RBI OFFICE ATTENDANTS RECRUITMENT 2026 | ఆర్బీఐ ఆఫీస్ అటెండంట్స్ రిక్రూట్మెంట్ 2026 | 572 ఉద్యోగాలు

RBI OFFICE ATTENDANTS RECRUITMENT 2026 :రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్న 572 ఆఫీస్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తులను ఆన్ లైన్ లో అప్లై చేసుకోవలెను.పదో తరగతి SSC పాస్ వారికీ మాత్రమే ఈ ఉద్యోగాలకు హర్హత ఉంది.వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చును.

రిజర్వ్బ్యాంక్ అఫ్ ఇండియా అంటే ఏమిటి :

  • భారత్ దేశపు కేంద్ర బ్యాంక్ అంటే దేశంలో అన్ని బ్యాంకులు RBI ఆధీనములో పని చేస్థాయి
  • RBI ప్రధాన కార్యాలయం ముంబై లో ఉంది 
  • భారతదేశం లో డబ్బు నోట్లల ముద్దరణ RBI ఆధీనంలోనే జరుగుతది 
  • లోన్ వడ్డీ,డిపాజిటి వడ్డీ నియంత్రణ rbi నిర్ణయం మీద ఉంటాది 
  • ధరలు ఎక్కవగా పెరగకుండా నిర్ణయం తీసుకుంటాది 
  • RBI దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక,బాగా పని చేతున్నది 
  • బ్యాంక్ లో మనడబ్బు సేఫ్గా ఉండేలా తోర్పడుతున్నది  
  • డాలర్ మరియు యురొ కరెన్సీ నియంత్రణ 
  • దేశంలో బ్యాంక్స్ అన్ని స్టేట్ బ్యాంక్,hdfc,icici,యాక్సిస్ మొదలైన బ్యాంక్స్ rbi అండర్లోనే పని చేతున్నాయి. 

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభ తేదీ – 15 – జనవరి – 2026.
  • దరఖాస్తు ముగింపు తేదీ – 04 – ఫిబ్రవరి – 2026.

పోస్ట్ పేరు మరియు ఖాళీలు :

  • ఆఫీస్ అటెండెంట్ – 572

కార్యాలయం మరియు వర్గాలు వారీగా ఆఫీస్ అటెండెంట్ ఖాళీలు :                                    

ఆఫీస్ పేర్లు  ఎస్సీ  ఎస్టీ  ఓబీసీ   ఈడబ్ల్యూఎస్   జనరల్  మొత్తం  P  – A  P -B  P -C  P -D  EX 1 EX  – 2
అహ్మదాబాద్  0 8(2) 1 2 18 29 1 1(1) 0 0 1 5
బెంగుళూర్  3 0 5 1 7 16 1 0 1(1) 0 0 3
భోపాల్  0 3(3) 0 0 1 4 0 1(1) 0 1 0 0
భువనేశ్వర్  6 8(3) 4 3 15 36 0 0 2(1) 0 1 6
చండీఘర్  1 0 0 0 1 2 0 0 0 0 0 0
చెన్నై  0 0 8(8) 0 1 9 0 0 0 0 0 0
 గువాహటి  2 15 9 5 21 52 0 0 1 2(1) 2 10
హైదరాబాద్  3(1) 3(2) 0 3 27 36 1 1(1) 0 1(1) 1 6
జైపూర్  8 5 5 4 20 42 2(1) 0 0 1 1 8
కాన్పూర్ & లక్నో  33 0 19 12 61 125 2 1 1 2(1) 5 25
కోల్ కతా  23 1 21 9 36 90 0 1 1 1 4 18
ముంబాయ్  0 11(2) 0 3 19 33 0 3(3) 2(1) 1(1) 1 6
న్యూ ఢిల్లీ  4 0 11 6 40 61 1 2(1) 1 0 2 12
పాట్నా  6 4 0 3 24 37 0 0 1 3(2) 1 7
మొత్తం  89(1) 58(12) 83(8) 51 291 572 8(1) 10(7) 10(3) 12(6) 19 106

 

విద్యార్హతలు :

  • పదో తరగతిలో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి.
  • అభ్యర్థి 01- 01- 2026 నాటికి గ్రాడ్యుయేట్ కాకూడదు 
  • డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదువుకున్న వారు ఈ పోస్టులకు పరిగణలోకి తీసుకొనబడరు 
  • ఎక్స్- సర్వీస్ మెన్ అభ్యర్థులు 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.కనీసం 15 సంవత్సరాలు రక్షణ సేవ చేసి ఉండాలి 
  • అభ్యర్థి అప్లై చేస్తున్న రాష్ట్రము యొక్క భాషను రాయగలగాలి,చదవగలగాలి,మాట్లాడగలగాలి,మరియు అర్ధం చేసుకోగలగాలి 

వయస్సు (Age ):

  • 18 నుండి 25 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి.
  • కట్ ఆఫ్ డేట్ 1- జనవరి -2026 నాటికి
  • ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు,ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు,పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.

వేతనం (Salary ):

  • ప్రారంభ వేతనం రూ.24,250/-
  • నెలకు రూ. 46,029/-
  • బ్యాంక్ హౌస్ ఇవ్వకపోతే 15% రెంట్ అలవెన్స్ ఇస్తారు 

ఇతర సౌకర్యాలు :

  • బ్యాంక్ నివాసం 
  • వైద్య సదుపాయాలు 
  • చదువుల ఖర్చుల తిరిగి ఇవ్వడం 
  • ఇన్సూరెన్సు 
  • వాహన భీమా 
  • గ్రాట్యుటీ మరియు కొత్త పెన్షన్ 
  • లీవ్ అండ్ ట్రావెల్ కాన్సలేషన్ 
  • ప్రయాణ భత్యం 

రోజు వారి పని విధానము :

  • రోజు సమయానికి కార్యాలయంను తెరవడం / మూసి వేయడం 
  • రికార్డ్స్ రోజు వారికీ గా  నిర్వహిచడం
  • ఫైల్స్ ను సదరు ఆఫీసర్స్ టేబుల్స్ దగ్గరకు తీసుకెళ్ళడం 
  • కార్యాలయ పని సామాగ్రి పంపిణీ చేయడం 
  • కార్యాలయ పేపర్స్ ఫోటో కాపీ తియ్యడము అవసరమైనవి 
  • కార్యాలయం సాధారాణ సహాయక పనులు చేయడం 
  • ఆఫీసుకు వచ్చిన కొరియర్ /పార్సిల్ తీసుకోవడం రికార్డు చేయడం  

ఎంపిక విధానము (Selection Process ):

  1. ఆన్ లైన్ పరీక్ష 
  2. LPT (language Proficiency Test) బాష నైపుణ్యాల పరీక్ష 

 1. ఆన్ లైన్ పరీక్ష :

  • ఆన్లైన్ పరీక్ష 90 నిముషాలు ఉంటుంది 
పరీక్ష పేరు  ప్రశ్నలు  మార్కులు 
రీజనింగ్  30 30
జనరల్ ఇంగ్లీష్  30 30
జనరల్ అవర్నస్  30 30
న్యూమరికాల్ ఎబిలిటీ  30 30
మొత్తం  120 120

 

 2. బాషా నైపుణ్యాల పరీక్ష :

  • సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఆన్ లైన్ టెస్ట్ లో బాషా నైపుణ్యాల (LPT ) పరీక్ష ఉంటుంది 
  • రాష్ట్ర అధికార మరియు స్థానిక భాషలో పరీక్ష విధానం నిర్వహిస్తారు 
  • బాష ఫై అవగాహన లేకపోతే అర్హత రద్దు అవుతుంది 

ముఖ్యమైన గమనికలు :

  • జనరల్ ఇంగ్లీష్ తప్ప మిగిలిన ఇంగ్లీష్,హిందీ మరియు కొన్ని ప్రాంతీయ భాషలో ఉంటాయి 
  • ప్రతి తప్పు సమాధానానికి 1/4 రేషియో ప్రకారం నెగిటివ్ మార్క్ ఉంటుంది 
  • ప్రతి సెక్షన్ లోను విడివిడిగ పాస్ కావలసి ఉంటుంది 
  • హాల్ టికెట్ మరియు ఎక్సమినేషన్ కు సంబంధించిన అన్ని వివరాలను కాల్ లెటర్ తో బ్యాంక్ వెబ్సైటులో ఇస్తారు 
  • ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా LPT కి ఎంపిక అయిన అభ్యర్థుల రూల్ నంబర్లను వెబ్సైటులో పెడతారు 
  • అధిక మార్కులను సాధించిన అభ్యర్థులను మాత్రమే LPT కి పిలుస్తారు 
  • బాష నైపుణ్యాల పరీక్ష (LPT ) ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా రాయవలసి ఉంటుంది 
  • ఇందులో ఎటువంటి మినహాయింపులు ఇవ్వబడవు 
  • ఈ పరీక్ష బ్యాంక్ యొక్క సంబంధిత రీజనల్ ఆఫీసుల్లో నిర్వహించబడతాయి 
  • ఆన్లైన్ పరీక్ష లో మెరిట్,LPT అర్హత,మెడికల్ ఫిట్నెస్,సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వంటి అంశాలపై బ్యాంక్ నిర్ణయం ఆఖరి నిర్ణయం అవుతుంది 
  • సెలెక్ట్ ఐన అభ్యర్థి  బ్యాంక్ నియమాల ప్రకారం ఆరోగ్యంగా ఉండాలి.లేకపోతే నియామక ప్రక్రియ రద్దు కావచ్చును 

పరీక్ష కేంద్రాలు:

  • పరీక్ష కేంద్రాలు భారతదేశం అంతటా అనేక కేంద్రాలలో ఆన్లైన్ పరీక్ష ఉంటుంది 
  • బ్యాంక్ అవసరమైతే కొన్ని పరీక్షా సెంటర్లను తొలగిస్తుంది.కొన్ని కొత్త సెంటర్లను కలుపుతుంది 
  • అభ్యర్థి అప్లై చేసిన ఆఫీస్ ప్రకారం సెంటర్ను ఎంచుకోవాలి. కొన్ని సందర్బాలలో అభ్యర్థి ఎంచుకున్న సెంటర్ కాకుండా వేరే సెంటర్ ను బ్యాంక్ ఇవ్వవచ్చును 
  • అభ్యర్థి ఎక్సామ్ కి వెళ్ళటానికి,రావటానికి  సంబంధించిన ప్రయాణ ఖర్చులను బ్యాంకు ఇవ్వదు 
  • అభ్యర్థి ఒకసారి సెంటర్ ని ఎంచుకుంటే తరువాత మార్చలేరు 

అప్లికేషన్  ఫీజు :

  • జనరల్,ఓబీసీ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు రూ.450/-
  • ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూబీడీ,ఎక్స్ -సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు రూ.50/-
  • బ్యాంక్ ఉద్యోగులకు  ఫీజు లేదు 

నోట్ :

  • బ్యాంకు చార్జీలు ఆన్లైన్ పేమెంట్ చేసినప్పుడు బ్యాంక్ ట్రాన్స్యాక్షన్  చార్జీలను అభ్యర్థులే భరించాలి 
  • బ్యాంక్ లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఫీజు మినహాయింపు ఉంది.
  • నోటిఫికేషన్ లో చెప్పిన అర్హతలు ఉంటేనే బ్యాంక్ లో పనిచేసే ఉద్యోగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది 
  • ఫీజు చెల్లించకుండా అప్లై చేస్తే అప్లికేషన్ రద్దు అవుతుంది 
  • నోటిఫికేషన్ లో ఉన్న పద్దతిలోనే ఫీజు చెల్లించాలి.ఇతర పద్దతులలో ఫీజు చెల్లిస్తే అప్లికేషన్ రద్దు అవుతుంది
  • ఒక్కసారి ఫీజు కట్టిన తరువాత ఎలాంటి సమయంలోనైనా ఫీజు తిరిగి ఇవ్వడం జరగదు 

దరఖాస్తు విధానము :

  • దరఖాస్తును ఆన్ లైన్ ద్వారా మాత్రమే పెట్టవలెను
  • బ్యాంకు ఆధికారిక సైట్ లో కరెంటు ఓపెనింగ్స్ ఓపెన్ చేయండి 
  • బ్యాంకు మెయిన్ వెబ్ సైట్ ఓపెన్ చేయడం మరియు నోటిఫికేషన్ క్లియర్ గ చదవండి 
  • కొత్తగా రిజిస్ట్రేషన్ కోసం – రిజిస్టర్ – న్యూ యూజర్  పై క్లిక్ చేయండి 
  • రిజిస్టర్ పేజీ లో కంప్లీట్ డీటెయిల్స్ తో నింపండి/నేమ్ / ఫోన్ నెంబర్ /మెయిల్ ఐడి రిజిస్టర్ చేయండి తరువాత యూసర్ నామ/ పాస్వర్డ్ కూడా చేయండి 
  • యూజర్  నేమ్ / పాస్వర్డ్ తో లాగిన్ తరువాత,పర్సనల్ డీటెయిల్స్,ఎడ్యుకేషన్ డీటెయిల్స్,రాష్టం వివరాలు,పరీక్ష కేంద్రము వివరాలు నమోదు చేయండి,పాసుపోర్టు సైజు ఫోటో & సంతకమును స్కాన్ చేయండి మరియు అప్లికేషన్ లో అప్లోడ్ చేయండి  
  • అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ లోనే పే చేయండి 
  • దరఖాస్తును ముందుగా మరికసారి చెక్ చేయండి,తరువాత పూర్తి సబ్మిషన్ చేయండి
  • సబ్మిట్ చేయబడిన దరఖాస్తును ప్రింట్ అవుట్ తీసుకోవడం మరువకండి    
  • ఆన్ లైన్ అప్లికేషన్ లింక్ దిగువన ఇవ్వబడినది.

అప్లికేషన్ సవరించే అవకాశం (Edit Window )

  • దరఖాస్తు తప్పుల సవరణకు బ్యాంక్ అభ్యర్థికి ఒకసారి మాత్రమే అవకాశం ఇస్తుంది 
  • పూర్తి అప్లికేషన్ సబ్మిట్ చేసినవారు,ఫీజు చెల్లించినవారు మాత్రమే అప్లికేషన్ ను సవరణ చేయగలరు.పూర్తిచేయలేని అప్లికేషన్ ను ఎడిట్ చేయలేరు 
  • ఒకసారి సవరణ చేసి సబ్మిట్ చేసిన అప్లికేషన్ ను మళ్ళీ మళ్ళీ మార్చలేరు 
  • దరఖాస్తు సమయం ముగిసిన తరవాత ఎటువంటి మార్పులు చేయలేరు.రిక్వెస్ట్ కూడా తీసుకొనబడదు 
  • ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్ పెట్టిన వారు లెటస్ట్ అప్లికేషన్ మాత్రమే ఎడిట్ చేయాలి.దానినే ఆఖరిగా తీసుకుంటారు 
  • ఈ నోటిఫికేషన్ గురించి ఏమైనా మార్పులు ఉంటే RBI వెబ్సైటులో ప్రకటిస్తారు.

  నోటిఫికేషన్ లింక్ 

ఆన్ లైన్ అప్లికేషన్ లింక్