Bank of Maharashtra Recuritment 2026 : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 600 అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న 600 అప్రెంటీస్ పోస్టులలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా పోస్టులు ఉన్నాయి.అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులను చేసుకోవచ్చును.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ – 15 – జనవరి – 2026.
- దరఖాస్తు ముగింపు తేదీ – 25 – జనవరి – 2026.
పోస్ట్ పేరు మరియు ఖాళీలు :
- అప్రెంటీస్ – 600
- ఆంధ్రప్రదేశ్ – 11 ఖాళీలు
- తెలంగాణ – 17 ఖాళీలు
అర్హతలు :
- ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ లో ఉత్తీర్ణతను కలిగి ఉండవలెను.
- లోకల్ లాంగ్వేజ్ 10th మరియు 12th క్లాసెస్ లో తప్పనిసరిగా ఉత్తీర్ణత ఉండాలి.
వయస్సు :
- కనీసం 20 నుండి 28 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి
- ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది
- ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది
- ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది
జీతము :
- అప్రెంటీస్ కు ఒక సంవత్సర శిక్షణ సమయానికి నెలకు రూ.12,300/- స్టైపెండ్ ఇవ్వబడుతుంది.
ట్రైనింగ్ కాల వ్యవది :
- అప్రెంటీస్ ఒక సంవత్సరం కాల వ్యవధి ఉంటుంది
- అప్రెంటీస్ కి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
ఇతర నిబంధనలు మరియు షరతులు :
- అభ్యర్థి గతంలో ఏ కంపెనీలలో లేదా సంస్థల్లోనూ అప్రెంటిస్ శిక్షణ పొందినవారు అయి ఉండకూడదు.అలాగే అభ్యర్థి అప్రెంటీస్ శిక్షణను మధ్యలో ఆపివేసిన వారు కాకూడదు. ప్రెజంట్ ఏ సంస్థల్లోనూ,కంపెనీలల్లోను,బ్యాంకుల్లోను శిక్షణలో వున్నవారు అర్హులు కారు
- ఎడ్యుకేషన్ క్యాలిఫికేషన్స్ పూర్తీ ఐన తరువాత 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉద్యోగ అనుభవం ఉన్న అభ్యర్థులు అప్రెంటీస్ ఎంపికకు అర్హులు కారు
- శిక్షణ కాలం పూర్తీ ఐన తరువాత అప్రెంటీస్ కు బ్యాంకులో ఉద్యోగం అడిగే హక్కు లేదు
- శిక్షణ సమయంలో ప్రయాణ ఖర్చులు మరియు నివాస ఖర్చులు అప్రెంటీస్కి ఇవ్వబడవు
- అభ్యర్థులు శిక్షణ ప్రారంభానికి ముందు Apprentice Ship కాంట్రాక్టు పై సంతకం చేయాలి
- Apprenticeship సెలెక్ట్ ఐన అభ్యర్థులు బ్యాంకుకు సంబంధించిన నియమాలు మరియు విధానాలను పాటించవలెను
అప్లికేషన్ ఫీజు :
- జనరల్,ఓబీసీ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 150/-
- ఎస్సీ,ఎస్టీ,అభ్యర్థులకు రూ. 100/–
- పీడబ్ల్యుబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక విధానము :
- ఆన్లైన్ అప్లికేషన్ లో క్లియర్ గ ఇవ్వాలి డీటెయిల్స్ మరియు ఎడ్యుకేషన్ పాస్ మార్కస్ పర్సెంటేజ్
- మెరిట్ లిస్ట్ రాష్ట్రాల వారీగా విడుదల చేస్తారు
- ఒకే ర్యాంక్ వచ్చిన అభ్యర్థులు ఎక్కువగా ఉన్నట్లైతే అభ్యర్థుల వయస్సు బట్టి మెరిట్ లిస్ట్ తయారుచేస్తారు
- డిప్లొమా తరువాత ఇంజనీరింగ్ పూర్తి చేసినవారికి ఇంజినీరింగ్ నాలుగు సంవత్సరాల మర్క్స్ సగటున మెరిట్ లిస్ట్ తయారు చేయబడుతాది
- మెరిట్ లిస్ట్ను పూర్తిగా అభ్యర్థి ఆన్లైన్ లో ఇచ్చిన డేటా ఆధారముగా తయారు చేస్తారు
- సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ లో అభ్యరులు ఇచ్చిన డేటా తప్పుగా ఉన్న వారిని క్వాలిఫై చేయరు
శిక్షణ ఒప్పందం మరియు సర్టిఫికెట్ :
- అప్రెంటిస్ Act ప్రకారం 1961 ప్రకారం అప్రెంటిస్ మరియు బ్యాంక్ మధ్య జరిగే అప్రెంటిస్ ఒప్పందం ద్వారా మొత్తం ట్రైనింగ్ ఉంటుంది
- ఈ అప్రెంటీస్ ఒప్పందానికి సంతకం చేసిన తేదీ నుండి 3 నెలల లోపు Apprenticeship Advisor వద్ద పోర్టల్ రిజిస్టర్ చేయవలెను
- ఎంపికైన అభ్యర్థులు బ్యాంక్ తో Apprenceship Training Contrat ఫై సంతకం చేయవలెను
- బ్యాంక్ తప్పు వల్ల కాంట్రాక్టు మధ్యలో రద్దు అయినట్లైతే అభ్యర్థి ఆఖరిగా తీసుకునే 3 నెలల స్టైఫెండ్ కి సమానమైన మొత్తాన్ని పరిహారంగా చెల్లిస్తారు
- అభ్యర్థి తన తప్పు వల్ల ఒప్పందాన్ని పాటించక పోయినట్లయితే ట్రైనింగ్ ఖర్చుల నిమిత్తం బ్యాంక్ కి నష్టపరిహారం చెల్లించాలి
- అభ్యర్థి ట్రైనింగ్ పూర్తి చేసిన తరువాత నేషనల్ కౌన్సిల్ నిర్వహించే టెస్టులో పాస్ అయినట్లైతే Proficiency Certificate అందజేస్తారు
- ట్రైనింగ్ టైములో అభ్యర్థికి ప్రమాదం జరిగినట్లైతే వైద్యానికి అయ్యే ఖర్చులను ఉచితంగా ఇస్తారు
- అభ్యర్థులకు ట్రైనింగ్ టైములో బ్యాంక్ వసతి ఇవ్వదు.అభ్యర్థులే వసతి ఏర్పాట్లు చేసుకోవాలి
సాధారణ సమాచారం :
- అభ్యర్థులు దరఖాస్తును ఆన్లైన్ లో అప్లై చేసినతరువాత అప్లికేషన్ ఫామ్ ని జీరాక్స్ తీసుకుని ఉంచాలి
- అభ్యర్థి అప్లై చేసిన పోస్టుకు అర్హుల కాదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి
- ఫామ్ లో ఇచ్చిన వివరాలను ఆధారంగా చేసుకుని బ్యాంక్ అభ్యర్థిని పరీక్ష మరియు ఇంటర్వ్యూ కి పిలుస్తుంది
- ఒక అభ్యర్థి ఒక దరఖాస్తును మాత్రమే అప్లై చేయాలి.ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులను అప్లై చేసినట్లైతే ఆఖరిగా అప్లై చేసిన దరఖాస్తును మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు
- అభ్యర్థి సెలక్షన్ అయినప్పుడు ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లను,బర్త్ సర్టిఫికెట్ ను ఒరిజనల్ డాక్యుమెంట్లను చూపించాలి
- SC/ST /OBC అభ్యర్థులు గవర్నమెంట్ నిర్ణయించిన విధానం ద్వారా కుల ధ్రువీకరణ పత్రంను సమర్పించవలెను
- బ్యాంక్ నుండి వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవటానికి అభ్యర్థులు తమ యొక్క ఈమెయిల్ ID ని యాక్టివ్ గ ఉంచుకోవాలి
- అభ్యర్థి యొక్క సెలక్షన్ ప్రాసెస్ ను విధానాన్ని ఏ సమయంలో ఐన రద్దు చేసే అధికారం బ్యాంక్ కి ఉంటుంది
- ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్ లిస్ట్ ఆధారంగా ఉంటుంది.సిఫార్సులు,రికమండేషన్లను చేస్తే బ్యాంక్ అంగీకరించదు.
ఎంపిక సమయంలో ఇవ్వవలసిన డాక్యుమెంట్స్ :
- సెలెక్ట్ ఐన అభ్యర్థులు ఒరిజనల్ డాక్యుమెంట్లను మరియు అభ్యర్థి సంతకం ఉన్న ఫోటో కాపీలను తప్పని సరిగా ఇవ్వవలెను
- అభ్యర్థి దరఖాస్తును అప్లై చేసిన తరువాత తీసుకున్న Onlion Application Form Printout ను తప్పనిసరిగా ఇవ్వవలెను
- అభ్యర్థి యొక్క Birth Certificate 10 వ తరగతి సర్టిఫికెట్లో ఉన్న విధముగా ఉండవలెను
- అభ్యర్థి గుర్తింపు నిమిత్తం ఆధార్ కార్డు,ఓటర్ ID,PAN కార్డ్,పాసుపోర్టు,డ్రైవింగ్ లైసెన్సు మొదలగు వాటిలో ఏదైనా ఒక దానిని తీసుకెళ్లవలెను
- అభ్యర్థులు 10వ తరగతి నుండి డిగ్రీ వరకు ఉన్న అన్ని మార్క్ లిస్ట్ లను మరియు సర్టిఫికెట్లకు సంబంధించిన ఒరిజినల్స్ అన్ని Cut-Off Date ముందే వచ్ఛినవై ఉండవలెను
- SC/ST/OBC అభ్యర్థులు ప్రభుత్వం నిర్దేశించిన ఫార్మేట్లో ఉన్న Cast కార్టిఫికెట్ ను ఇవ్వవలెను
- OBC అభ్యర్థులు Non –Creamy Layer అని తప్పనిసరిగా ఉండవలెను నోటిఫికేషన్ తేదీకి ఉపయోగపడే విధంగా ఉండాలి
- సర్టిఫికెట్ లో ఉన్న కులం పేరు కేంద్ర జాబితాలో ఉన్న పేరుతో సరిపోవాలి
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఏమైనా తప్పులు లేదా తప్పుడు సమాచారం ఇచ్చినట్లైతే అభ్యర్థిని డిస్ క్వాలిఫై చేస్తారు
- అభ్యర్థి ఆన్ లైన్ దరఖాస్తులో పంపిన సమాచారం ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు
- రాష్ట్రాల వారీగా ఒక సంవత్సరం పాటు వెయిటింగ్ లిస్ట్ నిర్వహించడం జరుగుతుంది.సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా శిక్షణకు రాకపోయినా లేదా ఖాళీలు మిగిలిన వెయిటింగ్ లిస్ట్ నుండి అభ్యర్థులను పిలుస్తారు
దరఖాస్తు విధానము :
- అభ్యర్థులు దరఖాస్తును ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయవలెను
- అప్లై కోసం బ్యాంక్ అఫ్ మహారాష్ట్ర వెబ్సైటుకి వెళ్లవలెను
- మెయిన్ సైట్ లో ఉన్న కరెంటు ఓపెనింగ్ కి వెళ్లవలెను అప్రెంటిస్ ఖాళీలు సెలెక్ట్ చేయండి ఫారం ఓపెన్ అవుతాది
- ఆ ఫారం లో కంప్లీట్ డీటెయిల్స్ పర్సనల్ మరియు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ తో నింపండి
- పాస్ పోర్ట్ సైజు ఫోటో మరియు సంతకం కూడా అప్లోడ్ చేయాలి,వాటి ఇమేజ్ మరియు సైజు jpg ఫార్మాట్ లో అప్లోడ్ చేయండి
- మీరు ఇచ్చిన డీటెయిల్స్ ను బట్టి మీ సెలక్షన్ ప్రాసెస్ ఉంటాది
- అభ్యర్థి వ్యక్తిగత ఈమెయిల్ ఐడి మరియు ఫోన్ నెంబర్ పనిచేసి విధంగా ఉండాలి.సెలక్షన్ ప్రాసెస్ పూర్తీ అయ్యే వరకు యాక్టివ్ గ ఉండటం వల్ల నోటిఫికేషన్ సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చును
- బ్యాంకు సంబందించిన సమాచారాన్ని ఈమెయిల్ ద్వారా మాత్రమే పంపుతుంది.అభ్యర్థికి ఈమెయిల్ ఐడి లేకపోతే అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవటానికి ముందే ఈమెయిల్ ఐడి ని సృష్టించుకోవలెను
- సబ్మిట్ చేయబడిన అప్లికేషన్ని ప్రింట్ అవుట్ తీసుకోండి,సెలక్షన్ టైం లో ఉపయోగపడుతాది
- ఆన్ లైన్ అప్లై కోసం మహారాష్ట్ర బ్యాంకు మెయిన్ వెబ్ సైట్ చూడగలరు,వెబ్ సైట్ లింక్ దిగువన ఇవ్వబడినది.