NFC NOTIFICATION 2026 | సైంటిఫిక్ ఆఫీసర్ | సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీలు

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ( NFC ) నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. హైదరాబాద్ లోని NFC తో పాటు రాజస్థాన్ లోని NFC కోట, తమిళనాడులోని జిర్కోనియం కాంప్లెక్స్ లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవలెను. 

Today’s Best Deals -999 only 

   👉Buy Now Amazon

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభ తేదీ – 21 – మార్చి – 2026
  • దరఖాస్తు ముగింపు తేదీ – 18 – ఏప్రిల్ – 2026

పోస్టుల పేర్లు మరియు ఖాళీలు :

  • సైంటిఫిక్ ఆఫీసర్ (సీ) – (జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్) – 03
  • నర్స్ () – 11
  • సైంటిఫిక్ అసిస్టెంట్ (బీ) – రేడియోగ్రాఫర్ – 01
  • సైంటిఫిక్ అసిస్టెంట్ (బీ) – పాథాలజీ టెక్నీషియన్ – 01
  • ఫార్మసిస్ట్ (బీ) – 01
  • టెక్నీషియన్ (బీ) – ఎక్స్-రే టెక్నీషియన్ – 01

మొత్తం ఖాళీలు – 18

అర్హతలు :

సైంటిఫిక్ ఆఫీసర్ ( సీ ) :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి M.B.B.S ఉత్తీర్ణతను కలిగి ఉండాలి 
  • మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లో రిజిస్ట్రేషన్ ఉండాలి 
  • M.B.B.S పూర్తి చేసిన తరువాత కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి 

వయస్సు : 18 నుండి 35 సంవత్సరాలు ఉండాలి.

జీతం : నెలకు రూ.56,100 మరియు అలవెన్సులు + NPA 

నర్స్ () :

  • ఇంటర్మీడియట్ పూర్తిచేసి నర్సింగ్ మరియు Midwifery ( 3 సంవత్సరాలు ) అర్హతను కలిగి ఉండాలి 
  • లేదా B.Sc నర్సింగ్ పూర్తిచేసి ఉండాలి 
  • లేదా నర్సింగ్ ‘A ‘ సర్టిఫికెట్ తో పాటు 3 సంవత్సరాలు ఆర్మీడ్ ఫోర్సెస్ హాస్పిటల్ లో అనుభవం ఉండాలి 
  • కేంద్ర లేదా రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి చెల్లుబాటు అయ్యే Nurse Registration తప్పనిసరిగా ఉండాలి 

వయస్సు : 18 నుండి 30 సంవత్సరాలు ఉండాలి 

జీతం : నెలకు రూ.44,900 మరియు అలవెన్సులు 

సైంటిఫిక్ అసిస్టెంట్ ( బీ ) – రేడియోగ్రాఫర్ :

  • కనీసం 60% మార్కులతో B.Sc Radiography లో అర్హతను కలిగి ఉండాలి 
  • లేదా B.Sc లో 50% మార్కులతో పాటు Radiography లో 1 సంవత్సరం డిప్లొమా పూర్తిచేసి ఉండాలి 

వయస్సు : 18 నుండి 30 సంవత్సరాలు ఉండాలి 

జీతం : నెలకు రూ.35,400 మరియు అలవెన్సులు 

సైంటిఫిక్ అసిస్టెంట్ ( బీ ) – పాథాలజీ టెక్నీషియన్ :

  • B.Sc 60% మార్కులను కలిగి ఉండాలి మరియు DMLT ( మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ పీజీ డిప్లొమాలో ) 60% మార్కులను కలిగి ఉండాలి 
  • లేదా B.Sc MLT లో 60% మార్కులను కలిగి ఉండాలి 

వయస్సు : 18 నుండి 30 సంవత్సరాలు ఉండాలి 

జీతం : నెలకు రూ.35,400 మరియు అలవెన్సులు 

ఫార్మసిస్ట్ ( బీ ) :

  • ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణతను కలిగి ఉండంటంతో పాటు డిప్లొమా Pharmacy లో 2 సంవత్సరాలు కోర్స్ పూర్తిచేసి ఉండాలి 
  • 3 నెలలు ఫార్మసీలో ప్రాక్టికల్ గా ట్రైనింగ్ చేయాలి 
  • Central లేదా State ఫార్మసీ కౌన్సిల్లో Pharmacist గా రిజిస్ట్రేషన్ ఉండాలి 

వయస్సు : 18 నుండి 25 సంవత్సరాలు ఉండాలి 

జీతం : నెలకు రూ.29,200 మరియు అలవెన్సులు 

టెక్నీషియన్ ( బీ ) – ( ఎక్స్-రే టెక్నీషియన్ )

  • ఇంటర్మీడియట్ ( సైన్స్ ) లో 60% మార్కులను కలిగి ఉండాలి 
  • మరియు 1 సంవత్సరం మెడికల్ రేడియోగ్రఫీ లేదా ఎక్స్ – రే టెక్నీషియన్ సర్టిఫికెట్ ను గుర్తింపు పొందిన సంస్థ నుండి పొంది ఉండాలి 

వయస్సు : 18 నుండి 25 సంవత్సరాలు ఉండాలి 

జీతం : నెలకు రూ.21,700 మరియు అలవెన్సులు 

దరఖాస్తు ఫీజు :

  • పోస్టును బట్టి ఫీజు రూ.100 నుండి రూ.500. ఎస్సి, ఎస్టీ, పిడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది 

ఎంపిక విధానం :

  • పోస్ట్ కోడ్స్ 12601, 12603, 12604 ఈ పోస్టులకు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది. ఐతే అప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నట్లయితే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించవచ్చును. ఈ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూ కి షార్ట్ లిస్ట్ చేస్తారు 
  • పోస్ట్స్ కోడ్స్ 12602, 12605, 12606 ఈ పోస్టులకు 3 దశలలో ఎంపిక విధానం ఉంటుంది 
  • స్క్రీనింగ్ ( OMR బేసిడ్ ) పరీక్ష అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయటానికి నిర్వహించబడుతుంది 
  • అడ్వాన్సడ్ టెస్ట్ లో అభ్యర్థులు సాధించిన మార్కులు ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారు చేయబడుతుంది 
  • మెరిట్ లిస్ట్ ఆధారంగా స్కిల్ టెస్టుకి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు 
  • స్కిల్ టెస్ట్ లో పాస్ ఐన అభ్యర్థులను, అడ్వాన్సడ్ టెస్ట్ లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ క్రమంలో ఎంపిక చేస్తారు 

దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు దరఖాస్తును ఆన్ లైన్ లో మాత్రమే అప్లై చేయవలెను. ఇతర విధానాల ద్వారా అప్లై చేసిన అప్లికేషన్స్ స్వీకరించబడవు 
  • ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేస్తే ప్రతి పోస్టుకి వేరువేరుగా అప్లై చేయవలెను
  • అభ్యర్థి యాక్టివ్ గా ఉన్న ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ ఇవ్వవలెను 

ఆన్లైన్ దరఖాస్తు లింక్ 

      👉BUY NOW AMAZON 

truke New Launch Crystal Dyno Leather Finish True Wireless in Ear Earbuds w/Spatial Audio, 70H Battery Rapid Charge Ear Buds, 13mm Driver HiFi Sound TWS, 40ms Ultra Low Latency, 4Mics ENC -ArcticBlue