NIRDPR NOTIFICATION 2026: హైదరాబాద్ రాజేంద్రనగర్ లో రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థ మరియు రాష్ట్ర పంచాయతీ రాజ్ నుండి కాంట్రాక్టు ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదల అయ్యింది.వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న సీనియర్ కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్ మరియు కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులను చేసుకోవలెను.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ముగింపు తేదీ – 29 – జనవరి – 2026.
పోస్టులు పేర్లు మరియు ఖాళీలు :
- సీనియర్ కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్ – 10
- కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్ – 88
- మొత్తం ఖాళీలు – 98
సీనియర్ కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టింగ్ లో వర్గాల వారీగా ఖాళీలు
| క్రమ.సంఖ్య | వివరాలు | జనరల్ | ఓబీసీ | ఈడబ్ల్యూఎస్ | ఎస్సీ | ఎస్టీ | మొత్తం | పీడబ్ల్యూడీ |
| 1 | బ్యాక్ లాగ్ ఖాళీలు | – | 02 | – | – | 02 | 04 | – |
| 2 | ప్రస్తుత ఖాళీలు | 05 | – | 0 | 01 | 0 | 06 | – |
| మొత్తం | 05 | 02 | 0 | 01 | 02 | 10 |
కెపిసిటీ బిల్డింగ్ కన్సల్టింగ్ లో వర్గాల వారీగా ఖాళీలు
| క్రమ.సంఖ్య | వివరాలు | జనరల్ | ఓబీసీ | ఈడబ్ల్యూఎస్ | ఎస్సీ | ఎస్టీ | మొత్తం | పీడబ్ల్యూడీ |
| 1 | బ్యాక్ లాగ్ ఖాళీలు | – | 28 | – | 19 | 08 | 55 | 06 |
| 2 | ప్రస్తుత ఖాళీలు | 26 | 04 | 03 | 0 | 0 | 33 | – |
| మొత్తం | 26 | 32 | 03 | 19 | 08 | 88 | 06 |
రాష్ట్ర యూనిట్లలో పనిచేయుటకు సీనియర్ బిల్డింగ్ కన్సల్టెంట్ కు ఉండవలసినవి అర్హతలు :
- ఉద్యోగము – సీనియర్ బిల్డింగ్ కన్సల్టెంట్
- నియామకం – కాంట్రాక్టు ప్రాతిపదిక
- పోస్టుల సంఖ్య – 10
- విద్యా అర్హత – ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏ విభాగంలో అయిన మాస్టర్ డిగ్రీ లో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి
పని అనుభవం :
- కనీసం 9 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి
- పంచాయతీ రాజ్ పాలన,గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు,పంచాయతీలకు కెపాసిటీ బిల్డింగ్ మరియు శిక్షణ,గ్రామీణ ప్రాంతాలలో వెనుకబడిన వర్గాల మరియు ప్రాంతాల అభివృద్ధి వంటి అంశాలపై జిల్లా /రాష్ట్ర /జాతీయ స్థాయిలో పని చేసిన అనుభవం ఉండాలి
- కెపాసిటీ బిల్డింగ్ మరియు ట్రైనింగ్ కార్యక్రమాల లో ఫీల్డ్ అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది
- BPDP మరియు DPDP తయారీలో అనుభవం ఉన్న వారికి ప్రాధానత్య ఇవ్వడం జరుగుతుంది
- శిక్షణ నిర్వహణలో ట్రైనర్ల శిక్షణలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
పరిజ్ఞానం మరియు నైపుణ్యాలు :
- పంచాయతీ రాజ్ యొక్క నిర్మాణం,విధులు,భాద్యతలు వంటి వాటిపై అవగాహన కలిగి ఉండాలి
- పంచాయతీలను అభివృద్ధి చేయటానికి సంబంధించిన సమస్యలు మరియు పరిష్కార మార్గాలపై అవగాహన కలిగి ఉండాలి
- పంచాయతీ మరియు గ్రామీణ అభివృద్ధికి సంబంధించి కెపాసిటీ బిల్డింగ్ మరియు ట్రైనింగ్ కార్యక్రమాలను నిర్వహించ గల సామర్థ్యం కలిగి ఉండాలి
- మహిళలు,పిల్లలు,వెనుకబడిన వర్గాల అభివృద్ధి ఫై అవగాహన కలిగి ఉండాలి
- MS -OFFICE మరియు ఆన్ లైన్ అప్లికేషన్లపై అవగాహన కలిగి ఉండాలి
- తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో పని చేయగల నైపుణ్యం ఉండాలి.
వయస్సు :
- 50 సంవత్సరాలు లోపు ఉండాలి.
- కట్ ఆఫ్ డేట్ 31– డిసెంబర్ – 2025 నాటికి
వేతనం :
- సీనియర్ కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్ కు నెలకు రూ. 75,000/-
రాష్ట్ర యూనిట్లలో పనిచేయటానికి కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్ కి ఉండవలసిన అర్హతలు :
- ఉద్యోగం – కెపేసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్
- నియామకం – కాంట్రాక్ట్ ప్రాతిపదికన
- పోస్టుల సంఖ్య – 88
- విద్యా అర్హత – ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏ విభాగంలో అయిన మాస్టర్ డిగ్రీ లో వృత్తీర్ణతను కలిగి ఉండాలి.
పని అనుభవం :
- కనీసం 7 సంవత్సరాలు పని అనుభవం కలిగి ఉండాలి
- పంచాయతీరాజ్ పాలన,గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల అమలు,వంటి అంశాలపై జిల్లా,రాష్ట్ర,జాతీయ స్థాయిలో పని చేసిన అనుభవం కలిగి ఉండాలి
- మహిళలు,పిల్లలు,వెనుకబడిన వర్గాలపై అవగాహన కలిగి ఉండాలి
- కెపాసిటీ బిల్డింగ్ మరియు ట్రైనింగ్ కార్యక్రమాలలో ఫీల్డ్ అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది
- శిక్షణ నిర్వహణ మరియు ట్రైనర్లకు శిక్షణలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
పరిజ్ఞానం మరియు నైపుణ్యాలు :
- పంచాయతీ రాజ్ వ్యవస్థ యొక్క నిర్మాణం,విధులు,బాధ్యతలు, మరియు స్వయం పాలనా సంస్థలుగా పంచాయతీలను అభివృద్ధి చేయడం
- మహిళలు,పిల్లలు,వెనుకబడిన వర్గాల అభివృద్ధి మరియు గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన క్రయక్రమాలు,పథకాలపై అవగాహన ఉండాలి
- పంచాయతీ మరియు గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన ముఖ్య విషయాలపై అవగాహన కలిగి ఉండాలి
- న్యాయకత్వ లక్షణాలను కలిగి ఉండాలి
- సాఫ్ట్ స్కిల్స్,MS – OFFICE అవగాహన,ప్రజంటేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి
- ఇంగ్లీష్ లో రాయడం,మాట్లాడటం తో పాటు హిందీ లో మాట్లాడగల సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి.
వయస్సు :
- 50 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి
- కట్ ఆఫ్ డేట్ – 31– డిసెంబర్ – 2025.
వేతనం :
- కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్ కు నెలకు రూ.60,000/-
అప్లికేషన్ ఫీజు :
- జనరల్,ఓబీసీ ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300/-
- ఎస్సీ,ఎస్టీ ,పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
స్టేట్ ల వారీగా సీనియర్ కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్ మరియు కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్ ఖాళీలు :
| క్రమ.సంఖ్య | రాష్ట్రము పేర్లు | జిల్లాల | సీనియర్ కెపాసిటియు బిల్డింగ్ కన్సల్టెంట్ | కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్ |
| 1 | ఆంధ్రప్రదేశ్ | 26 | 0 | 01 |
| 2 | అరుణాచల్ ప్రదేశ్ | 25 | 1 | 3 |
| 3 | అస్సాం | 35 | 1 | 6 |
| 4 | బీహార్ | 38 | 0 | 4 |
| 5 | చ్చత్తీష్ గడ్ | 33 | 0 | 5 |
| 6 | గోవా | 2 | 0 | 1 |
| 7 | గుజరాత్ | 33 | 0 | 5 |
| 8 | హర్యానా | 22 | 0 | 3 |
| 9 | హిమాచల్ ప్రదేశ్ | 12 | 0 | 2 |
| 10 | జార్ఖండ్ | 24 | 0 | 1 |
| 11 | కర్ణాటక | 31 | 1 | 4 |
| 12 | కేరళ | 14 | 1 | 1 |
| 13 | మధ్యప్రదేశ్ | 55 | 1 | 3 |
| 14 | మహారాష్ట్ర | 36 | 1 | 2 |
| 15 | మణిపూర్ | 16 | 0 | 3 |
| 16 | మేఘాలయ | 12 | 1 | 2 |
| 17 | మిజోరాం | 11 | 0 | 3 |
| 18 | నాగాలాండ్ | 16 | 1 | 1 |
| 19 | ఒడిశా | 30 | 0 | 1 |
| 20 | పంజాబ్ | 23 | 0 | 1 |
| 21 | రాజస్థాన్ | 33 | 1 | 5 |
| 22 | సిక్కిమ్ | 6 | 0 | 1 |
| 23 | తమిళనాడు | 38 | 0 | 6 |
| 24 | తెలంగాణ | 33 | 0 | 2 |
| 25 | త్రిపుర | 8 | 0 | 1 |
| 26 | ఉత్తర ప్రదేశ్ | 75 | 1 | 10 |
| 27 | ఉత్తరాఖండ్ | 13 | 0 | 2 |
| 28 | వెస్ట్ బెంగాల్ | 23 | 0 | 0 |
| 29 | అండమాన్ &నికోబార్ | 3 | 0 | 1 |
| 30 | దాద్రానగర్ హవేలీ & డామన్ & డయు | 3 | 0 | 0 |
| 31 | జమ్మూ & కాశ్మీర్ | 20 | 0 | 1 |
| 32 | లడఖ్ | 2 | 0 | 1 |
| 33 | పుదుచెర్రీ | 4 | 0 | 1 |
| మొత్తం | 755 | 10 | 83 | |
| NIRDPR డిపార్ట్మెంట్ రిజర్వ్ | 05 | |||
| మొత్తం | 98 |
దరఖాస్తు విధానము మరియు సూచనలు :
- దరఖాస్తును ఆన్ లైన్ లో మాత్రమే అప్లై చేయవలెను.
- ఆన్ లైన్ దరఖాస్తు లింక్ కింది ఇవ్వబడినది.
- https://career.nirdpr.in/ ఓపెన్ చేసాక ఇందులో మనము అప్లై చేయవలసిన బిల్డింగ్ కన్సల్టింగ్ అప్లై పైన క్లిక్ చెయ్యండి.
- మెయిన్ అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతాది,ఇందులో కంప్లీట్ డీటెయిల్స్ తో అప్లికేషన్ ఫిల్ చేయండి.
- ఆన్లైన్ అప్లికేషన్లో తప్పుడు సమాసారం ఇవ్వకండి అప్లికేషన్ రిజెక్టు కావచ్చును.
- ఈ పోస్టులు పూర్తిగా కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నారు కాబట్టి ఫ్యూచర్ లో పెర్మనెంట్ కావు.
- ఈ ఖాళీలు అల్ ఓవర్ ఇండియా లో ఖాళీలు ఇందులో ఎక్కవగా బదిలీలు కూడా ఉంటాయి.
- ఇందులో వర్క్ చేతున్న వారు తరసుగా ఆఫీస్ పని మీద ఇతర ప్రాతాలకు వెళ్ళవలచి వస్తాది.
- 31-12-2025 నాటికీ లెక్కిస్తారు కాండిడేట్ వయస్సు,హర్హత,సర్టిఫికేషన్,పని అనుభవము అన్ని అప్లికేషన్ లో చూపాలి.
- ఒరిజినల్ ప్రకటనలో అడిగిన అర్హతలు ఉన్నాయా లేదా అని అప్లై చేయక ముందు చెక్ చేసుకోవాలి.
- దరఖాస్తులు ఎక్కువగా వచ్చి నప్పుడు దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేయవచ్చును.
- కొన్ని సందర్భాలలో అప్లికేషన్లను వయస్సు,పని అనుభవము లో సడలింపు ఇవ్వటానికి సంస్థ కు అధికారం ఉంది.
- అర్హత కలిగిన వారి ఎంపిక న్యాయబద్దంగా జరుగుతుంది.ఇందులో ఎటువంటి అవకతవకలు జరిగితే అనర్హతకు గురి అవుతారు.
- ఈ సెలక్షన్ ప్రాసెస్ కు సంబంధించిన విషయాలు అంటే పరీక్ష,ఇంటర్వ్యూ,ఎంపిక,నియామకంతదితర వాటిపై ఫోన్లు లేదా లేఖలు ద్వారా సమాచారం స్వీకరించబడవు
- షార్ట్ లిస్ట్ ఐన అభ్యర్థులకు మాత్రమే రాత పరీక్ష,ఇంటర్వ్యూ తేదీ,స్థల వివరాలు,సమయం వివరాలు తెలియచేయబడతాయి
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ మరియు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కి పిలువవచ్చును కానీ వారికీ రావటానికి,వెళ్ళటానికి ప్రయాణ ఖర్చులు ఇవ్వబడవు
- అర్హత మరియు అనుభవం ఉన్నాయని ఇంటర్వ్యూ కి పిలుస్తారు అనే హామీ ఉండదు అవి కనీస ప్రమాణాలు మాత్రమే
- నియామక పత్రం జారీచేసిన తరువాత కూడా ఏదైనా పొరపాటు కనబడితే అభ్యర్థులు పంపిన సమాచారాన్ని రద్దు చేయటానికి,సవరించడానికి,ఉపసంహరించటానికి సంస్థకు అధికారం ఉంటుంది
- ఎంపిక ప్రక్రియలో ఏమైనా వివాదాలు మరియు సందేహాలు వచ్చినప్పుడు,సంస్థ తీసుకునే నిర్ణయమే ఆఖరి నిర్ణయం అవుతుంది
- ఈ సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవటానికి అభ్యర్థులు సంస్థ యొక్క వెబ్ సైట్ ను తరుచుగా చూడవలెను
- ఏమైనా కారణాల వల్ల నియామక ప్రక్రియను రద్దు చేసే హక్కు సంస్థకు ఉంటుంది.
- ఇవ్వబడిన ఖాళీలు సంస్థ సూచనా మాత్రమే. ఈ సంస్థ యొక్క ఖాళీలు భవిషత్తులో పెరగ వచ్చును లేదా తగ్గ వచ్చును.ఇది కేవలం సంస్థ అవసరాల మీద ఆధారపడి ఉంటుంది
- సంస్థ కేటాయించిన టైం కి లోబడి వచ్చిన అప్లికేషన్లు మాత్రమే లెక్కలోకి తీసుకొనబడతాయి.మరియు సంస్థ ఇచ్చిన నిర్ణిత గడువు తరువాత వచ్చిన అప్లికేషన్లు పరిగణలోనికి తీసుకొనబడవు
- ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే ఆఖరి ఫలితాల వివరాలు తెలియజేస్తారు
- ఈ పోస్టులకు ఎంపికైనా అభ్యర్థి కాంట్రాక్ట్ ప్రాతిపదికన తీసుకుంటారు కాబట్టి వారు ఏకారణం చేతనైన రాజీనామ చేయదలచినప్పుడు 3 నెలలు నోటీస్ పీరియడ్ లో పనిచేయవలెను.