పూర్తిచేసి నర్సింగ్ మరియు Midwifery ( 3 సంవత్సరాలు ) అర్హతను కలిగి ఉండాలి
- లేదా B.Sc నర్సింగ్ పూర్తిచేసి ఉండాలి
- లేదా నర్సింగ్ ‘A ‘ సర్టిఫికెట్ తో పాటు 3 సంవత్సరాలు ఆర్మీడ్ ఫోర్సెస్ హాస్పిటల్ లో అనుభవం ఉండాలి
- కేంద్ర లేదా రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి చెల్లుబాటు అయ్యే Nurse Registration తప్పనిసరిగా ఉండాలి
వయస్సు : 18 నుండి 30 సంవత్సరాలు ఉండాలి
జీతం : నెలకు రూ.44,900 మరియు అలవెన్సులు
సైంటిఫిక్ అసిస్టెంట్ ( బీ ) – రేడియోగ్రాఫర్ :
- కనీసం 60% మార్కులతో B.Sc Radiography లో అర్హతను కలిగి ఉండాలి
- లేదా B.Sc లో 50% మార్కులతో పాటు Radiography లో 1 సంవత్సరం డిప్లొమా పూర్తిచేసి ఉండాలి
వయస్సు : 18 నుండి 30 సంవత్సరాలు ఉండాలి
జీతం : నెలకు రూ.35,400 మరియు అలవెన్సులు
సైంటిఫిక్ అసిస్టెంట్ ( బీ ) – పాథాలజీ టెక్నీషియన్ :
- B.Sc 60% మార్కులను కలిగి ఉండాలి మరియు DMLT ( మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ పీజీ డిప్లొమాలో ) 60% మార్కులను కలిగి ఉండాలి
- లేదా B.Sc MLT లో 60% మార్కులను కలిగి ఉండాలి
వయస్సు : 18 నుండి 30 సంవత్సరాలు ఉండాలి
జీతం : నెలకు రూ.35,400 మరియు అలవెన్సులు
ఫార్మసిస్ట్ ( బీ ) :
- ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణతను కలిగి ఉండంటంతో పాటు డిప్లొమా Pharmacy లో 2 సంవత్సరాలు కోర్స్ పూర్తిచేసి ఉండాలి
- 3 నెలలు ఫార్మసీలో ప్రాక్టికల్ గా ట్రైనింగ్ చేయాలి
- Central లేదా State ఫార్మసీ కౌన్సిల్లో Pharmacist గా రిజిస్ట్రేషన్ ఉండాలి
వయస్సు : 18 నుండి 25 సంవత్సరాలు ఉండాలి
జీతం : నెలకు రూ.29,200 మరియు అలవెన్సులు
టెక్నీషియన్ ( బీ ) – ( ఎక్స్-రే టెక్నీషియన్ ) :
- ఇంటర్మీడియట్ ( సైన్స్ ) లో 60% మార్కులను కలిగి ఉండాలి
- మరియు 1 సంవత్సరం మెడికల్ రేడియోగ్రఫీ లేదా ఎక్స్ – రే టెక్నీషియన్ సర్టిఫికెట్ ను గుర్తింపు పొందిన సంస్థ నుండి పొంది ఉండాలి
వయస్సు : 18 నుండి 25 సంవత్సరాలు ఉండాలి
జీతం : నెలకు రూ.21,700 మరియు అలవెన్సులు
దరఖాస్తు ఫీజు :
- పోస్టును బట్టి ఫీజు రూ.100 నుండి రూ.500. ఎస్సి, ఎస్టీ, పిడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది
ఎంపిక విధానం :
- పోస్ట్ కోడ్స్ 12601, 12603, 12604 ఈ పోస్టులకు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది. ఐతే అప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నట్లయితే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించవచ్చును. ఈ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూ కి షార్ట్ లిస్ట్ చేస్తారు
- పోస్ట్స్ కోడ్స్ 12602, 12605, 12606 ఈ పోస్టులకు 3 దశలలో ఎంపిక విధానం ఉంటుంది
- స్క్రీనింగ్ ( OMR బేసిడ్ ) పరీక్ష అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయటానికి నిర్వహించబడుతుంది
- అడ్వాన్సడ్ టెస్ట్ లో అభ్యర్థులు సాధించిన మార్కులు ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారు చేయబడుతుంది
- మెరిట్ లిస్ట్ ఆధారంగా స్కిల్ టెస్టుకి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు
- స్కిల్ టెస్ట్ లో పాస్ ఐన అభ్యర్థులను, అడ్వాన్సడ్ టెస్ట్ లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ క్రమంలో ఎంపిక చేస్తారు
- అభ్యర్థులు దరఖాస్తును ఆన్ లైన్ లో మాత్రమే అప్లై చేయవలెను. ఇతర విధానాల ద్వారా అప్లై చేసిన అప్లికేషన్స్ స్వీకరించబడవు
- ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేస్తే ప్రతి పోస్టుకి వేరువేరుగా అప్లై చేయవలెను
- అభ్యర్థి యాక్టివ్ గా ఉన్న ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ ఇవ్వవలెను
👉BUY NOW AMAZON
truke New Launch Crystal Dyno Leather Finish True Wireless in Ear Earbuds w/Spatial Audio, 70H Battery Rapid Charge Ear Buds, 13mm Driver HiFi Sound TWS, 40ms Ultra Low Latency, 4Mics ENC -ArcticBlue