SAI NOTIFICATION 2026 : అసిస్టెంట్ కోచ్ ఉద్యోగాలు భర్తీ కోసం స్పోర్ట్స్ అధారిటి ఆఫ్ ఇండియా (SAI) నుండి రెగ్యులర్ పోస్టులు కోసం అసిస్టెంట్ కోచ్ ల ఖాళీలు నింపడం కోసం ఆన్ లైన్ దరఖాస్తులు కోరుతున్నది. సాయ్ అనేది స్వయం ప్రతిపత్తి సంస్థ,సాయ్ ముఖ్య ఉదేశ్యం దేశంలో క్రీడలను అభివృద్ది చేయడం,క్రీడలలో నైపుణ్యం సాధించడం,అంతర్జాతీయ పోటీలలో పాల్గొను క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడం సాయ్ ముఖ్య ఉదేశ్యం.ఇందులో మొత్తం 323 అసిస్టెంట్ కోచ్ ఖాళీలు ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ – 01 -ఫిబ్రవరి – 2026
- దరఖాస్తు చివరి తేదీ – 15 -ఫిబ్రవరి – 2026
పోస్టులు పేర్లు & ఖాళీలు :
- అసిస్టెంట్ కోచ్ – 323
క్రీడా విభాగాలు :
| క్ర.స | పోస్ట్ పేరు | జనరల్ | ఓబీసీ | ఎస్సీ | ఎస్టీ | ఈడబ్ల్యూఎస్ | మొత్తం |
| 01 | స్విమ్మింగ్ | 13 | 07 | 03 | 01 | 02 | 26 |
| 02 | అథ్లెటిక్స్ | 13 | 7 | 4 | 02 | 02 | 28 |
| 03 | సైక్లింగ్ | 07 | 03 | 01 | 0 | 01 | 12 |
| 04 | జిమ్నాస్టిక్స్ | 07 | 03 | 01 | 0 | 01 | 12 |
| 05 | రెస్టులింగ్ | 11 | 05 | 03 | 01 | 02 | 22 |
| 06 | కేనోయిన్గ్ | 05 | 01 | 01 | 0 | 0 | 07 |
| 07 | జూడో | 05 | 01 | 0 | 0 | 0 | 06 |
| 08 | రోయింగ్ | 07 | 02 | 01 | 0 | 01 | 11 |
| 09 | షూటింగ్ | 13 | 07 | 04 | 02 | 02 | 28 |
| 10 | బాక్సింగ్ | 10 | 05 | 02 | 01 | 01 | 19 |
| 11 | ఫెన్సింగ్ | 07 | 02 | 01 | 0 | 01 | 11 |
| 12 | వెయిట్ లిఫ్టింగ్ | 06 | 02 | 01 | 0 | 01 | 10 |
| 13 | టైక్వాండో | 07 | 02 | 01 | 0 | 01 | 11 |
| 14 | ఆర్చరీ | 07 | 03 | 01 | 0 | 01 | 12 |
| 15 | టేబుల్ టెన్నీస్ | 08 | 03 | 01 | 01 | 01 | 14 |
| 16 | బాడ్మింటన్ | 08 | 04 | 02 | 01 | 01 | 16 |
| 17 | టెన్నీస్ | 05 | 02 | 01 | 0 | 0 | 08 |
| 18 | బాస్కెట్ బాల్ | 07 | 03 | 01 | 0 | 01 | 12 |
| 19 | వాలీబాల్ | 06 | 02 | 01 | 0 | 01 | 10 |
| 20 | ఫీల్డ్ హాకీ | 08 | 03 | 01 | 0 | 01 | 13 |
| 21 | ఫుడ్ బాల్ | 07 | 03 | 01 | 0 | 01 | 12 |
| 22 | హ్యాండ్ బాల్ | 05 | 01 | 0 | 0 | 0 | 06 |
| 23 | కబడ్డీ | 05 | 01 | 0 | 0 | 0 | 06 |
| 24 | ఖో – ఖో | 02 | 0 | 0 | 0 | 0 | 02 |
| 25 | సెపక్ టాక్రా | 03 | 0 | 0 | 0 | 0 | 03 |
| 26 | వూషూ | 05 | 01 | 0 | 0 | 0 | 06 |
పోస్టుల వివరాలు :
- కోచ్ ల కేడర్లో గ్రూప్ – B లో ప్రవేశ స్థాయిలో అసిస్టెంట్ కోచ్ పదవి ఉంటుంది
- అసిస్టెంట్ కోచ్లు,కోచ్ – సీనియర్ కోచ్ -చీఫ్ కోచ్ -హై ఫెర్ఫామెన్స్ కోచ్ స్థాయికి సంబంధించిన అర్హత SAI నియామక నిబంధనల ప్రకారం ఉంటుంది
- ఎంపికైన అభ్యర్థులను భారతదేశంలో ఎక్కడ ఐన నియమించ వచ్చును. అభ్యర్థుల సీనియర్ స్థాయి ఆల్ ఇండియా లెవెల్లో కొనసాగుతుంది
- అభ్యర్థులను భారతదేశంలో ఎక్కడైన పోస్టింగ్ ఇచ్చే హక్కు SAI కి ఉంటుంది. కనుక అభ్యర్థులు భారతదేశంలో ఎక్కడైన పనిచేయవలసి ఉంటుంది
- ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం డియర్ నెస్ అలవెన్స్,హౌస్ రెంట్ అలవెన్స్,ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్,సెలవులు,మెడికల్ సదుపాయాలు కల్పిస్తారు
- స్పోర్ట్స్ కిట్స్ కోచ్ కు నిబంధనల ప్రకారం ఇవ్వబడుతుంది.
అర్హతలు :
- అభ్యర్థి ఆన్లైన్ దరఖాస్తు అప్లై చేయడం కోసం కొన్ని అర్హతలను కలిగి ఉండాలి
- అభ్యర్థి దరఖాస్తు చేసుకోవటానికి ప్రారంభ తేదీ నాటికి 30 సంవత్సరాలు కలిగి ఉండవలెను
- SAI NS -NIS,పాటియాలా నుండి లేదా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కోచింగ్ డిప్లొమా లేదా దానికి సస్సమానమైన అర్హతను కలిగి ఉండాలి. లేదా
- ఒలింపిక్స్,పారా ఒలింపిక్స్,ఆసియా ఒలింపిక్స్,వరల్డ్ ఛాంపియన్ షిప్ లలో కోచింగ్ లో సర్టిఫికెట్ కోర్స్ కలిగి ఉండవలెను. లేదా
- అభ్యర్థి క్రీడలలో ద్రోణాచార్య అవార్డు కలిగి ఉండవలెను
పరీక్ష వివరాలు :
- అభ్యర్థుల ఎంపిక రెండు విధాలుగా ఉంటుంది. అవి కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ రాత పరీక్ష (CBT),కోచ్ ఎబిలిటీ పరీక్ష (CAT)
- తుది ఎంపికలో అభ్యర్థుల మార్కుల వెయిటేజ్ CAT లో 60%, CBT లో 40% గా ఉండాలి
- అభ్యర్థులు అర్హతలను పూర్తి చేసిన తరువాత CBT రాత పరీక్ష కు పిలుస్తారు
- CBT రాసిన అభ్యర్థులలో ప్రతి ఖాళీకి 1:3 నిష్పత్తి లో అంటే ప్రతి ఖాళీకి 3 అభ్యర్థులను CAT కోసం షార్ట్ లిస్ట్ చేస్తారు
- సెలక్షన్ కమిటీ అభ్యర్థులు CBT మరియు CAT లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ను తయారు చేస్తోంది. ఈ మెరిట్ లిస్ట్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ జరుగుతుంది.
కోచింగ్ అబిలిటీ టెస్ట్ :
- తుది మెరిట్ లిస్టులో CAT కోచ్ అబిలిటీ టెస్ట్ కి 60% వెయిటేజ్ ఉంటుంది
- అభ్యర్థి యొక్క కోచింగ్ పరిజ్ఞానం,నైపుణ్యం,సానుకూల సంబంధాలు వంటి సామర్ధ్యాలను (CAT) కోచ్ అబిలిటీ టెస్ట్ ద్వారా నిర్వహిస్తారు
- షార్ట్ లిస్ట్ ఐన అభ్యర్థులకు CAT తేదీలు మరియు పరీక్ష కేంద్రాలను తెలియజేస్తారు
- అభ్యర్థి CBT లో ఎంత బాగా రాసిన SAI నిర్ణయించిన కనీస అర్హత ప్రమాణాలు లేకపోతే అనర్హుడిగా ప్రకటించబడతారు
- CAT మార్కులపై రీ-వాల్యూషన్,రీచెక్,రివ్యూ చేయబడవు
- నిర్ణయించిన తేదీ,సమయానికి అభ్యర్థి పరీక్ష కేంద్రానికి చేరుకోలేకపోతే క్వాలిఫై చేయరు
- ఏమైనా కారణాల వల్ల పరీక్ష తేదీలను మరియు కేంద్రాలను మార్పు చేయటానికి లేదా రద్దు చేయడంలో SAI నిర్ణయం తుది నిర్ణయం అవుతుంది
సూచనలు :
- అభ్యర్థులు భారతీయ పౌరులై ఉండవలెను
- ఢిల్లీ,లక్నో,చండీగఢ్,భోపాల్,గాంధీనగర్,కోల్కతా,ముంబై,భువనేశ్వర్,హైదరాబాద్,బెంగుళూరు, తిరువనంతపురం,గువహటి,ఇంపాల్ లో ఆన్లైన్ పరీక్ష కేంద్రాలు. దరఖాస్తుల సంఖ్యను బట్టి పరీక్ష కేంద్రాలు పెరగవచ్చును లేదా తగ్గవచ్చును
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో SC /ST /OBC అభ్యర్థులు ఒరిజినల్ Cast Cartificates మరియు జిరాక్స్ కాపీలమీద గెజిటెడ్ సంతకాలు ఉండవలెను
- OBC అభ్యర్థులు రిజర్వేషన్ కోసం నాన్ క్రీమి లేయర్ సర్టిఫికెట్ చూపించాలి
- కేంద్ర ప్రభుత్యం కేటాయిచబడిన కులాలకు రిజర్వేషన్ వర్తిస్తుంది
- Ews అభ్యర్థులు రిజర్వేషన్ లను పొందాలంటే కేంద్ర ప్రభుత్వ నిబంధనలను పాటించాలి
- Ews సర్టిఫికెట్ ఈ సంవత్సరంలో పొందినదై ఉండాలి
- ఈ సర్టిఫికెట్ ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ లోపల తీసుకున్నదై ఉండాలి
- SC,ST,OBC,EWS,Ex -Servicemen అభ్యర్థులు వయస్సు లేదా రేజర్వేషన్ సడలింపు పొందాలంటే అభ్యర్థులు అర్హుల అని నిర్దారించుకోవాలి.అవసరమైన సర్టిఫికెట్లు అన్ని సరైన ఫార్మాట్ లో ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ లోపు ఉండాలి
- గవర్నమెంట్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి లేదా సంస్థ నుండి విద్య అర్హత తప్పనిసరిగా ఉండాలి
- అభ్యర్థులు సిఫార్సులు,మధ్యవర్తుల ద్వారా రికమండేషన్ చేయిస్తే అప్లికేషన్ రద్దు అవుతుంది
- అవసరం ఐతే పరీక్షకు పిలిచే అభ్యర్థుల సంఖ్యను పెంచడం లేదా తగ్గించడం లేదా పరీక్ష కేంద్రాన్ని అధికారులకు మార్చవచ్చు
- అభ్యర్థులను దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ చేయవచ్చును
- ఎప్పుడైనా అభ్యర్థి ఇచ్చిన సమాచారం తప్పు అని తేలితే జాయిన్ ఐన తరువాత కూడా అభ్యర్థి పోస్టింగ్ ను కాన్సిల్ చేయవచ్చును
- అభ్యర్థి ఉద్యోగ నియామకం పొందాలంటే మెడికల్ ఫిట్నెస్ తప్పనిసరి.SAI నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం మెడికల్ టెస్ట్ లో అర్హతను పొందాలి
- ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన అప్డేట్స్ SAI వెబ్సైటులో మాత్రమే చూడగలరు.కాబట్టి అభ్యర్థులు సమాచారం కోసం వెబ్సైటును తరచుగా చూడగలరు
- కాల్ లెటర్లు,పరీక్ష సమాచారం,సెలక్షన్ వివరాలు అన్ని అభ్యర్థి రిజిస్టర్ చేసిన ఇమెయిల్ ID లేదా SAI వెబ్సైటు కు మాత్రమే వస్తాయి
వేతనం :
- లెవెల్ సిక్స్ ప్రకారం రూ . 35,400/- to 1,12,400/–
వయస్సు :
- 30 సంవత్సరాలు లోపు ఉండాలి
- కట్ ఆఫ్ డేట్ 01- ఫిబ్రవరి – 2026 నాటికీ.
- ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ,వాళ్లకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు ఉంది.
దరఖాస్తు ఫీజు :
- జనరల్,ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రూ. 2,500/-
- ఎస్సీ,ఎస్టీ,ఎక్స్- సర్వీస్ మెన్,మహిళలకు రూ. 2,000/-
దరఖాస్తు విధానము :
- దరఖాస్తును ఆన్ లైన్ లో మాత్రమే అప్లై చేయవలెను.
- సాయి మెయిన్ వెబ్సైటు నుండి మాత్రమే చేయవలెను –www.sportsauthorityofindia.nic.in
- సాయి మెయిన్ వెబ్ సైట్ నుండి కాకుండా మరిఏ ఇతర మార్గాలు ద్వారా అప్లై చేయకూడదు అట్ల అప్లై అప్లికేషన్ను పరిగణలోకితీసుకోరు
- డాక్యూమెంట్స్ కాపీలు పంపించవలచిన అవసరం లేదు
- అప్లై చేయడానికి మెయిల్ కావాలి మరియు మెయిల్ వర్కింగ్ లో ఉండాలి మెయిల్ కి వెరిఫికేషన్ ఓటీపీ వస్తాయి
- ఒక్క సారి రిజిస్ట్రేషన్ మెయిల్ మరియు మొబైల్ నంబర్స్ మార్చచలేరు రిజిస్ట్రేషన్ ముందు చెక్ చేసుకోవాలి రెండు వర్కింగ్ లో ఉండాలి
- ఆన్లైన్ అప్లికేషన్ లో అవసరం ఉన్న డాకుమెంట్స్ స్కాన్ కాఫీస్ అప్లోడ్ చేయాలి
- పాస్ పోర్ట్ సైజు ఫోటో మరియు సంతకము అప్లికేషన్ లో అప్లోడ్ చేయాలి
- ఫోటో మరియు సంతకము ఇమేజెస్ JPG లేదా JPEG లో మాత్రమే ఉండాలి వాటి సైజు ఫోటో –80KB,సంతకము –30KB లో ఉండాలి సైజు ఎక్కువగా ఉన్న అప్లోడ్ ఇష్యూ వస్తాది
- దరఖాస్తును చివరి తేదీ లోపుగా అప్లై చేసుకోవడం మంచిది
- ఫైనల్ సబ్మిట్ చేసాక అప్లికేషను ప్రింట్ అవుట్ తీసుకోవాలి
- ప్రింట్ అవుట్ అప్లికేషన్ ముందస్థు అవసరాల కొరకు అప్లికేషన్ ఐడి,లాగిన్ పాస్వర్డ్ తదితర వివరాలు ప్రింట్ కాపీ లో ఉంటాయి
- దరఖాస్తు కొరకు మెయిన్ వెబ్ సైట్ లింక్ కింద ఇవ్వబడినది.
ఎంపిక విధానము :
- రాత పరీక్ష ఆధారముగా,సర్టిఫికేషన్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారముగా
పరీక్ష కేంద్రములు :
- ఆంధ్రప్రదేశ్,తెలంగాణ వాళ్లకు హైదరాబాద్ లో కూడా పరీక్ష కేంద్రం ఉంది.