HLL Lifecare notification 2026 | హెచ్ఎల్ఎల్ నోటిఫికేషన్ 2026 | మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలు

హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ (HLL) నుండి కాంట్రాక్టు ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదల అయ్యింది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 40 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. అర్హత మరియు ఆశక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవలెను.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభ తేదీ – 18 – ఫిబ్రవరి – 2026
  • దరఖాస్తు ముగింపు తేదీ – 10 – మార్చి – 2026

పోస్ట్ పేరు :

  • మేనేజ్ మెంట్ ట్రైనీ – 40 పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు :

  • ఇంజనీరింగ్ – 17
  • ఫార్మా – 06
  • మార్కెటింగ్ – 10
  • హ్యూమన్ రిసోర్సెస్ – 02
  • సోషల్ వర్క్ – 01
  • డేటా అనలిటిక్స్ – 01
  • హాస్పిటల్ మేనేజ్మెంట్ – 03

అర్హతలు :

  • ఇంజనీరింగ్ : BE /B.Tech లో ( కెమికల్/మెకానికల్/బయోమెడికల్/ఇన్స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్/ సివిల్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్ లో కనీసం 65% మార్కులతో అర్హతను కలిగి ఉండవలెను
  • ఫార్మా : గుర్తింపు పొందిన సంస్థ నుండి B.Pharm ( Full -time ) లో కనీసం 65% మార్కులతో ఉత్తీర్ణతను కలిగి ఉండవలెను
  • మార్కెటింగ్ : అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి MBA ( ఫుల్ టైమ్ ) లో మార్కిటింగ్ లేదా డిజిటల్ మార్కెటింగ్ లో లేదా PGDBM ( మార్కెటింగ్ ) MIB లేదా MPIB లో 2 సంవత్సరాలు 65% మార్కులతో అర్హతను పొంది ఉండాలి
  • హ్యూమన్ రిసోర్సెస్ : MBA (HR) లేదా MSW ( PM మరియు IR లేదా PGDPM లేదా MA ( PM మరియు IR లేదా MHRM లో గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి 65% మార్కులతో  ఉత్తీర్ణతను కలిగి ఉండాలి 
  • LLB లో అర్హతను కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది 
  • సోషల్ వర్క్ : MSW మెడికల్ మరియు సైకియాట్రీ ( ఫుల్ టైమ్ ) లో గుర్తింపు పొందిన సంస్థ నుండి కనీసం 65% మార్కులతో అర్హతను కలిగి ఉండాలి 
  • డేటా అనలిటిక్స్ : గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూషన్ నుండి  BE,B.Tech,Bsc లో (మేథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్), ఫుల్ టైమ్ MBA డేటా అనలైటిక్స్ లో కనీసం 65% మార్కులతో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి 
  • హాస్పిటల్ మేనేజ్మెంట్ : ఫుల్ టైమ్ MBA ( హాస్పిటల్ మేనేజ్మెంట్ ) లో UG సైన్స్ లో గుర్తింపు పొందిన సంస్థ నుండి 65% మార్కులతో ఉత్తీర్ణతను కలిగి ఉండవలెను
  • జనరల్,OBC,EWS అభ్యర్థులకు 65% మార్కులు ఉండాలి. SC,ST,PWD అభ్యర్థులకు మార్కులు ఉండాలి ( 5% సడలింపు ఉంది )
  •  అభ్యర్థి యొక్క విద్యా అర్హతలు గవర్నమెంట్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి తప్పనిసరిగా ఆమోదించబడి ఉండాలి

రిజర్వేషన్స్ వారీగా వర్గాల ఖాళీలు :

  • జనరల్ అభ్యర్థులకు –14
  • SC అభ్యర్థులకు- 06
  • ST అభ్యర్థులకు – 03
  • OBC (NCL ) అభ్యర్థులకు – 11
  • EWS అభ్యర్థులకు – 04
  • PWD అభ్యర్థులకు – 02

మొత్తం ఖాళీలు – 40 

  • పరిస్థితులను లేదా అవసరాన్ని బట్టి ఖాళీల సంఖ్య ను పెంచటానికి లేదా తగ్గించటానికి లేదా నియామకాలను రద్దు చేయటానికి లేదా పోస్టులను భర్తీ చేయకుండా ఉండే హక్కు సంస్థకు ఉంటుంది 
  • అభ్యర్థులు HLL లోని వేర్వేరు యూనిట్లలో సంస్థ అవసరాన్ని బట్టి ట్రాన్స్ ఫర్ అవుతూ ఉంటారు 
  • HLL లేదా దానికి సంబంధించిన సంస్థల్లో ఎంపికైన అభ్యర్థులు పోస్టింగ్ పొందవచ్చును 
  • భారతదేశంలో లేదా విదేశాలలో కూడా అభ్యర్థులు అవసరమైనప్పుడు పని చేయవలసి ఉంటుంది 

వయస్సు :

  • 27 సంవత్సరాలు ఉండాలి ( 01 – ఫిబ్రవరి – 2026 నాటికి )
  • SC,ST,OBC,PWD అభ్యర్థులకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది 

రిజర్వేషన్స్ :

1.EWS అభ్యర్థులకు :

  • గవర్నమెంట్ జారీచేసిన Income మరియు Asset Certificate ను EWS అభ్యర్థులు ఇవ్వవలసి ఉంటుంది 
  • సరైన అధికారుల ద్వారా ఆ సర్టిఫికెట్ మంజూరు అయ్యి ఉండాలి 
  • అభ్యర్థి వద్ద Income మరియు Asset Certificate లేని యెడల రిజర్వేషన్ లేదా ఇతర సడలింపులు ఇవ్వబడవు 

2.ST,SC,OBC అభ్యర్థులకు :

  • SC,ST,OBC అభ్యర్థులు తహసీల్దార్ ర్యాంక్ కన్నా తక్కువ కానీ రెవిన్యూ అథారిటీ ద్వారా జారీ చేసిన రీసెంట్ Community Certificate ను ఇవ్వవలసి ఉంటుంది 
  • అభ్యర్థి వద్ద Community Certificate లేనట్లయితే గవర్నమెంట్ ద్వారా ఇచ్చే రిజర్వేషన్స్ మరియు ఇతర సడలింపులు వర్తించవు  

3.PWD అభ్యర్థులకు :

  • PWD అభ్యర్థులకు కనీసం 40% వికలాంగులు అయ్యి ఉండాలి 
  • PWD అభ్యర్థులు 2017 వికలాంగుల హక్కుల రూల్స్ ప్రకారం,అధికారికంగా జారీ చేసిన Disablity Certificate ఇవ్వవలసి ఉంటుంది

వేతనం :

  • నెలకు రూ.40,000 +DA ( డియర్ నెస్ అలవెన్సు లు ) ఇవ్వబడతాయి  
  • 1 సంవత్సరం ట్రయినింగ్ పూర్తీ ఐన తరవాత టెస్ట్ పాస్ అయినట్లైతే డిప్యూటీ మేనేజర్ గ రెగ్యులర్ చేస్తారు 
  • రెగ్యులర్ ఐన తరువాత వేతనం రూ.40,000 నుండి రూ.1,40,000 ఉంటుంది 

అప్లికేషన్ ఫీజు :

  • జనరల్,ఓబీసీ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000/-
  • ఎస్సీ,ఎస్టీ,పిడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది 
  • ఫీజును ఆన్ లైన్ లో మాత్రమే చెల్లించవలెను 

ఎంపిక విధానం :

  • ఎంపిక విధానం కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ (CBT),ప్రాధమిక పరీక్ష ( Preliminary Interview ),సైకోమెట్రిక్ అంచనా ( Psychometric Assessment ),తుది ఇంటర్వ్యూ ( Final Interview ) ఆధారంగా ఉంటుంది 
  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష ( CBT ) మొత్తం 90 నిముషాలు ఉంటుంది.మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి
  • కంప్యూటర్ ఆధారిత టెస్ట్ లో జనరల్,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 50% మార్కులను,ఓబీసీ అభ్యర్థులు 40% మార్కులను,ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూడీ అభ్యర్థులు 35% కనీస అర్హత కలిగిన మార్కులను సాధించాలి 
  • కంప్యూటర్ ఆధారిత టెస్టులో ( CBT ) అర్హత మార్కులను పొందిన అభ్యర్థులను తర్వాత పరీక్ష అయినటువంటి ప్రాధమిక ఇంటర్వ్యూ ( Preliminary Interview ) కి షార్ట్ లిస్ట్ చేస్తారు 
  • ప్రతి 1 పోస్టుకి 6 మంది అభ్యర్థుల నిష్పత్తి లో, రిజర్వేషన్ మరియు మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను ప్రాధమిక ఇంటర్వ్యూ కి సంస్థ పిలుస్తుంది 
  • HLL ప్రాథమిక ఇంటర్వ్యూ లో జనరల్ అభ్యర్థులు 50%, ఓబీసీ అభ్యర్థులు 40%,ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూడీ అభ్యర్థులు 35% కనీస అర్హత మార్కులను పొందవలసి ఉంటుంది 
  • ప్రాథమిక ఇంటర్వ్యూ లో షార్ట్ లిస్ట్ ఐన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో అంటే ( 1 పోస్టుకి 3 అభ్యర్థులను ) సైకోమెట్రిక్ విశ్లేషణకు వెళ్ళవలసి ఉంటుంది 
  • ఈ విశ్లేషణ ద్వారా అభ్యర్థి యొక్క ప్రవర్తన,వ్యక్తిత్వం మరియు నిర్వహణ సామర్థ్యం వంటి అంశాలను అంచనా వేస్తారు 
  • తుది ఇంటర్వ్యూ కి అభ్యర్థులు ఒరిజనల్ సర్టిఫికెట్స్ మరియు టెస్టిమోనియల్స్ ను ఇవ్వవలసి ఉంటుంది.లేని యెడల తుది ఇంటర్వ్యూ కి అభ్యర్థులకు అనుమతి ఇవ్వబడదు 
  • HLL నిర్ణయం ప్రకారం సెర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తరువాత 1:3 నిష్పత్తి లో అభ్యర్థులకు తుది ఇంటర్వ్యూ నిర్వహిస్తారు
  • ఫైనల్ ఇంటర్వ్యూ లో జనరల్ అభ్యర్థులు 50%, ఓబీసీ అభ్యర్థులు 40%, ఎస్సీ,ఎస్టీ,పిడబ్ల్యూడీ అభ్యర్థులు 35% కనీస అర్హత కలిగిన మార్కులను సాధించ వలసి ఉంటుంది 
  • అభ్యర్థులు ఫైనల్ ఇంటర్వ్యూ లో పొందిన మార్కుల ఆధారంగా HLL లో Management Trainee గ నియామకానికి షార్ట్ లిస్ట్ చేస్తారు 
  • SC,ST,OBC,PWD,EWS వర్గాల వారీగా అందుబాటులో ఉన్న ఖాళీల ఆధారంగా విడివిడిగా తుది మెరిట్ లిస్ట్ ( Final Merit List ) తయారు చేస్తారు 

సర్వీస్ బాండ్ :

  • అభ్యర్థులు ఎంపిక ఐన తరువాత జాయినింగ్ తేదీ నుండి 5 సంవత్సరాలు ( 60 నెలలు ) కంపెనీలో పని చేయవలసి ఉంటుంది 
  • అందువలన అభ్యర్థులు జాయినింగ్ టైమ్ లో రూ.3,00,000/- రూపాయల మొత్తానికి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ పైన సంతకం చేయవలసి ఉంటుంది

ప్రయాణ ఖర్చులు :

  • కంప్యూటర్ ఆధారిత పరీక్షకు (CBT) వెళ్ళే అభ్యర్థులకు ఎటువంటి ప్రయాణ ఖర్చులు ఇవ్వబడవు 
  • కానీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మరియు తుది ఇంటర్వ్యూ కి పిలిచిన అభ్యర్థులకు పోస్టుకు అనుగుణంగా మరియు కంపెనీ రూల్స్ ప్రకారం ప్రయాణ ఖర్చులు తిరిగి చెల్లించబడతాయి
  • డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మరియు ఫైనల్ ఇంటర్వ్యూ కి సెలెక్ట్ ఐన అభ్యర్థులకు మాత్రమే దరఖాస్తులో ఇచ్చిన మెయిలింగ్ అడ్రస్ నుండి HLL Lifecare Limited,తిరువనంతపురం వరకు స్వల్ప దూర మార్గంలో ప్రయాణించిన Third AC రైలు ప్రయాణ ఖర్చులు తిరిగి ఇవ్వబడతాయి 
  • టికెట్ ప్రూఫ్ మరియు సేవింగ్ బ్యాంక్ పాస్ బుక్ ముందు పేజీ ( అకౌంట్ నంబర్ మరియు IFSC కోడ్ స్పష్టంగా కనిపించేలా ) కాపీ ఇవ్వవలెను 
  • అవసరమైన వివరాలు ఇచ్చిన అభ్యర్థులకు మాత్రమే రీయింబర్సుమెంట్ చెల్లించడం జరుగుతుంది 

దరఖాస్తు విధానం :

  • దరఖాస్తును ఆన్ లైన్ లో మాత్రమే అప్లై చేయవలెను 
  • అభ్యర్థి రిజిస్ట్రేషన్ కొరకు మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడి వర్కింగ్ లో ఉన్న వాటిని ఇవ్వవలెను 
  • అభ్యర్థి పూర్తి డీటెయిల్స్ ను ఆన్లైన్ ఫారం లో నింపవలెను,తప్పుడు సమాచారము ఇచ్చిన యెడల వారి అప్లికేషన్ తిరస్కరించబడుతుంది 
  • అప్లికేషన్ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించ వలెను 
  • అప్లికేషన్ ను సబ్మిట్ చేసిన తరవాత ప్రింట్ అవుట్ ను తీసికొనవలెను 

దరఖాస్తు లింక్ 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Comment