ఇండియా పోస్టల్ శాఖ నోటిఫికేషన్ 2026 : గ్రామీణ డాక్ సేవక్ (GDS ) నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 28,740 పోస్టులను భర్తీ చేయనుంది.కేవలం పదవ తరగతిలో పొందిన మర్క్స్ ఆధారంగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM),అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM),డాక్ సేవక్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.అర్హత గల మరియు ఆశక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులను చేసుకోవలెను.
ముఖ్యమైన తేదీలు :
- ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తేదీ – 31 – జనవరి – 2026 నుండి 14 – ఫిబ్రవరి – 2026 (సాయంత్రము 6:00 వరకు)
- ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ – 02 – ఫిబ్రవరి – 2026 నుండి 16 -ఫిబ్రవరి – 2026
- దరఖాస్తు సవరణ తేదీ – 18 – ఫిబ్రవరి – 2026 నుండి 19 – ఫిబ్రవరి – 2026
పోస్టుల పేర్లు :
- బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
- అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
- డాక్ సేవక్
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ యొక్క భాద్యతలు :
- రోజువారి పోస్టల్ కార్యకలాపాలను బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ (B.O.)మరియు ఇండియా పోస్ట్ ప్రెమెంట్స్ బ్యాంక్ (IPPB) సంబంధించిన సేవలను,శాఖ కాలానుగుణంగా జారీచేసే నియమావళి ప్రకారం నిర్వహించవలసి ఉంటుంది
- పోస్ట్ శాఖ అందించేటటువంటి ఉత్పత్తులు మరియు సేవలపై మార్కెటింగ్,ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం మరియు శాఖకు సంభందించిన కస్టమర్ సర్వీస్ సెంటర్ల లోని వివిధ సేవలను నిర్వహించడం
- ఒకే వ్యక్తి పనిచేసే బ్రాంచ్ ఆఫీసుల్లో (Single Handed BOs ) ఆఫీస్ సక్రమంగా,సమయానికి పనిచేయటానికి సంబంధించిన మొత్తం బాధ్యత బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కి ఉంటుంది
- బ్రాంచ్ ఆఫీసులలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కు (BPM) అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ (ABPM ) సహాయం చేస్తారు
- ఆదేశించినప్పుడు లేదా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అందుబాటులో లేనప్పుడు బ్రాంచ్ పోస్టుమాస్టర్ తన విధులతో పాటు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ యొక్క విధులను కూడా నిర్వహించవలసి ఉంటుంది
- మెయిల్ ఓవర్సీర్ (MO) ఇన్స్పెక్టర్ పోస్ట్ (IPO) అసిస్టెంట్ సూపరిండెంటెంట్ ఆఫ్ పోస్ట్స్ (ASPO) సూపరిండెంటెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ (SPO) సీనియర్ సూపరిండెంటెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ (SSPO) వంటి అధికారులు అప్పగించే ఇతర విధులను కూడా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ నిర్వహించవలసి ఉంటుంది
- పోస్ట్ ఆఫీస్ ఉన్న అదే గ్రామంలో నివాసం ఉండాలి
అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ యొక్క బాధ్యతలు :
- స్టాంపులను మరియు స్టేషనరీలను అమ్మడం వంటివి చేయడం. ఇంటి వద్దకు వెళ్లి ఉత్తరాలను తీసుకుని తీసుకుని వెళ్లి వాటిని పంపిణి చేయడం, అకౌంట్ ఆఫీసుతో ఉత్తరాలను మార్పిడి చేయడం,ఇండియా పోస్ట్ ప్రెమెంట్స్ బ్యాంకు చెందిన డిపాజిట్లు,చెల్లింపులు,ఇతర లావాదేవీలను నిర్వహించడం
- డిపార్ట్మెంట్ కాలానుగుణంగా జారీచేసే ఆదేశాలను అనుసరించి పోస్టల్ కార్యకలాపాలలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కు సహాయం చేయడం
- పోస్ట్ డిపార్ట్మెంట్ అందించేటటువంటి ఉత్పత్తులు మరియు సేవలపై మార్కెటింగ్,ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం మరియు డిపార్ట్మెంట్ కి సంబంధించిన కస్టమర్ సర్వీసెస్ వివిధ రకాల సేవలను అందించడం
- బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అందుబాటులో లేని సమయంలో అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ తన విధులతో పాటుగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ యొక్క విధులను కూడా నిర్వహించ వలసి ఉంటుంది
- అధికారులు అప్పగించే మెయిల్ ఓవర్సీర్ (M.O) ఇన్స్పెక్టర్ పోస్ట్ (IPO) అసిస్టెంట్ సూపిరిండెంటెంట్ ఆఫ్ పోస్ట్స్ (ASPOs) సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ (SPOs) సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ (SSPOs) వంటి ఇతర పనులను కూడా చేయవలసి ఉంటుంది
- అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ తప్పనిసరిగా సంబంధిత బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలోనే నివసించవలసి ఉంటుంది.
డాక్ సేవక్ (DAK SEVAK) :
- డాక్ సేవక్ లను డిపార్ట్మెంట్ కార్యాలయాలలోను,ఉప పోస్ట్ ఆఫీస్లు,ప్రధాన పోస్ట్ ఆఫీసులు,రైల్వే మెయిల్ సర్వీసుల కార్యాలయాలలో నియమిస్తారు
- స్టాంపులు,స్టేషనరీ అమ్మడం, ఇంటి వద్దకు మెయిల్ ని పంపిణి చేయడం,IPPB డిపాజిట్లు,చెల్లింపులు,లావాదేవీలు మరియు పోస్ట్ మాస్టర్ మరియు సబ్ పోస్ట్ మాస్టర్ చెప్పే ఇతర పనులను చేయవలసి ఉంటుంది
- (RMS) రైల్వే మెయిల్ సర్వీస్ సార్టింగ్ ఆఫీసుల్లో పని చేయవలసి ఉంటుంది
- డాక్ సేవక్ లు మెయిల్ ఆఫీసులలో మెయిల్ బ్యాగుల తీసుకోవడం,సప్లై చేయడం,బదిలీ వంటి పనులను చేయవలసి ఉంటుంది
- పోస్ట్ ఆఫీస్ సక్రమంగా కొనసాగటానికి పోస్ట్ మాస్టర్ లేదా సబ్ పోస్ట్ మాస్టర్ కి సహాయం చేయడం మార్కెటింగ్ మరియు వ్యాపార అభివృద్ధి మరియు IPO,ASPO,SPOS,SSPOS,SRM,SSRM వంటి అధికారులు చెప్పే ఇతర పనులను చేయడం
- డాక్ సేవక్ లు సంబంధిత పోస్ట్ ఆఫీస్ పరిధిలో నివసించ వలసి ఉంటుంది.
అర్హతలు :
- ఈ పోస్టులకు అప్లై చేయటానికి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 10 వ తరగతి (SSC) లో ఉత్తీర్ణతను కలిగి ఉండవలెను
- అభ్యర్థి 10వ తరగతి వరకు స్థానిక భాష చదివి ఉండాలి
- ఇంగ్లీష్ సబ్జెక్టు మరియు మాథ్స్ సబ్జెక్టులో తప్పనిసరిగా పాస్ కావాలి
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి
వేతనం (SALARY):
- బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM) కు నెలకు రూ. 12,000 నుండి రూ. 29,380 వరకు ఉంటుంది
- అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) మరియు డాక్ సేవక్ లకు నెలకు రూ. 10,000 నుండి రూ. 24,470 వరకు ఉంటుంది
- గ్రామీణ డాక్ సేవాక్ (GDS) ఉద్యోగులకు TRCA ప్రకారం రెగ్యులర్గ టైమ్ కి జీతము చిల్లీస్తారు
- ప్రభుత్వ నిబంధన ప్రకారం DA (డైరెక్ట్ అలవెన్సు )కూడా ఇస్తారు మరియు భద్రత ప్రయోజనాలు కూడా ఇస్తారు
- ప్రతి సంవత్సరం 3% జీతము పెరుగుల ఉంటుంది (ప్రభుత్వ నిబంధన ప్రకారం )
- సర్వీస్ డిశ్చార్జ్ బెనిఫిట్ స్కీమ్
- నేషనల్ ఫెన్షన్ సిస్టమ్ (NPS) ప్రయోజనాలు ఉంటాయి
- రెగ్యులర్ ఆదాయము ఉంటుంది
వయస్సు ( AGE ) :
- కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి
- గరిష్టంగా 40 సంవత్సరాలు వయస్సు ఉండాలి
- SC,ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది
- OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది
- PWBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది
- EWS అభ్యర్థులకు వయస్సు సడలింపు లేదు.
- PWD/SC/ST అభ్యర్థులకు 15 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటాది
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు రూ –100/-
- ఎస్సి,ఎస్టీ,దివ్యాంగులు,మహిళలకు ఫీజు మినహాయింపు ఉంది
- దరఖాస్తు ఫీజును నెట్ బ్యాంకింగ్ మరియు డెబిట్ కార్డు,క్రెడిట్ కార్డు,UPI ద్వారా చెల్లించవచ్చు
దరఖాస్తు విధానము (APPLICATION PROCESS ) :
- దరఖాస్తును ఆన్ లైన్ లో మాత్రమే అప్లై చేయాలి
- అభ్యర్థులు అప్లై చేయడానికి తపాలా మెయిన్ వెబ్సైటు నుండి మాత్రమే చేయాలి
- వెబ్సైటు మెయిన్ లింక్ కింద ఇవ్వబడినది చూడగలరు
- తపాలా వెబ్సైటు నుండి కాకుండా ఇతర మార్గాల ద్వారా అప్లై చేయబడిన దరఖాస్తును ఆగీకరించారు
- దరఖాస్తు రిజిస్ట్రేషన్,ఫీజు,డాక్యూమెంట్స్,పాస్ పోర్ట్ సైజు ఫోటో,సంతకము మొదలైనవి ఆన్లైన్ ఫారంలో నింపాలి
- ఫైనల్ సబ్మిట్ చేయబడిన అప్లికేషన్ ఫారంను ప్రింట్ అవుట్ కాపీ తీసుకోవాలి,ఇందులో రిజిస్ట్రేషన్ ఐడి మరియు డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఫైనల్ సెలక్షన్ లో ఉపయోగపడుతాది
- అభ్యర్థులు దరఖాస్తును తప్పుడు సమాచారం ఇచ్చిన లేదా తప్పుడు సర్టిఫికేషన్ అప్లోడ్ చేయబడిన వారి అప్లికేషన్ రద్దు చేయబడతాది
- https://indiapost.gov.in/gdsonlineengagement
ఎంపిక విధానము (SELECTION PROCESS ) :
- ఎంపిక విధానము పూర్తిగా మెరిట్నుబట్టి ఉంటాది
- అభ్యర్థులు అప్లికేషన్లో మీకు ఎడ్యుకేషన్ లో ఉన్న మర్క్స్ మరియు పర్సంటేజ్ కరెక్ట్ గా ఎంటర్ చేయాలి
- ఎడ్యుకేషన్లో వచ్చిన మర్క్స్ ను బట్టి మెరిట్ లిస్ట్ తయారు చేయబడుతది
- అన్ని సబ్జెక్ట్స్ లో వచ్చిన మర్క్స్ ను మాత్రమే పరిగణించబడతాది
- మర్క్స్ కాకుండా గ్రేడ్ ఉన్న వారికీ గ్రేడ్ ప్రకారం మెరిట్ లిస్ట్ తయారు చేయబడతాది
- అల్ సబ్జెక్టులలో గ్రేడ్ మరియు CGPA రెండు ఉన్న వారికీ వాటిలో ఎక్కువ మర్క్స్ ఉన్న వాటిని తీసుకొంటారు
- కొందరకు గ్రేడ్ మరియు పర్సంటేజ్ రెండు ఉన్న పెర్సంటేజ్ ఆధారముగా మాత్రమే మెరిట్ లిస్ట్ తయారు చేయబడతాది
- అప్లికేషన్ లో గ్రేడ్ ఇచ్చిన కూడా సిస్టమ్ మర్క్స్ విధానములో కాన్వెర్ట్ చేసుకుంటుంది
- అభ్యర్థులకు సమానమైన మర్క్స్ మరియు పర్సంటేజ్ వచ్చినప్పుడు వయస్సును బట్టి మెరిట్ సెలక్షన్ జరుగుతాది