రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కార్యాలయాలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ప్రిలిమినరీ,మెయిన్ పరీక్షలు,బాషా నైపుణ్యం పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది.అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవలెను
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ – 16 – ఫిబ్రవరి – 2026
- దరఖాస్తు ముగింపు తేదీ – 08 – మార్చి – 2026
- ప్రిలిమినరీ పరీక్ష ( తాత్కాలిక తేదీ ) – 11 – ఏప్రిల్ – 2026
- మెయిన్ పరీక్ష ( తాత్కాలిక తేదీ ) – 07 – జూన్ – 2026
పోస్టుల వివరాలు – ఖాళీలు :
- అహ్మదాబాద్ – 20
- బెంగళూరు – 24
- భోపాల్ – 30
- భువనేశ్వర్ – 18
- చండీగఢ్ – 20
- చెన్నై – 53
- గువాహటి – 36
- హైదరాబాద్ – 11
- జైపూర్ – 11
- జమ్మూ – 10
- కాన్పూర్ & లక్నో – 50
- కోల్ కతా – 29
- ముంబాయ్ – 249
- నాగపూర్ – 17
- న్యూఢిల్లీ – 49
- పాట్నా – 17
- తిరువనంతపురం – 06
మొత్తం పోస్టుల సంఖ్య – 650
అర్హతలు :
- ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లో ఉత్తీర్ణతతో పాటు 50% మార్కులతో అర్హతను కలిగి ఉండాలి. ఎస్సీ ,ఎస్టీ ,పిడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పాస్ క్లాస్ సరిపోతుంది
- అభ్యర్థికి కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ లో అవగాహన కలిగి ఉండాలి
- ఎక్స్ -సర్వీస్ మెన్ ,మాజీ సైనికులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి
- లేదా సైన్యంలో మెట్రిక్యూలేషన్ లేదా సస్సమానమైన అర్హతను కలిగి ఉండాలి. డిఫెన్స్ సర్వీస్ లో కనీసం 15 సంవత్సరాలు అనుభవం ఉండాలి ( ఎక్స్ – సర్వీస్ మెన్ డిపెండెంట్స్ కి ఈ నియమం వర్తించదు )
- అభ్యర్థి ఏ Recruiting ఆఫీస్ కి అప్లై చేస్తే ఆ రాష్ట్ర భాషలో రాయడం,చదవడం,మాట్లాడటం,అర్ధం చేసుకోవడం వచ్చి ఉండాలి
నోట్ :
- అభ్యర్థి మార్కుల మెమో లేదా ప్రొవిజనల్ సర్టిఫికెట్లో కనిపించే తేదీని అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తేదీగా తెలియజేస్తారు
- వెబ్సైటులో యూనివర్సిటీ ఫలితాలను తెలియజేసి ఉంటే, వెబ్సైటులో ఆ ఫలితం ప్రకటించిన తేదీని తెలియజేస్తూ యూనివర్సిటీ ఇచ్చిన తేదీని అర్హత సాధించిన తేదీగా లెక్కలోకి తీసుకుంటారు
- అభ్యర్థి అన్ని సెమిస్టర్లు / సంవత్సరాల్లో మొత్తం అన్ని సబ్జెక్టుల్లో సాధించిన మొత్తం మార్కులను అన్ని సబ్జెక్టుల గరిష్ట మార్కులతో భాగించి శాతాన్ని లెక్కిస్తారు
- 49.99% వచ్చిన 50% లెక్కలోకి తీసుకోరు. 50% కన్నా తక్కువగానే భావిస్తారు
- విద్యా అర్హతలో SC/ST/PwBD అభ్యర్థులకు సడలింపులు అనేవి వారి కేటగిరిలో ఖాళీలు ఉన్నప్పుడే వర్తిస్తుంది
జీతం :
- ప్రస్తుతం ప్రారంభ వేతనం రూ.58,514 ( Grass salary – HRA లేకుండా )
- బ్యాంకు ఇచ్చిన వసతి గృహంలో ఉండకపోతే ,ప్రాథమిక జీతం పై 15% అదనంగా HRA ఇవ్వడం జరుగుతుంది
వయస్సు :
- 20 నుండి 28 సంవత్సరాల లోపు ఉండాలి ( 01 – 02 – 2026 నాటికి )
- ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు
- ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది
దరఖాస్తు ఫీజు :
- జనరల్,ఓబీసీ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.450/-
- ఎస్సీ,ఎస్టీ,పిడబ్ల్యూబీడీ,ఎక్స్ – సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.50 ( కేవలం ఇంటిమేషన్ చార్జీలు )
- స్టాఫ్ ( RBI ఉద్యోగులకు ) ఫీజు మినహాయింపు ఉంది
ఎంపిక విధానం :
ఎంపిక ప్రిలిమినరీ ఎక్సమినేషన్,మెయిన్ ఎక్సమినేషన్, బాషా నైపుణ్యం టెస్ట్ ఆధారంగా ఉంటుంది
ప్రిలిమినరీ పరీక్ష :
- ఇంగ్లీష్ లాంగ్వేజ్,న్యూమరికల్ ఎబిలిటీ,రీజనింగ్ ఎబిలిటీ లో ఆబ్జెక్టివ్ ఆధారిత పరీక్ష ఉంటుంది
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30, న్యూమరికల్ ఎబిలిటీ లో 35, రీజనింగ్ ఎబిలిటీ లో 35 ప్రశ్నలు మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి
- ప్రతి పరీక్షకి వేర్వేరు సమయం ఉంటుంది
మెయిన్ పరీక్ష :
- రీజనింగ్,ఇంగ్లీష్ లాంగ్వేజ్,న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలేజ్ పై ఎక్సమినేషన్ ఉంటుంది
- రీజనింగ్ 40,ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40,న్యూమరికల్ ఎబిలిటీ 40,జనరల్ అవేర్నెస్ 40,కంప్యూటర్ నాలెజ్ 40 ప్రశ్నలు మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి
- ప్రతి టెస్ట్ కు వేర్వేరు సమయం ఉంటుంది
బాషా నైపుణ్యం పరీక్ష ( LPT ) :
- బాషా నైపుణ్యం టెస్ట్ కి మెయిన్ ఎక్సమినేషన్ లో తాత్కాలికంగా ఎంపిక ఐన అభ్యర్థులు వెళ్ళవలెను
- సంబంధిత రాష్ట్రం యొక్క అధికారిక భాషలో ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది
- సంబంధిత రాష్ట్ర భాషలో చదవటం,రాయడం,మాట్లాడటం తెలియకపోతే అర్హత రద్దు అవుతుంది
నోట్ :
- అభ్యర్థి ఆబ్జెక్టివ్ పరీక్షలో ప్రతి భాగంలో విడివిడిగా అర్హతను పొందవలసి ఉంటుంది
- అభ్యర్థి మొదట ప్రిలిమినరీ ( Preliminary ) పరీక్షలో అర్హతను పొందిన తరువాత మాత్రమే మెయిన్ పరీక్షకు వెళ్ళగలరు
- Preliminary మరియు మెయిన్ Objective పరీక్షల్లో తప్పు సమాధానానికి నెగిటివ్ మార్క్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్క్ తగ్గిస్తారు
- బ్యాంకు నిర్ణయించిన విధంగా ప్రిలిమినరీ పరీక్ష నుండి ( సుమారు ఖాళీలకు 10 రెట్లు అభ్యర్థులను ) మెయిన్ ఎగ్జామినేషన్ కి ఎంపిక చేస్తారు
- మెయిన్ పరీక్ష నుండి ( సుమారు ఖాళీల సంఖ్యకు 2 రెట్లు అభ్యర్థులను ) తరువాతి దశకు అవరోహణ క్రమంలో షర్ట్ లిస్ట్ చేస్తారు
- Information Handout ఎక్సమినేషన్ కి సంబంధించిన అన్ని వివరాలు తెలియజేయబడతాయి. ఇది ఎక్సమినేషన్ కాల్ లెటర్ తో పాటు బ్యాంకు వెబ్సైటుని డౌన్లోడ్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది
- ఆన్ లైన్ ఎక్సమినేషన్ లో పాస్ ఐన అభ్యర్థుల యొక్క Roll Numbers ను బ్యాంకు వెబ్సైటులో తెలియజేస్తారు
- ఒకటి కంటే ఎక్కువ సెక్షన్ లలో పరీక్ష జరిగినట్లైతే వేరువేరు సెక్షన్స్ లో ఉపయోగించిన ప్రశ్నపత్రాల కష్టంగా ఉండే స్వల్ప తేడాలు ఉంటే వాటిని సరిచేయడానికి సర్దుబాటు ( Normalization ) చేస్తారు
- మెయిన్ పరీక్ష లో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఆ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను LPT కి పిలుస్తారు. బ్యాంకు యొక్క నిర్ణయం ప్రకారం ఎంపిక చేయడం జరుగుతుంది
- ప్రతి అభ్యర్థికి LPT టెస్ట్ పెడుతుంది.ఈ టెస్టులో ఎవ్వరికి మినహాయింపు ఉండదు. ఈ టెస్ట్ బ్యాంకు యొక్క ప్రాంతీయ కార్యాలయాలలో నిర్వహించబడుతుంది.
- ఫైనల్ ఎంపిక ఆన్ లైన్ పరీక్ష లో మెరిట్,LPT టెస్ట్ లో అర్హత,మెడికల్ ఫిట్నెస్,డాక్యుమెంట్స్ వెరిఫికేషన్స్ వంటి అంశాలపై ఉంటుంది. బ్యాంకు తీసుకునే నిర్ణయమే ఆఖరి నిర్ణయం అవుతుంది
- బ్యాంకు నిబంధనల ప్రకారం ఎంపికైన అభ్యర్థి నియామకం అనేది అభ్యర్థి మెడికల్ గా ఫిట్ గా ఉన్నప్పుడే జరుగుతుంది.
పరీక్ష కేంద్రాలు :
- ప్రిలిమినరీ మరియు మెయిన్ ఎగ్జామినేషన్స్ ఆన్ లైన్ ద్వారా దేశంలోని అనేక సెంటర్లలో నిర్వహించబడతాయి
- పరిస్థితులను బట్టి పరీక్ష కేంద్రాలను రద్దు చేయడం లేదా కొత్త కేంద్రాలను ఏర్పాటు చేసే హక్కును బ్యాంక్ కిలిగి ఉంటుంది
- అభ్యర్థి తాను అప్లై చేసిన కార్యాలయానికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ ను సెలెక్ట్ చేసుకోవాలి
- అభ్యర్థి ఎంపిక చేసిన సెంటర్ కాకుండా వేరే సెంటర్ని ఇచ్చే హక్కు బ్యాంకుకు ఉంటుంది
- ప్రిలిమినరీ మరియు మెయిన్ పరీక్ష సెంటర్స్ అభ్యర్థి అప్లై చేసిన రాష్ట్రము/కేంద్రపాలిత ప్రాంతం బయట కూడా కేంద్రాన్ని కేటాయించే హక్కు బ్యాంకు కి ఉంటుంది
- మెయిన్ పరీక్ష ఫలితాలు వెలువడిన తరువాత, ( LPT ) బాషా నైపుణ్యం పరీక్ష కేంద్రాల సమాచారాన్ని అభ్యర్థి అప్లై చేసిన కార్యాలయానికి తెలియజేయబడుతుంది
- మెయిన్ ఎగ్జామినేషన్స్ సెంటర్ల సంఖ్య తక్కువగా ఉంటుంది.
తెలుగు రాష్ట్రాలలో పరీక్ష కేంద్రాలు :
- హైదరాబాద్,విజయవాడ,విశాఖపట్నం,తిరుపతి,కాకినాడ,కర్నూల్,నెల్లూరు,రాజమండ్రి, కరీంనగర్,ఖమ్మం,వరంగల్, విజయనగరం.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్ లైన్ లో మాత్రమే అప్లై చేయవలెను. పోస్ట్ మరియు ఇతర మార్గాల ద్వారా చేసే దరఖాస్తులు స్వీకరించబడవు
- అభ్యర్థి యాక్టివ్ గా ఉన్న ఇమెయిల్ ID మరియు మొబైల్ నెంబర్ ఇవ్వవలెను
- దరఖాస్తును నింపుతున్నపుడు అభ్యర్థులు సరైన సమాచారం తో నింపాలి తప్పుడు సమాచారం ఉన్నయెడల అప్లికేషన్ స్వీకరించబడదు
- అభ్యర్థి ఆన్ లైన్ అప్లికేషన్లో వ్యక్తిగత వివరాలు,ఫోటో,సంతకం,ఎడమచేతి బొటనవ్రేలి ముద్ర,స్కాన్ కాపీ అప్లికేషన్ లో అప్లోడ్ చేయాలి,ఫోటో మరియు సంతకము స్కాన్ సైజు వారిచ్చిన కేబీ ప్రకారం ఉండాలి
- ఆన్లైన్ దరఖాస్తును ఫారంను డిజి లాకర్కు అనుసంధానము చేయబడుతాది
- అభ్యర్థులు తమ పర్సనల్ డేటాను అనగా ఆధార్,ఎడ్యుకేషన్ వివరాలు,చిరునామా వివరాలు డిజిటల్ లాక్కు లింక్ చేయవచ్చును
- అప్లికేషన్ ఫీజు ను ఆన్లైన్ లో మాత్రమే చెల్లించాలి
- ఆన్లైన్ అప్లికేషన్ లో ఉపయోగం లో ఉన్న ఇమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వాలి,ఈ మెయిల్ ఐడిని బ్యాంకు పరీక్ష ఫలితాలు వచ్చేవరకు మెయిల్ ఐడి పని చేయు విధముగా చూసుకోవలెను,బ్యాంకు నుండి ఫలితాలు సమాచారం ఇమెయిల్ కి వస్తాది
- పరీక్ష వివరాలు కాల్ లెటర్ అప్లికేషన్ లో నమోదు చేయబడిన మెయిల్ కి వస్తాయి
- అప్లికేషన్ ఫారంను పూర్తిగా నింపాక మరొక సారి వివరాలను తనిఖీ చేసుకోండి,వివరాలు అన్ని కరెక్టుగా ఉన్న తరువాత మాత్రమే ఫైనల్ సబ్మిట్ చేయండి
- సబ్మిట్ చేయబడిన ఫారంను ప్రింట్ అవుట్ తీసుకోండి