సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ (CEL) నుండి నోటిఫికేషన్ వెలువడింది వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 34 పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత మరియు ఆశక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో ధరఖాస్తులను చేసుకోవలెను.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ముగింపు తేదీ : 03 – మార్చి – 2026
అర్హతలు :
రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ క్యాడర్ :
1. డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఎలెక్ట్రికల్ /ఎలక్ట్రానిక్స్) :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి బీఈ /బీటెక్ డిగ్రీ లో ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్స్,ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ లేదా ఇతర ఎలక్ట్రానిక్స్ సంబంధిత విభాగంలో అర్హతను కలిగి ఉండటంతో పాటు కనీసం 55% మార్కులను కలిగి ఉండాలి
- అభ్యర్థి విద్య అర్హతను సాధించిన తరువాత కనీసం 16 సంవత్సరాలు అనుభవం ఉండాలి
- సేఫ్టీ,రైల్వే సిగ్నలింగ్,టెలికాం కు సంబంధించిన ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ డిజైన్ మరియు డెవలప్మెంట్ రంగాలలో పని అనుభవం ఉండాలి
2. డిప్యూటీ జనరల్ మేనేజర్ (మైక్రోవేవ్) :
- అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి బీఈ,బీటెక్ డిగ్రీలో ఎలక్ట్రానిక్స్,ఎలెక్ట్రానిక్స్ మరియు ఎలెక్ట్రినిక్స్ కమ్యూనికేషన్స్,ఎలక్ట్రానిక్స్ టెలీ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణతను పొంది ఉండాలి.కనీసం 55% మార్కులను కలిగి ఉండాలి
- ఎంటెక్ డిగ్రీలో మైక్రోవేవ్ లేదా RF/పిహెచ్.డి లో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 55%మార్కులతో అర్హతను కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది
- అభ్యర్థి విద్యా అర్హతను పొందిన తరవాత కనీసం 16 సంవత్సరాలు ఇండస్ట్రియల్ అనుభవం ఉండాలి.
- డిజైన్ మరియు డెవలప్మెంట్ లో RF,మైక్రోవేవ్ సిస్టమ్,సబ్ సిస్టమ్,కంపోనెంట్స్ రంగాలలో కనీసం 10 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి
3. డిప్యూటీ జనరల్ మేనేజర్/సీనియర్ టెక్నికల్ మేనేజర్ (మెటీరియల్ సైన్స్) :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి బీఈ,బీటెక్ డిగ్రీలో మెటలర్జీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా సిరామిక్ ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణతను పొందటంతో పాటు 55% మార్కులను కలిగి ఉండాలి
- ఎంటెక్ డిగ్రీ లేదా పిహెచ్.డి డిగ్రీ లో అర్హత పొందిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది
- అభ్యర్థి విద్యా అర్హతను సాధించిన తరువాత కనీసం 16 అనుభవం ఉండాలి
- ఇండస్ట్రియల్ లేదా రీసెర్చ్ ప్రయోగాలలో అనుభవం ఉండాలి.కంప్యూటేషనల్ మోడలింగ్ లో అవగాహన పొంది ఉండాలి
4. డిప్యూటీ జనరల్ మేనేజర్ (HR) / సీనియర్ మేనేజర్ (HR) :
- అభ్యర్థి MBA,PGP,PGDM,(ఫుల్ టైమ్ 2 సంవత్సరాలు) ఏదైనా విభాగం లో గ్రాడ్యుయేషన్ లో అర్హతను కలిగి ఉండాలి
- ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి లేబర్ వెల్ఫేర్,పరిశ్రమలు,సోషల్ వర్క్ లో డిగ్రీ,డిప్లొమా లో కనీసం 55% మార్కులను కలిగి ఉండాలి
- LAW డిగ్రీలో అర్హతను కలిగి ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది
5. డిప్యూటీ ఇంజనీర్ (సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్) :
- ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ,బీటెక్ డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా సస్సమానమైన విభాగంలో ఉత్తీర్ణతతో పాటు 55% మార్కులను కలిగి ఉండవలెను
- కనీసం 2 సంవత్సరాలు పోస్టుకు సంబంధించిన విభాగంలో పని అనుభవం ఉండవలెను
- మెషిన్ లెర్నింగ్ టూల్స్ మరియు AI టూల్స్,గ్రాఫిక్ యూజర్ ఇంటర్ ఫేసెస్ డెవలప్మెంట్ లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది
6. డిప్యూటీ ఇంజినీర్ (సేల్స్ మరియు మార్కెటింగ్ ) :
- బీఈ,బీటెక్ డిగ్రీలో ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ మరియు టెలికమ్యూనికేషన్ లో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి అర్హతను పొంది ఉండడంతో పాటు కనీసం 55% మార్కులను కలిగి ఉండవలెను
- కనీసం 2 సంవత్సరాలు సంబంధిత రంగంలో ఉద్యోగ అనుభవం ఉండవలెను
7. డిప్యూటీ ఇంజనీర్ (EMBEDDED సిస్టమ్) :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ,బీటెక్ డిగ్రీలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్,ఎలక్ట్రిక్ మరియు ఎలెక్ట్రినిక్స్,కంప్యూటర్ సైన్స్ లో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి
- కనీసం 55% మార్కులను పొంది ఉండాలి
- అభ్యర్థికి కనీసం 2 సంవత్సరాలు సంబంధిత రంగంలో ఉద్యోగ అనుభవం ఉండాలి
- ఎంబెడెడ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ సర్క్యూట్,PCB డిజైన్ లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది
8. డిప్యూటీ ఇంజనీర్ (ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్) :
- ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ,బీటెక్ డిగ్రీలో ఎలక్ట్రానిక్స్,ఎలెక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీర్ లేదా ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ లో కనీసం 55% మార్కులను పొంది ఉండాలి
- సంబంధిత రంగంలో కనీసం 2 సంవత్సరాలు ఉద్యోగ అనుభవం ఉండాలి
9. డిప్యూటీ ఇంజనీర్ ( మెటీరియల్ సైన్స్) :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ,బీటెక్ డిగ్రీలో మెటలర్జీలేదా మెటీరియల్ సైన్స్ లేదా సిరామిక్ ఇంజనీరింగ్ లో కనీసం 55% మార్కులను పొంది ఉండాలి
- కనీసం 2 సంవత్సరాలు సంబంధిత రంగంలో ఉద్యోగ అనుభవం ఉండాలి
- రీసెర్చ్ లాబొరేటరీస్ లేదా పరిశ్రమలలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది
10. డిప్యూటీ ఇంజనీర్ ( ఎలక్ట్రానిక్స్ ) :
- బీఈ,బీటెక్ లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎలెక్ట్రాన్స్,ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్,ఎలక్ట్రానిక్స్ మరియు టెలీకమ్యూనికేషన్స్ ఏదైనా ఒక విభాగంలో 55% మార్కులను కలిగి ఉండవలెను
- మైక్రోవేవ్,సబ్ -సిస్టమ్ డిజైన్ మరియు డెవలప్మెంట్ లో కనీసం 2 సంవత్సరాలు ఉద్యోగ అనుభవం ఉండాలి
- మైక్రో వేవ్ కంపోనెంట్స్,డివైసెస్ డిజైన్ లో అనుభవం ADS,HFSS,AWR వంటి 2D /3D డిజైన్ టూల్స్ లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది
11. పర్సనల్ ఆఫీసర్ :
- MBA,PGP,PGDM ( పర్సనల్ మేనేజ్మెంట్ / హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ) ఏదైనా ఒక దానిలో (FULL -TIME 2 YEARS) లేదా
- డిగ్రీ,డిప్లొమా లో లేబర్ వెల్ఫేర్,ఇండస్ట్రియల్,సోషల్ వర్క్ లో 2 సంవత్సరాలు గుర్తింపు పొందిన యూనివెరైటీ నుండి 55% మార్కులను పొంది ఉండాలి
- సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాలు పోస్ట్ క్వాలిఫికేషన్లో అనుభవం ఉండాలి
- LAW డిగ్రీలో అర్హత ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు :
1. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ( మెటలర్జీ ) :
- బీఈ,బీటెక్ డిగ్రీలో మెటలర్జీ,మెటీరియల్ సైన్స్,సెరిమిక్ ఇంజినీరింగ్ ఏదైనా ఒక దానిలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 55% మార్కులను కలిగి ఉండాలి
2. గ్రాడ్యుయేట్ ట్రైని ( ఎలక్ట్రానిక్స్ ) :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ,బీటెక్ డిగ్రీలో ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ మరియు టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఇతర ఎలక్ట్రానిక్స్ సంబంధిత విభాగంలో కనీసం 55% ఉత్తీర్ణతను కలిగి ఉండాలి
3. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ( మెకానికల్ ) :
- బీఈ,బీటెక్ డిగ్రీలో మెకానికల్ ఇంజనీరింగ్,ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లేదా ఏదైనా మెకానికల్ సంబంధిత విభాగం నుండి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 55% మార్కులను కలిగి ఉండాలి
4. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ( కంప్యూటర్ సైన్స్ ) :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ,బీటెక్ డిగ్రీలో కంప్యూటర్ సైన్స్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా సంబంధిత కంప్యూటర్ సైన్స్ విభాగంలో కనీసం 55% అర్హతను పొందాలి
5. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ( ఫైనాన్స్ ) :
- అభ్యర్థి కామర్స్ లో గ్రాడ్యుయేట్ పూర్తీ చేసి ఉండాలి
- మరియు CA ( చార్టెడ్ అకౌంట్ ),ICWA ఫైనల్ లేదా MBA ఫైనాన్స్ లో ( FULL TIME TWO YEARS ) లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 55% ఉత్తీర్ణతను పొంది ఉండాలి
6. మేనేజ్మెంట్ ట్రైనీ (హ్యూమన్ రిసోర్స్ ) :
- ఎంబీఏ,PGP,PGDM డిగ్రీ లో పర్సనల్ మేనేజ్మెంట్,హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ లోని 2 సంవత్సరాలు లేదా
- డిగ్రీ,డిప్లొమాలో లేబర్ వెల్ఫేర్,ఇండస్ట్రీస్,సోషల్ వర్క్ లో 2 సంవత్సరాలు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 55% మార్కులతో ఉత్తీర్ణతను పొంది ఉండాలి
నాన్ – ఎగ్జిక్యూటివ్ రెగ్యులర్ పోస్ట్స్:
1.ఆపరేటర్ ‘A’ :
- అభ్యర్థి 10 వ తరగతిలో ( సైన్స్ మరియు మాథ్స్ ) లో అర్హతను కలిగి ఉండాలి
- కనీసం 1 సంవత్సరం సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి
2. క్లర్క్ ‘C’ :
- అభ్యర్థి డిగ్రీలో ఏదైనా విభాగంలో అర్హతను పొంది ఉండాలి
- బేసిక్ కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం
- కనీసం 1 సంవత్సరం సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి
ఎగ్జిక్యూటివ్ కన్సాలిడేటెడ్ కంట్రాక్టు పోస్టులు :
1. డిప్యూటీ ఇంజనీర్ ( కంట్రాక్టు ఆధారంగా ) :
- బీఈ,బీటెక్ డిగ్రీలో మెకానిక్,మెటీరియల్ సైన్స్,సిరామిక్,ఎలక్ట్రానిక్ ఇంగీరింగ్ లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉత్తీర్ణతతో పాటు కనీసం 55% మార్కులను కలిగి ఉండాలి
- అభ్యర్ది అర్హతను సాధించిన తరువాత కనీసం 4 సంవత్సరాలు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి
- అభ్యర్థి పోస్టింగ్ బెంగుళూర్ మరియు హైదరాబాద్ లో ఉంటుంది
2. హిందీ ఆఫీసర్ ( కాంట్రాక్ట్ ) :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి M.A ( హిందీ) లో ఉత్తీర్ణతతో పాటు 55% మార్కులను కలిగి ఉండాలి
- డిగ్రీలో హిందీ మరియు ఇంగ్లీష్ సబ్జక్ట్స్ ఉండాలి
- అభ్యర్థి అర్హతను సాధించిన తరవాత కనీసం 2 సంవత్సరాలు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి
- కంప్యూటర్ అప్లికేషన్ ఫై అవగాహన కలిగి ఉండాలి
వయస్సు :
- డిప్యూటీ జనరల్ మేనేజర్ కి 48 సంవత్సరాలు, సీనియర్ మేనేజర్ /సీనియర్ టెక్నీకల్ మేనేజర్ కి 42 సంవత్సరాలు, డిప్యూటీ ఇంజనీర్ /పర్సనల్ ఆఫీసర్ కి 30 సంవత్సరాలు, క్లర్క్ “సి”కు 30 సంవత్సరాలు,ఆపరేటర్ “ఏ “కి 25 సంవత్సరాలు, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ /మేనేజ్మెంట్ ట్రైనీ కి 27 సంవత్సరాలు,మేనేజ్మెంట్ ట్రైనీ కి 29 సంవత్సరాలు,డిప్యూటీ ఇంజనీర్ 33 సంవత్సరాలు,హిందీ ఆఫీసర్ కి 63 సంవత్సరాలు మించి కూడదు.
వేతనం :
- నెలకు డిప్యూటీ జనరల్ మేనేజర్ కి రూ.80,000 – రూ.2,20,000/- సీనియర్ మేనేజర్ /సీనియర్ టెక్నీకల్ మేనేజర్ కి రూ.70,000 – రూ 2,00,000/- డిప్యూటీ ఇంజనీర్ /పర్సనల్ ఆఫీసర్ రూ.40,000 – 1,40,000/– క్లర్క్ సి కి రూ.20,000 – రూ.60,000/- క్లర్క్ ఏ కి రూ.17,500 – రూ.50,000/- గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ,మేనేజ్మెంట్ ట్రైనీ రూ.40,000/- డిప్యూటీ ఇంజనీర్ కి రూ.75,000/- హిందీ ఆఫీసర్ కి రూ.60,000/-
అప్లికేషన్ ఫీజు :
- జనరల్,ఓబీసీ అభ్యర్థులకు రూ.1000/-
- ఎస్సి,ఎస్టీ,పిడబ్ల్యూబీడీ,ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు
ఎంపిక విధానం :
- గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ,మేనేజ్మెంట్ ట్రైనీ,డిప్యూటీ ఇంజనీర్,పర్సనల్ ఆఫీసర్ పోస్టులకు రాత పరీక్ష,సర్టిఫికెట్స్ వెరిఫికేషన్,ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది
- డిప్యూటీ జనరల్ మేనేజర్,సీనియర్ టెక్నీకల్ మేనేజర్,సీనియర్ మేనేజర్ మరియు కంట్రాక్టు పోస్టులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ,పర్సనల్ ఇంటర్వ్యూ ,అర్హతల ప్రకారం అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్ ఆధారంగా ఉంటుంది
- నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రాత పరీక్ష,డాక్యుమెంట్స్ వెరిఫికేషన్,ట్రేడ్ టెస్ట్ లేదా ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది
- తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థులు Pre – Employment Medical Examination టెస్ట్ చేయించుకోవాలి
- పరీక్ష కు ఎంపిక ఐన అభ్యర్థులకు అడ్మిట్ కార్డులను ఇస్తారు.
- అభ్యర్థులు రాత పరీక్షకు వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఒరిజనల్ ఫోటో ఐడి ప్రూఫ్ ను తప్పకుండా చూపించాలి
- రాత పరీక్ష,ఇంటర్వ్యూ,ట్రేడ్ టెస్ట్ ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు సమానమైన మార్కులు వచ్చినట్లైతే వయస్సు ఎక్కువ ఉన్న అభ్యర్థులకు అవకాశం ఉంటుంది
దరఖాస్తు విధానము (Apply Process ) :
- అభ్యర్థులు దరఖాస్తును ఆన్ లైన్ లో మాత్రమే అప్లై చేయాలి,సీఈఎల్ మెయిన్ వెబ్ సైట్ కెరీర్ పోర్టల్ కి వెళ్లి అప్లై చేయాలి
- వెబ్ సైట్ లింక్ కింద ఇవ్వబడినది
- ఆన్లైన్ దరఖాస్తును పూర్తి డీటెయిల్స్ తో నింపాలి,సీ ఈ ఎల్ వెబ్ సైట్ నుండి కాకుండా మరిఏ ఇతర విధానంగా దరఖాస్తును ఆంగీకరించరు
- దరఖాస్తు చేయడానికి వర్కింగ్ మెయిల్ మరియు ఫోన్ నెంబర్ కావాలి ఫ్యూచర్ లో సమాచారము కొరకు
- దరఖాస్తును చివరి తేదీ ముందుగా అప్లై చేచుకోవాలి