రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ( RRC) వెస్ట్రన్ రైల్వే నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 2025 – 26 సంవత్సరానికి గాను వెస్ట్రన్ పరిధిలోని డివిజన్లు మరియు వర్క్ షాప్ లలో ఖాళీగా ఉన్న 5,349 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అప్రెంటీస్ శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు భవిష్యత్తులో రైల్వే లెవెల్ – 1 ఉద్యోగాలలో 20% ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ – 21- ఫిబ్రవరి – 2026
- దరఖాస్తు ముగుంపు తేదీ – 23 – మార్చి – 2026
పోస్ట్ పేరు మరియు ఖాళీలు :
- అప్రెంటీస్ – 5,349
ట్రేడ్ ల వారీగా ఖాళీలు :
- ఫిట్టర్ – 1614
- ఎలక్ట్రీషియన్ – 1217
- వెల్డర్ – 532
- పీఏఎస్ఏఏ – 280
- ఎలక్ట్రానిక్ మెకానిక్ – 236
- మెకానిక్ ( డీజిల్ ) – 207
- పెయింటర్ – 109
- కార్పెంటర్ – 184
- రిఫ్రెజిరేటర్ ( AC-మెకానిక్ ) – 184
- పైప్ ఫిట్టర్ – 176
- ప్లంబర్ – 136
- వైర్ మ్యాన్ – 126
- డ్రాప్స్ మాన్ ( సివిల్ ) – 87
- టర్నర్ – 75
- స్టెనోగ్రాఫర్ – 40
- మెషినిస్ట్ ( గ్రైండర్ ) – 25
- ఫోర్జర్ మరియు హీట్ ట్రేటర్ – 16
- మెషినిస్ట్ – 14
- మెకానిక్ మోటార్ వెహికల్ – 10
మొత్తం ఖాళీల సంఖ్య – 5,349
అర్హతలు :
ఫిట్టర్ :
- గుర్తింపు పొందిన బోర్డు నుండి 10 వ తరగతిలో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణతను పొంది ఉండాలి
- ఫిట్టర్ ట్రేడ్ లోని అభ్యర్థులకు NCVT కి అనుభంధమైన ITI సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి
వెల్డర్ :
- అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10 వ తరగతిలో 50% మార్కులతో అర్హతను ఉండాలి
- వెల్డర్ ట్రేడ్ లోని NCVT కి సంబంధమైన ITI సర్టిఫికెట్ ఉండాలి
టర్నర్ :
- 10 వ తరగతిలో 50% మార్కులతో గుర్తింపు పొందిన బోర్డు నుండి ఉత్తీర్ణతను పొంది ఉండాలి
- టర్నర్ ట్రేడ్ లోని ITI సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి
- టర్నర్ ట్రేడ్ లోని NCVT అనుబంధమైన ITI సర్టిఫికెట్ ఉండాలి
మెషినిస్ట్ :
- గుర్తింపు పొందిన బోర్డు నుండి 10 వ తరగతిలో ( SSC, మెట్రిక్యూలేషన్ ) లో 50% మార్కులతో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి
- మెషినిస్ట్ ట్రేడ్ లో ITI సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి
- మెషినిస్ట్ ట్రేడ్ లోని NCVT అనుబంధమైన ITI సర్టిఫికెట్ను కలిగి ఉండాలి
కార్పెంటర్ :
- గుర్తింపు పొందిన బోర్డు నుండి 10 వ తరగతిలో ఉత్తీర్ణతతో పాటు 50% మార్కులను కలిగి ఉండాలి
- కార్పెంటర్ ట్రేడ్ లోని ITI సర్టిఫికెట్ తప్పనిసరిగా పొంది ఉండాలి
- కార్పెంటర్ ట్రేడ్ లో NCVT సంబంధమైన ITI సర్టిఫికెట్ను పొంది ఉండాలి
పెయింటర్ :
- 10 వ తరగతిలో గుర్తింపు పొందిన బోర్డు నుండి 50% మార్కులను కలిగి ఉండాలి
- పెయింటర్ జనరల్ ట్రేడ్ లో ITI సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి
- NCVT అనుబంధమైన ITI సంస్థ నుండి ఉండాలి
డీజిల్ మెకానిక్ :
- గుర్తింపు పొందిన బోర్డు నుండి 10 వ తరగతి ఉత్తీర్ణతతో పాటు 50% మార్కులను కలిగి ఉండవలెను
- ITI – డీజిల్ మెకానిక్ ట్రేడ్ పూర్తీ చేసి ఉండాలి
- NCVT అనుబంధమైన ITI సర్టిఫికెట్ను పొంది ఉండాలి
మెకానిక్ ( మోటార్ వెహికల్ ) :
- గుర్తింపు పొందిన బోర్డు నుండి 10 వ తరగతిలో 50% మార్కులతో అర్హతను కలిగి ఉండాలి
- NCVT అనుంబంధమైన ITI గుర్తింపు ఉండాలి
- ITI – మెకానికల్ మోటార్ వెహికల్ ట్రేడ్ లో అర్హతను కలిగి ఉండాలి
ప్రోగ్రామింగ్ & సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ :
- 10 వ తరగతిలో 50% ఉత్తీర్ణతను గుర్తింపు పొందిన బోర్డు నుండి కలిగి ఉండాలి
- ప్రోగ్రామింగ్ మరియు సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ ట్రేడ్ లో ITI సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి
- NCVT కి అనుబంధమైన ITI సర్టిఫికెట్ ను కలిగి ఉండవలెను
ఎలక్ట్రిషియన్ :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 10 వ తరగతిలో 50% ఉత్తీర్ణతను సాధించి ఉండాలి
- ITI – ఎలక్ట్రీషియన్ ట్రేడ్ లో గుర్తింపు కలిగి ఉండాలి
- NCVT కి సంబంధమైన ITI సర్టిఫికెట్ ఉండాలి
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ :
- 10 వ తరగతిలో గుర్తింపు పొందిన బోర్డు నుండి ఉత్తీర్ణతతో పాటు 50% మార్కులను కలిగి ఉండాలి
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ట్రేడ్ లో ITI సర్టిఫికెట్ ను తప్పనిసరిగా పొంది ఉండాలి
- NCVT అనుబంధమైన ITI గుర్తింపు ఉండాలి
వైర్ మెన్ :
- 10 వ తరగతిలో గుర్తింపు పొందిన బోర్డు నుండి 50% మార్కులతో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి
- వైర్ మెన్ మరియు ఎలక్ట్రీషియన్ ట్రేడ్ లో ITI సర్టిఫికెట్ ఉండాలి
- NCVT కి అనుబందమైన ITI గుర్తింపు ఉండాలి
మెకానిక్ రిఫ్రిజిరేటర్ & AC :
- గుర్తింపు పొందిన బోర్డు నుండి 10 తరగతిలో 50% మార్కులతో అర్హతను పొంది ఉండాలి
- మెకానికల్ రిఫ్రిజిరేటర్ మరియు ఎయిర్ కండీషనింగ్ ట్రేడ్ ITI పూర్తీ చేసి ఉండవలెను
- NCVT అనుబంధమైన ITI గుర్తింపు తప్పనిసరిగా ఉండవలెను
పైప్ ఫిట్టర్ :
- గుర్తింపు పొందిన బోర్డు నుండి SSC లో 50% మార్కులతో అర్హతను కలిగి ఉండాలి
- ప్లంబర్ మరియు పైప్ ఫిట్టర్ ట్రేడ్ లో ITI సర్టిఫికెట్టును పొంది ఉండాలి
- NCVT కి అనుబంధమైన ITI సంస్థ గుర్తింపు ఉండాలి
ప్లంబర్ :
- గుర్తింపు పొందిన బోర్డు నుండి SSC లో 50% మార్కులతో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి
- ITI – ప్లంబర్ ట్రేడ్ కంప్లీట్ చేసి ఉండాలి
- NCVT సంబంధమైన ITI గుర్తింపు తప్పనిసరిగా ఉండాలి
డ్రాఫ్ట్స్ మెన్ ( సివిల్ ) :
- 10 వ తరగతిలో గుర్తింపు పొందిన బోర్డు నుండి 50% మార్కులతో ఉత్తీర్ణతను పొంది ఉండాలి
- డ్రాఫ్ట్స్ మెన్ ( సివిల్ ) ట్రేడ్ లో ITI పూర్తీ చేసి ఉండాలి
- NCVT అనుబంధమైన ITI గుర్తింపు ఉండాలి
స్టెనో గ్రాఫర్ ( ఇంగ్లీష్ ) :
- గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2 పరీక్ష విధానంలో 10 వ తరగతి ( మెట్రిక్యూలేషన్ ) లో ఉత్తీర్ణతతో పాటు 50% మార్కులను పొంది ఉండాలి
- ITI లో స్టెనోగ్రాఫర్ ( ఇంగ్లీష్ ) ట్రేడ్ సర్టిఫికెట్ పొంది ఉండాలి
- NCVT గుర్తింపు ఉండాలి
ఫోర్జర్ మరియు హీట్ ట్రేటర్ :
- SSC లో గుర్తింపు పొందిన బోర్డు నుండి 50% మార్కులతో అర్హతను సాధించి ఉండాలి
- ఫోర్జర్ మరియు హీట్ ట్రేటర్ ట్రేడ్ లో ITI కంప్లీట్ చేసి ఉండాలి
- NCVT అనుబంధమైన ITI గుర్తింపు తప్పని సరిగా ఉండాలి
మెషినిస్ట్ ( గ్రైండర్ ) :
- 10 వ తరగతిలో గుర్తింపు పొందిన బోర్డు నుండి 50% ఉత్తీర్ణతను సాధించి ఉండాలి
- టర్నర్ మరియు మెషినిస్ట్ మరియు మెషినిస్ట్ ( గ్రైండర్ ) ట్రేడ్ లో ITI పూర్తిచేసి ఉండాలి
- NCVT కి అనుబంధమైన ITI సర్టిఫికెట్ ఉండాలి
వయస్సు :
- 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల లోపు ఉండాలి ( 23 – మార్చి – 2026 నాటికీ )
- ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది
- ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది
- దివ్యాంగులకు ( PWD ) అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది
అప్లికేషన్ ఫీజు :
- జనరల్,ఓబీసీ అభ్యర్థులకు ఫీజు రూ.100/-
- ఎస్సీ ,ఎస్టీ,పీడబ్ల్యూబీడీ మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు
ఎంపిక విధానం :
- అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్థులను మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు
- అభ్యర్థి 10 వ తరగతిలో మరియు ITI పరీక్ష లో సాధించిన మార్కులను ఈ రెండింటి పర్సెంటేజ్ మార్కుల ద్వారా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు
- అభ్యర్థులలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకే విధమైన మార్కులను పొందినట్లైతే ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థులను తీసుకుంటారు
- బర్త్ డేట్ కూడా ఒకే విధంగా ఉంటే 10 వ తరగతిలో ముందుగా పాస్ ఐన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది
- అభ్యర్థులు తమకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ను ఆన్ లైన్ లో మాత్రమే అప్లోడ్ చేయవలసి ఉంటుంది
- సంబంధిత డివిజన్ మరియు యూనిట్స్ వారు ప్రతి ట్రేడ్ మరియు కెటగిరీ ఆధారంగా మెరిట్ లిస్ట్ ను తయారు చేసి విడుదల చేస్తారు
- ట్రేడ్ లో ఏదైనా డివిజన్ లేదా వర్క్ షాప్ లో ఖాళీల సంఖ్య తగ్గితే అభ్యర్థులను వేరే డివిజన్ లేదా వర్క్ షాప్ లకు మార్చుకునే హక్కును Western Railway కలిగి ఉంటుంది
- అభ్యర్థులు ఫైనల్ సెలక్షన్ కి ఒరిజనల్ డాక్యుమెంట్స్ ను మరియు మెడికల్ ఫిట్నెస్ డాక్యుమెంట్స్ ఇవ్వవలసి ఉంటుంది
దరఖాస్తు విధానం :
- అభ్యర్థి దరఖాస్తును ఆన్ లైన్ లో మాత్రమే అప్లై చేయవలెను
- ఆన్ లైన్ లో అభ్యర్థులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే మెరిట్ లిస్ట్ తయారుచేస్తారు,తప్పుడు సమాచారం లేకుండా చూసుకోవలెను,లేని యెడల దరఖాస్తు రద్దు అవుతుంది
- అభ్యర్థులు వర్కింగ్ లో ఉన్న మొబైల్ నంబర్ మరియు సరైన ఈ-మెయిల్ ID ని ఇవ్వాలి
- రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులు ఆధార్ కార్డు ( 12 అంకెల ) నుంబర్ నమోదు చేయవలెను
- ఆధార్ కార్డు లేకపోతే ( 28 అంకెల ) Enrollment ID నమోదు చేయవలెను
- సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ టైములో ఒరిజనల్ ఆధార్ కార్డు చూపించాలి
- దరఖాస్తు ఫీజును ఆన్ లైన్ లో మాత్రమే చెల్లించాలి. ఆన్ లైన్ అప్లికేషన్ విధానంలో కలిపి ఉన్న పేమెంట్ Gateway ద్వారా మాత్రమే ఫీజును చెల్లించవలెను