నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పోరేషన్ రిక్రూట్మెంట్ 2026 | NBCC Recruitment 2026 | మేనేజర్ ఖాళీలు -59

ఢిల్లీ లోని నేషనల్ బిల్డింగ్స్ కనస్ట్రక్షన్స్ కార్పొరేషన్స్ లిమిటెడ్ ( NBCC ) నుండి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న మేనేజీరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో ఏప్రిల్ 5 వరకు అప్లై చేసుకోవలెను 

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ – 06 – మార్చి – 2026

దరఖాస్తు ముగింపు తేదీ – 05 – ఏప్రిల్ – 2026

పోస్టుల పేర్లు మరియు ఖాళీలు :

  • జనరల్ మేనేజర్ – 01
  • మేనేజర్ – 02
  • డిప్యూటీ మేనేజర్ – 01 
  • అసిస్టెంట్ మేనేజర్ – 08
  • సీనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ – 10
  • గ్యాడ్యుయేట్ అసిస్టెంట్ – 02
  • జూనియర్ ఇంజనీర్ – 35

మొత్తం ఖాళీల సంఖ్య – 60

అర్హతలు :

జనరల్ మేనేజర్ :

  • సివిల్ ఇంజనీరింగ్ లో ఫుల్ టైమ్ డిగ్రీ లేదా సస్సమానమైన ఉత్తీర్ణతను  గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి కలిగి ఉండాలి 
  • 15 సంవత్సరాలు PMC / EPC / రియల్ఎస్టేట్ / ఇన్ఫ్రాస్ట్రక్చర్  రంగాలలో అనుభవం ఉండాలి 
  • గవర్నమెంట్ లేదా పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో పనిచేస్తూ ఉంటే కనీసం 2 సంవత్సరాలు రెగ్యులర్ గా పనిచేసిన అనుభవం ఉండాలి 
  • బ్యాంకింగ్ లేదా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తూ ఉంటే 

వయస్సు : గరిష్టంగా 54 సంవత్సరాలు ఉండాలి 

జీతం : నెలకు రూ.90,000 నుండి రూ.2,40,000 ఉంటుంది 

మేనేజర్ ( ఆర్కిటెక్చర్ మరియు ప్లానింగ్ ) :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఆర్కిటెక్చర్ లో  ఫుల్ టైమ్ డిగ్రీ లో ఉత్తీర్ణతతో పాటు 60% మార్కులను సాధించి ఉండాలి 
  • 6 సంవత్సరాలు టౌన్ షిప్ / హౌసింగ్ / కమర్షియల్ కాంప్లెక్స్ లు / ఇనిస్టిట్యూషనల్ / పరిశ్రమల ప్రోజెక్టుల ప్లానింగ్ / డిజైనింగ్ మరియు డీటైలింగ్ లో అనుభవం ఉండాలి 
  • ఇంటీరియర్ డిజైనింగ్ లో కూడా అనుభవం ఉండాలి  
  • కంప్యూటర్ వినియోగంలో నాలెడ్జ్ ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది 

వయస్సు : 37 సంవత్సరాలు ఉండవలెను 

జీతం : నెలకు రూ.60,000 నుండి రూ.1,80,000/-

డిప్యూటీ మేనేజర్ ( కంపెనీ సెక్రటరీ ) :

  • అర్హత కలిగిన కంపెనీ సెక్రటరీ ( Company Secretary ) అయ్యి ఉండాలి 
  • కనీసం 3 సంవత్సరాలు అనుభవం ఉండాలి 
  • కమ్యూనికేషన్స్ మరియు డ్రాప్టింగ్ స్కిల్స్ ను కలిగి ఉండాలి 
  • కంపెనీస్ Act, 1956 మరియు SEBI నిబంధనల ప్రకారం లీగల్ కంప్లెయన్స్ లో అనుభవం ఉండాలి 
  • కంప్యూటర్ వినియోగంలో పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది 

వయస్సు : 33 సంవత్సరాలు గరిష్టంగా ఉండాలి 

జీతం : నెలకు రూ.50,000 నుండి రూ.1,60,000/-

అసిస్టెంట్ మేనేజర్ ( కార్పొరేట్ కమ్యూనికేషన్స్ ) :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ /డిప్లొమాలో 2 సంవత్సరాలు మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజం అడ్వర్టైజింగ్ మరియు పబ్లిక్ రిలేషన్స్ లో ఉత్తీర్ణతతో పాటు 60% మార్కులను కలిగి ఉండాలి 
  • పబ్లిక్ డొమైన్ లో కార్పొరేట్ ఇమేజింగ్, ఇన్ -హౌస్ ఇమేజింగ్, న్యూస్ లెటర్స్, ఇతర పబ్లికేషన్స్ డిజైనింగ్ మరియు తయారీ లో కనీసం 2 సంవత్సరాలు అనుభవం ఉండాలి 
  • ఇంగ్లీష్ రాయడం మరియు చదవడంలో అవగాహన ఉండాలి 
  • కంప్యూటర్ ఉపయోగంలో నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది 

వయస్సు : 30 సంవత్సరాలు మించి ఉండకూడదు 

జీతం : నెలకు రూ.40,000 నుండి రూ.1,40,000/-

అసిస్టెంట్ మేనేజర్ ( రాజబాషా ) :

  • మాస్టర్ డిగ్రీ లో హిందీ డిగ్రీ స్థాయిలో ఇంగ్లీష్ సబ్జెట్ ఉండాలి లేదా ఇంగ్లీష్లో మాస్టర్ డిగ్రీ,డిగ్రీ స్థాయిలో హిందీ సబ్జెక్ట్ లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అర్హతను కలిగి ఉండాలి 
  • ట్రాన్సిలేషన్ డిప్లొమాలో కనీసం 1 సంవత్సరం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అర్హతను కలిగి ఉండాలి 
  • ఇంగ్లీష్ నుండి హిందీకి మరియు హిందీ నుండి ఇంగ్లీషుకి ట్రాన్సలేట్ చేయడంలో కనీసం 2 సంవత్సరాలు అనుభవం ఉండాలి 
  • గవర్నమెంట్ అధికార బాషా విధానం మరియు దాని ఇంప్లిమెంటేషన్ లో అవగాహన ఉండాలి 

వయస్సు : 30 సంవత్సరాలు మించి ఉండరాదు 

జీతం : నెలకు రూ.40,000 నుండి రూ.1,40,000/-

అసిస్టెంట్ మేనేజర్ ( HRM ) :

  • MBA / MSW / 2 సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ / పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా మానేజ్మెంట్ / HRM స్పెషలైజేషన్ లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 60% మార్కులతో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి 
  • PSU / ప్రభుత్వ / లార్జ్ ప్రైవేట్ రంగ కంపెనీలలో కనీసం 2 సంవత్సరాలు HRM విభాగంలో పనిచేసిన అనుభవం ఉండాలి 
  • కంప్యూటర్ వినియోగంలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది 

వయస్సు : 30 సంవత్సరాలు ఉండాలి 

జీతం : నెలకు రూ.40,000 నుండి రూ.1,40,000/-

సీనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ( సివిల్ ) :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సివిల్ ఇంజనీరింగ్ ఫుల్ టైమ్ డిగ్రీ లేదా సమానమైన ఉత్తీర్ణతతో పాటు 60% మార్కులను పొంది ఉండాలి 
  • PMC / EPC / రియల్ ఎస్టేట్ ఇన్ ఫ్రాస్ట్రెక్చర్ ఫీల్డ్ లో 2 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి 
  • M.Tech చేసిన అభ్యర్థులకు 1 సంవత్సరం అనుభవం ప్రొవైడ్ చేస్తుంది 
  • కంప్యూటర్ అవగాహన కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు 

వయస్సు : 30 సంవత్సరాల లోపు ఉండాలి 

జీతం : నెలకు రూ.40,000 నుండి రూ.1,40,000/-

అసిస్టెంట్ మేనేజర్ ( PHE ) :

  • సివిల్ ఇంజనీరింగ్ లో ఫుల్ టైమ్ డిగ్రీలో 60% మార్కులను మరియు పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ లేదా ఇన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లో మాస్టర్ డిగ్రీలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉత్తీర్ణతను కలిగి ఉండవలెను 
  •  వాటర్,సీవరేజ్ ప్రాజెక్ట్ లో కనీసం 2 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి 
  • కంప్యూటర్ ఉపయోగంలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది 

యస్సు : 30 సంవత్సరాలు లోపు ఉండాలి 

జీతం : నెలకు రూ.40,000 నుండి రూ.1,40,000/-

గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ ( IT / CS / నెట్ వర్కింగ్ / సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ) :

  • ఏదైనా విభాగంలో డిగ్రీ లో ఫుల్ టైమ్ అర్హతను కలిగి ఉండాలి 
  • కనీసం 1 సంవత్సరం సర్టిఫికెట్ లేదా డిప్లొమా కోర్స్ లో  ( హార్డ్ వేర్ / నెట్ వర్కింగ్ / సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ / సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ / ప్రొగ్రమింగ్ ) వీటిలో ఏదైనా ఒక దానిలో అర్హతను కలిగి ఉండాలి 
  • కనీసం 5 సంవత్సరాలు సంబంధిత రంగంలో పనిచేసిన అనుభవం ఉండాలి

వయస్సు : 28 సంవత్సరాలు మించి ఉండరాదు 

జీతం : నెలకు రూ.30,000 నుండి రూ.1,20,000/-

జూనియర్ ఇంజనీర్ ( సివిల్ ) :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి డిప్లొమాలో ఫుల్ టైమ్ సివిల్ ఇంజనీరింగ్ లో 3 సంవత్సరాలు ఉత్తీర్ణతతో పాటు 60% మార్కులను కలిగి ఉండాలి 

వయస్సు : 28 సంవత్సరాలు మించి ఉండరాదు 

జీతం : నెలకు రూ.27,270/-

జూనియర్ ఇంజనీర్ ( ఎలక్ట్రికల్ ) :

  • డిప్లొమాలో ఫుల్ల్ టైమ్ 3 సంవత్సరాలు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో గుర్తింపు పొందిన యూనిర్సిటీ నుండి ఉత్తీర్ణతను కలిగి ఉండంటంతో పాటు 60% మార్కులను సాధించి ఉండాలి 

వయస్సు : 28 సంవత్సరాల లోపు ఉండాలి 

జీతం : నెలకు రూ.27,270/-

జూనియర్ ఇంజనీర్ ( మెకానికల్ ) :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ లో 3 సంవత్సరాలు ఉత్తీర్ణతతో పాటు 60% మార్కులను పొంది ఉండాలి 

వయస్సు : 28 సంవత్సరాలు ఉండాలి 

జీతం : నెలకు రూ.27,270/-

అప్లికేషన్ ఫీజు :

  • దరఖాస్తు ఫీజు రూ.1000/- ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూబీడీ,డిపార్ట్మెంటల్ ఉద్యోగులకు ఫీజు లేదు 

ఎంపిక విదానం :

  • ఎంపిక విధానం పోస్టులను బట్టి ఉంటుంది 
  • జనరల్ మేనేజర్ పోస్టులకు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది 
  • మేనేజర్,డిప్యూటీ మేనేజర్,అసిస్టెంట్ మేనేజర్,సీనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ ( CBT ) మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది 
  • గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ పోస్టులకు స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది 
  • జూనియర్ ఇంజినీర్ ( సివిల్ / మెకానికల్ / ఎలక్ట్రికల్ ) పోస్టులకు కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ ( CBT ) ద్వారా ఎంపిక విధానం ఉంటుంది 
  • అప్లికేషన్స్ అధిక సంఖ్యలో వచ్చినట్లైతే ఎంపిక విధానాన్ని మార్చటానికి NBCC తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది 

దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు దరఖాస్తులను ఆన్ లైన్ లో మాత్రమే అప్లై చేయవలెను. ఆఫ్ లైన్ మరియు లెటర్ల ద్వారా పంపిన దరఖాస్తులు స్వీకరించబడవు
  • అభ్యర్థి యాక్టీవ్ గా ఉన్న ఈమెయిల్ ID మరియు మొబైల్ నెంబర్ ను ఇవ్వవలెను
  • అభ్యర్థి అప్లికేషన్ ఫారం నింపేటప్పుడు ఇచ్చే వ్యక్తిగత వివరాలు సరైనవై ఉండాలి లేకపోతే దరఖాస్తు రద్దు అవుతుంది  
  • వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థులు ఒరిజనల్ డాక్యుమెంట్సను చూపించాలి లేని యెడల డిస్ క్వాలిఫై అవుతారు 
  • అభ్యర్థికి అనుభవ సర్టిఫికెట్లు ఉంటే జాయినింగ్ తేదీ మరియు రిసీవింగ్ తేదీ క్లియర్ గా ఉండాలి 
  • అభ్యర్థి ప్రస్తుతం జాబ్ చేస్తూ ఉంటే Employer కి సమాచారం ఇచ్చిన ఆధారాలు లేదా No Objection సర్టిఫికెట్స్ ను ఇవ్వవలెను 

 

ఆన్లైన్ దరఖాస్తు లింక్ 

 

 

 

 

 

 

Leave a Comment