HPCL APPRENTICES NOTIFICATION 2026 : పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( HPCL ) భారత ప్రభుత్వ రంగ సంస్థ నుండి నోటిఫికేషన్ వెలువడింది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ ( ఇంజనీరింగ్ ) పోస్టుల భర్తీకి అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. తెలంగాణ లో – 22, ఆంధ్రప్రదేశ్ లో – 62, మహారాష్ట్ర లో అత్యధికంగా 114 ఖాళీలు ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ – 16 – ఫిబ్రవరి – 2026
- దరఖాస్తు ముగింపు తేదీ – 02 – మార్చి – 2026
పోస్ట్ పేరు మరియు ఖాళీలు :
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ( ఇంజనీరింగ్ ) – 608
విభాగాలు :
- సివిల్
- మెకానికల్
- ఎలక్ట్రికల్
- ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్
అర్హతలు :
- ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ సంబంధిత విభాగం ( సివిల్,మెకానికల్,ఎలక్ట్రికల్,ఇన్ స్ట్రుమెంటేషన్ ) లో ఉత్తీర్ణతను కలిగి ఉండవలెను
- జనరల్,ఓబీసీ అభ్యర్థులు 60% మార్కులను సాదించి ఉండవలెను
- SC,ST,PWBD అభ్యర్థులు 50% మార్కులను పొంది ఉండవలెను
వయస్సు :
- 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి ( 02 – మార్చి – 2026 నాటికి )
- ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు
- ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు
- పిడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు ఉంది
శిక్షణ సమయం :
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ కాలవ్యవధి 1 సంవత్సరం ఉంటుంది
వేతనం :
- నెలకు రూ. 25,000 ఇస్తారు
- హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రూ. 20,500 ఇస్తుంది
- రూ.4,500 గవర్నమెంట్ DBT ద్వారా అకౌంట్ లో జమ చేస్తోంది
రాష్ట్రాల వారీగా ఖాళీలు :
- ఆంధ్రప్రదేశ్ – 62
- అస్సాం – 08
- బీహార్ – 11
- చండీగఢ్ – 08
- ఛత్తీస్ గడ్ – 08
- దాద్రా మరియు నగర్ హవేలీ మరియు డామన్ మరియు డయూ ( కేంద్ర పాలిత ప్రాంతం ) – 01
- ఢీల్లీ – 16
- గోవా – 05
- గుజరాత్ – 29
- హర్యానా – 10
- హిమాచల్ ప్రదేశ్ – 03
- జమ్మూ మరియు కాశ్మీర్ – 08
- జార్ఖండ్ – 11
- కర్ణాటక – 44
- కేరళ – 15
- లఢఖ్ ( కేంద్ర పాలిత ప్రాంతం ) – 01
- మధ్య ప్రదేశ్ – 22
- మహారాష్ట్ర – 114
- ఒడిశా – 22
- పంజాబ్ – 23
- రాజస్థాన్ – 39
- తమిళనాడు – 35
- తెలంగాణ – 22
- ఉత్తర ప్రదేశ్ – 40
- ఉత్తరాఖండ్ – 08
- పశ్చిమ బెంగాల్ – 37
అర్హత మరియు నియమాలు :
- భారతీయ పౌరులు మాత్రమే దరఖాస్తును అప్లై చేయవలెను
- నేషనల్ అప్రెంటీస్ షిప్ ట్రైనింగ్ స్కీమ్ ( NATS ) పోర్టల్ లో అభ్యర్థి తప్పనిసరిగా రిజిస్టర్ అయ్యి ఉండవలెను
- మరియు బోర్డు ఆఫ్ అప్రెంటీస్ షిప్ ట్రైనింగ్ ( BOAT ) ద్వారా అభ్యర్థి గుర్తింపు పొంది ఉండాలి
- రిజిస్ట్రేషన్ మరియు గుర్తింపు ఉన్న అభ్యర్థులనే ఎంపిక పరిగణలోకి తీసుకుంటారు
- అభ్యర్థి ఇంజనీరింగ్ లో ( Civil,Mechanical,Electrical,Instrumentation ) పూర్తి చేసి ఉండాలి
- 01- 04 – 2023 తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హతను కలిగి ఉంటారు
- 01 -04 -2023 కంటే ముందు ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు అనర్హులు
- జనరల్,ఓబీసీ అభ్యర్థులు 60%, ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 50% కనీస మార్కులను తప్పని సరిగా పొంది ఉండాలి
- యూనివర్సిటీ లేదా కాలేజ్ లో ఇచ్చిన Percentage ఉంటే దానినే లెక్కలోకి తీసుకుంటారు
- యూనివర్సిటీ నుండి CGPA లేదా GPA లేదా లెటర్ గ్రేడ్ ను అభ్యర్థి కలిగి ఉంటే యూనివర్సిటీ రూల్స్ ప్రకారం Equivalent Percentage చూపించాలి. సస్సమానమైన Percentage కు సంబంధించిన డాక్యుమెంట్స్ ను సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ టైమ్ లో ఇవ్వవలెను
- Percentage సమాచారం లేకపోయినట్లైతే అన్ని Semester మార్కుల మొత్తాన్ని కలిపి, పొందిన మార్కులను మొత్తం మార్కులతో భాగించి Percentage లెక్కిస్తారు. 49.99% వచ్చిన సరే 50% మార్కుల కంటే తక్కువగానే చూస్తారు
- ప్రస్తుతం Apprenticeship చేస్తున్న వారు,వేరే సంస్థల్లో Apprentice గ పనిచేసిన వారు NATS ఇతర సంస్థలలో అప్రెంటీస్ షిప్ కాంట్రాక్టు లో ఉన్నఅభ్యర్థులు అప్లై చేయటానికి అర్హులు కారు
- అభ్యర్థి 1 సంవత్సరం లేదా అంత కంటే ఎక్కువ సంవత్సరాలు పని అనుభవం ఉన్న వారు అప్లై చేయరాదు
ఎంపిక విధానం :
- అభ్యర్థి ఇంజనీరింగ్ లో సాధించిన మార్కులు ఆధారంగా మెరిట్ లిస్టును తయారుచేస్తారు
- ఎంపిక ప్రక్రియ అనేది ఆయా ట్రేడ్స్ సంబంధించిన అర్హతలు మరియు ప్రకటించిన ట్రైనింగ్ Slots యొక్క సంఖ్య ప్రకారం ఉంటుంది
- తప్పుడు లేదా పూర్తి సమాచారం లేని అప్లికేషన్లను ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రద్దు చేస్తారు
- ప్రతి 1 ఖాళీకి 5 మంది ( 1:5 నిష్పత్తిలో ) అభ్యర్థులను సెర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కి పిలుస్తారు
- రిజిస్టర్ చేసిన ఈ – మెయిల్ ద్వారా షార్ట్ లిస్టెడ్ అభ్యర్థులకు సమాచారం తెలియచేస్తారు
- సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థులకు ఎటువంటి ప్రయాణ ఖర్చులు ఇవ్వబడవు
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కు హాజరైన మరియు అర్హతకు తగిన అభ్యర్థుల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ ను తయారుచేస్తారు
- Tri – Partite Apprenticeship కాంట్రాక్టును NATS వెబ్ సైట్ లో అంగీకరించాలి
- అభ్యర్థి మెడికల్ ఫిట్నెస్ ను పూర్తి చేయవలెను. మరియు పోలీస్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి
- అభ్యర్థి వీటిని అంన్నింటిని పూర్తి చేసిన తరవాతే Apprentice గ నియమిస్తారు
ముఖ్యమైన నిబంధనలు :
- Apprenticeship Act,1961 మరియు వాటి సవరణ చట్టాల ప్రకారం అప్రెంటీస్ నియామకం జరుగుతుంది
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ కాల వ్యవధి 1 సంవత్సరం ఉంటుంది
- హౌసింగ్ అలవెన్స్ మరియు ఇతర అలవెన్సు లు ఇవ్వబడవు కేవలం స్టైపెండ్ మాత్రమే ఇవ్వబడుతుంది
- SC,ST,OBC,PwBD రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు నిర్దేశిత ఫార్మేట్ లో డాక్యుమెంట్స్ ఇవ్వవలెను
- ఫార్మేట్ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( HPCL ) కెరీర్స్ వెబ్సైటు లో Downloads For Apprentices సెక్షన్ లో ఉంటుంది
- అభ్యర్థి ఇచ్చిన ఇమెయిల్ ID మరియు మొబైల్ నంబర్ కి సమాచారం తెలియచేయబడతాయి. పోస్ట్ ద్వారా ( Hard Copy ) ద్వారా పంపబడదు
- 1 సంవత్సరం వరకు అభ్యర్థి ఇచ్చిన E -Mail ID మరియు Mobile Number యాక్టివ్ గా ఉండవలెను
- అభ్యర్థి ఆన్ లైన్ అప్లికేషన్ లో ఇచ్చిన సమాచారం,ఒరిజనల్ డాక్యుమెంట్స్ తో పూర్తిగా సరిపోవాలి లేకపోతే ఏ దశలోనైనా తేడాలు ఉన్నట్లైతే అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది
- అప్లికేషన్స్ ఎక్కువగా వస్తే అర్హతలను పెంచటానికి మరియు సెలక్షన్ విధానాన్ని మార్చే హక్కును హిందుస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ ( HPCL ) కలిగి ఉంటుంది
- ఎంపిక చేయవలసిన అప్రెంటీస్ సంఖ్య ను ఏ దశలోనైనా మార్చటానికి HPCL హక్కును కలిగి ఉంటుంది
దరఖాస్తు విధానం :
- దరఖాస్తును ఆన్ లైన్ లో మాత్రమే అప్లై చేయవలెను,ఆన్లైన్ లో కాకుండా మరి ఏ ఇతర మార్గాల ద్వారా వచ్చిన దరఖాస్తును ఆగీకరించరు ( పోస్ట్ ద్వారా కాని మెయిల్ ద్వారా వచ్చిన వాటిని ) పరిగణలోకితీసుకోరు
- hpcl మెయిన్ వెబ్సైటు ను ఓపెన్ చేయండి,తరువాత న్యూ యూసర్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి,తరువాత వచ్చిన పేజీలో డీటెయిల్స్ తో నింపండి ( వర్కింగ్ లో ఉన్న ఇమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వవలెను )
- మీరు ఇచ్చిన ఇమెయిల్ ఐడి కి రిజిస్ట్రేషన్ ఐడి మరియు పాస్వర్డ్ వస్తాయి,వాటితో లాగిన్ అవ్వండి తరువాత అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతాది.ఇందులో యూసర్ కి సంబందించిన పూర్తి డీటెయిల్స్ తో ఫారం నింపండి
- ఒక అభ్యర్థి ఒక అప్లికేషన్ను మాత్రమే సబ్మిట్ చేయవలెను,ఎక్కువ అప్లికేషన్స్ ను చేస్తే అన్ని రిజెక్ట్ అవుతాయి
- అభ్యర్థి అప్లికేషన్ ఫామ్ లో ఇచ్చిన ప్రతి సమాచారాన్ని జాగ్రత్తగా చదవవలెను
- ప్రకటనలో ఉన్నటువంటి బ్రాంచ్ లలో మీ Branch ని Dropdown నుండి Select చేయవలెను
- అప్లికేషన్ ఫామ్ లో అభ్యర్థి పర్సనల్ వివరాలను సరిగా నింపవలెను. అప్లికేషన్ ఫామ్ లో సమాచారాన్ని నింపిన తరువాత “ Validate your details “ పై క్లిక్ చేయవలెను
- Error వచ్చినట్లైతే message ప్రకారం సరిచేయవలెను
- అభ్యర్థి వివరాలను Validate చేసిన తర్వాత Save మరియు Next పై క్లిక్ చేయవలెను
- తరువాత అభ్యర్థి యొక్క Contact డిటేల్స్ ( Permanent Address,Mobile Number ) నింపాలి
- అభ్యర్థి ఒక రాష్ట్రము మాత్రమే ఎంపిక చేయవలెను
- రీసెంట్ పాస్ పోర్ట్ సైజు ఫోటో మరియు సంతకము ను అప్లోడ్ చేయవలెను
- దరఖాస్తును తప్పుడు సమాచారం లేకుండా చూసుకోవలెను లేకుంటే ఎంపిక విధానములో మీ అప్లికేషన్ తిరష్కారం చేయవచ్చును.
- అప్లికేషను ఫైనల్ సబ్మిట్ కి ముందు క్లియర్ గా పరిశీలించండి,తరువాత మాత్రమే సబ్మిట్ చేయండి
- సబ్మిట్ చేయబడిన అప్లికేషను ప్రింట్ అవుట్ కూడా తీసుకోండి, ఎంపికకు ఉపయోగ పడుతుంది